శ్రీనగర్‌కాలనీ: ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తే ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడమేగాకుండా 80శాతం ప్రమాదాలను నివారించవచ్చని ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ సీఐ శ్రీకాంత్‌గౌడ్ అన్నారు. హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ తదితర ఉల్లంఘనలకు పాల్పడినా చలాన్లు కడితే సరిపోతుందిలే అనుకంటే పొరపాటే...కొత్త నిబంధనలతో జరిమానాలు ఐదు రెట్లు పెరగడంతో పాటు కఠిన శిక్షలు అమలులోకి వస్తున్నాయన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి వస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ జరిమానాలు, ట్రాఫిక్ నిబంధనలపై బుధవారం వాహనదారులకు అవగాన కల్పించారు.
చలాన్లు ఐదింతలు...
నూతన ట్రాఫిక్ నిబంధనల ద్వారా చలాన్లు ఐదింతలు పెరిగాయి. వాహనదారుల్లో మార్పు తక్కువగా ఉండటంతో ఉన్నతాధికారులు చలాన్లను తీవ్రతరం చేశారు. వాహనదారులు ఈ విషయమై అవగాహన పెంచుకొని ట్రాఫిక్ ఉల్లంఘనలపట్ల జాగ్రత్తగా ఉండాలి.
తాగినడిపితే జైలుకే...
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 10 వేల జరిమానాతో పాటు జైలు కెళ్లాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లను ఒకప్పుడు వారాంతాల్లో నిర్వహించే వాళ్లం...ఇప్పుడు ప్రతిరోజు డ్రైవ్‌లను నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవర్ల పని పడుతున్నాం. రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దుచేసి కఠిన శిక్షలను అమలు చేస్తున్నాం.
చలానా కట్టకపోతే కఠిన చర్యలు..
చలానాలు కట్టకపోతే ఏమీకాదులే అని అనుకుంటే పొరపాటే.. నూతన నిబంధనలతో జైలుకు వెళ్లాల్సిందే. పెండింగ్‌లో ఉన్న చలానాలు చెల్లించకపోతే ఎదురయ్యే పరిణామాలను సవివరంగా ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఐదు కంటే ఎక్కువ చలానాలు ఉన్న వాహనాలకు చార్జిషీట్లు వేస్తూ, ఆరు నెలల జైలుతో పాటు జరిమానా కూడా విధిస్తున్నారు. వాహనదారులు ప్రతిఒక్కరూ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండాలి. ఇన్సూరెన్స్ లేకపోతే వాహనదారుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఇన్సూరెన్స్‌లు సైతం వినియోగించుకోవచ్చు. చలాన్లను ఈ–సేవా, మీ–సేవా, ఏపీ–ఆన్‌లైన్, ఎస్‌బీఐ, పోస్ట్‌ఆఫీస్, నెట్ బ్యాంకింగ్, ట్రాఫిక్ పోలీస్ యాప్ ద్వారా మొబైల్ ద్వారా కూడా చెల్లించవచ్చు.
ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు...బీ కేర్‌ఫుల్...డబ్బులు ఊరికే రావు... ‘ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవండి...డబ్బును ఆదా చేయండి’ అంటూ ట్వీట్ చేశారు.
Follow Traffic Rules...Save Your Money. pic.twitter.com/hfElm0hLCm
— Hyderabad City Police (@hydcitypolice) August 22, 2019
కొత్తగా అమలులోకి రానున్న చలాన్ల రేట్లు ఇవీ
Comments
Please login to add a commentAdd a comment