సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి (సీఎస్) సోమేష్‌కుమార్ కోరారు. బీఆర్ కేఆర్ భవన్‌లో శనివారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. వినియోగదారుల కొనుగోళ్లు పెరిగేలా వడ్డీ రిబేట్లతో పాటు మరిన్ని రుణాలు అందించాలన్నారు. రుణాల దరఖాస్తు ప్రక్రియను సరళీకరించి, సత్వర నిర్ణయాలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. లోన్‌మేళాల నిర్వహణ, ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుతో పాటు రుణాల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టాలన్నారు. సమావేశానికి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్విం ద్‌కుమార్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్‌సీడీడీ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, సీసీటీ నీతూ కుమారి ప్రసాద్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు.
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా చర్యలు: సీఎస్
Published Sun, Jul 4 2021 5:07 AM | Last Updated on Sun, Jul 4 2021 5:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment