cop arrested
-
ట్రాఫిక్ చలాన్ల స్కాం: పోలీసులే దొంగలైతే.. రూ. 3.23 కోట్లు స్వాహా..
హర్యానా: హర్యానాలో హవాల్దార్ జనక్, ఓంబీర్ అనే ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ట్రాఫిక్ చలాన్ సొమ్మును ప్రభుత్వ ఖాతాలో కాకుండా తమ వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకుంటూ దాదాపుగా మూడు కోట్లు దోచుకున్నారు. ఇద్దరిలో ఒక కానిస్టేబుల్ జనక్ పోలీసులకు పట్టుబడగా మరో కానిస్టేబుల్ ఓంబీర్ మాత్రం పరారీలో ఉన్నాడు. పాల్వాల్ స్టేషన్లో వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీగ లాగితే.. కొద్దీ రోజుల క్రితం హర్యానా ఎస్పీ లోకేంద్ర సింగ్ మే నెలలో విధించిన ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన నివేదికను కోరగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హర్యానా ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న జనక్, ఓంబీర్ ఇద్దరూ చేతులు కలిపి ఈ చలానా సొమ్ములో చిన్నమొత్తాన్ని ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లలో వేస్తూ మిగిలింది తమ ఖాతాలోకి దారి మళ్లించారు. ప్రభుత్వ అకౌంట్లో కాకుండా.. ట్రాఫిక్ డీఎస్పీ సందీప్ మోరే తెలిపిన వివరాల ప్రకారం.. చాలా కాలంగా మా ఖాతాలో ఏ రోజుకు ఆ రోజు వేయాల్సిన సొమ్మును 15 రోజులకు ఒకసారి వేస్తూ ఉండటంతో అనుమానం వచ్చి జనవరి 2020 నుండి మార్చి 2023 వరకు రికార్డులను పరిశీలిస్తే ఈ స్కాం బయటపడింది. ఈ కానిస్టేబుళ్లు ఇద్దరూ కలిసి కరోనా సమయం నుండి మొదలుపెట్టి ఇప్పటివరకు సుమారు 3.23 కోట్లు స్వాహా చేశారని తెలిపారు. మూడు సంవత్సరాల నుండి.. 2020 జూన్, అక్టోబర్ నెలల్లో మొత్తం రూ. 14 లక్షలు చలాన్ల రూపంలో రావాల్సి ఉండగా వీరు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని తెలిపారు. బహుశా నకిలీ చలాన్లు సృష్టించి వీళ్ళు మాయ చేసుంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆగస్టు 1 నుండి 31 వరకు సుమారు రూ. 1.4 లక్షలు డిపార్ట్ మెంటుకు రావాల్సి ఉండగా అందులో రూ.14,500 తగ్గిందని, అక్టోబరులో రూ.1800 తగ్గిందని ఇలా వీరు గడిచిన మూడు నాలుగేళ్ళలో కేవలం రూ.30 లక్షలు మాత్రమే డిపార్ట్ మెంట్ ఖాతాలో వేసి మిగిలిన రూ.3.23 కోట్లు కాజేశారని తెలిపారు. ఇది కూడా చదవండి: పెళ్ళైన ఒక్క రోజుకే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నవవధువు.. -
అత్త సూటిపోటి మాటలు.. వేధింపులు భరించలేక అల్లుడు..
సాక్షి,హుబ్లీ (కర్ణాటక): అత్త వేధింపులకు అల్లుడు బలయ్యాడు. ఈ ఘటన హుబ్లీ తాలూకా బ్యాహట్టి గ్రామంలో చోటు చేసుకుంది. మహమ్మద్‌రఫిక్ నదాఫ్ అనే వ్యక్తి భార్య అసామతో కలిసి గ్రామంలోనే తన అత్త సాహెబీ ఇంటి ఎదుటనే నివాసం ఉంటున్నాడు. అత్తతోపాటు పొరుగింటిలో ఉంటున్న ముదుకప్ప, మాంత్యలు సూటిపోటి మాటలతో వేధిస్తుండటంతో మహమ్మద్‌రఫిక్ నదాఫ్ మనో వేదనకు గురై సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హుబ్లీ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఏఎస్ఐకు 20 ఏళ్ల జైలుశిక్ష మైసూరు: ఆపదలో ఉన్నవారిని రక్షించాల్సిన పోలీస్ అధికారి అయి ఉండి మతిస్థిమితం లేని యువతిని చెరబట్టిన కామాంధునికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం అంతర సనహళ్ళి వద్ద యువతిపై ఏఎస్ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధిస్తూ జిల్లా 2వ సెషన్స్ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లిఖార్జునస్వామి మంగళవారం తీర్పు వెలువరించారు. ఒంటరి యువతిని చూసి.. 2017న జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్లినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటిరోజును ఈ దారుణం తెలిసి యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఉమేశయ్య నేరం చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు. ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. రూ. లక్ష జరిమానాను బాధితురాలిగా అందజేయాలని దోషిని ఆదేశించారు. కాగా ఉమేశయ్య జీపు డ్రైవర్‌పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి. చదవండిః కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఏకరీతిగా భూ రిజిస్ట్రేషన్..! -
భారతీయ వృద్ధుడిపై దాడి కేసు చెల్లదట
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన వృద్ధుడిపై ఇద్దరు పోలీసులు అత్యంత దారుణంగా దాడిచేసిన కేసును స్థానిక కోర్టు కొట్టిపారేసింది. దాంతోపాటు ఈ కేసును చెల్లని విచారణగా పేర్కొనడం గమనార్హం. గతేడాది ఫిబ్రవరిలో సురేష్ భాయ్ పటేల్ (57) అనే వృద్ధుడిని ఇద్దరు పోలీసు అధికారులు అడ్డుకుని ప్రశ్నించగా... ఆయన ఇంగ్లీష్‌లో సమాధానం ఇవ్వలేకపోయారు. ఆగ్రహించిన పోలీసులు వృద్ధుడిపై దాడిచేయగా, ఓ వ్యక్తి ఈ దృశ్యాలను చిత్రీకరించాడు. వీడియోతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో దాడికి పాల్పడిన వారిలో ఎరిక్ పార్కర్ అనే అధికారిని సస్పెండ్ చేసి, అరెస్టు చేసి అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు. మాడిసన్ నగర పోలీసు చీఫ్ లారీ మున్సీ బాధితుడికి క్షమాపణలు కూడా చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పటేల్ సమాధానం చెప్పలేకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది. ఫెడరల్ చట్టాలను ఏమైనా ఉల్లంఘించారేమో తేల్చేందుకు ఈ విచారణ జరిపారు. అమెరికన్ కోర్టు ఈ చెల్లని కేసును చెల్లని రెండు సార్లు విచారణ చేశామని తాజాగా పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో తొలిసారి, నవంబర్ నెలలో రెండోసారి ఈ కేసు చెల్లదంటూ కింది స్థాయి కోర్టు తీర్పు ఇచ్చింది. తనకు ఇంగ్లీష్ రాదంటూ ఆ వృద్ధుడు చెబుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. గతేదాడి ఈ వీడియో యూట్యూబ్‌లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. మనవడు పుట్టడంతో చూడాలని.. కొడుకు, కోడలికి సాయంగా ఉండాలని వచ్చిన పటేల్ పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి అప్పటినుంచి చికిత్స పొందుతున్నారు. -
మేల్ ఎస్కార్ట్స్ సేవల పేరుతో మోసం!
-
భారతీయ వృద్ధుడిపై దాడి: అమెరికా పోలీసు అరెస్టు
అమెరికాలో భారత సంతతికి చెందిన వృద్ధుడిపై అత్యంత దారుణంగా దాడిచేసిన ఇద్దరు పోలీసు అధికారుల్లో ఒకరిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ విచారణ జరపనుంది. ఫెడరల్ చట్టాలను ఏమైనా ఉల్లంఘించారేమో తేల్చేందుకు ఈ విచారణ జరుపుతారు. సురేష్ భాయ్ పటేల్ (57) అనే వృద్ధుడికి ఇంగ్లీషు రాదు. దాంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. అంతే, ఇద్దరు పోలీసు అధికారులు అతడిని పట్టుకుని దారుణంగా దాడిచేశారు. దీనిపై మాడిసన్ నగర పోలీసు చీఫ్ లారీ మున్సీ క్షమాపణలు చెప్పారు. పటేల్ కుటుంబానికి, ఎన్నారైలు అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని ఆయన అన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పటేల్ సమాధానం చెప్పలేకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. దాడి చేసిన ఇద్దరిలోపార్కర్ అనే పోలీసు అధికారి మూడో డిగ్రీ దాడికి పాల్పడటంతో అతడిని అరెస్టు చేశామని, ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని సిఫార్సు చేశామని అంటున్నారు. మరోవైపు.. వృద్ధుడిపై దాడి వీడియో ఇంటర్నెట్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. పటేల్ కాళ్లను కాళ్లతో తన్ని కింద పడేసి మరీ కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది.