తెలంగాణలో లాక్‌డౌన్.. నకిలీ జీవో వైరల్‌! | TRS Govt Clarifies On Lockdown In telangana After Fake GO Goes Viral | Sakshi
Sakshi News home page

తెలంగాణలో లాక్‌డౌన్.. నకిలీ జీవో వైరల్‌!

Published Fri, Apr 2 2021 8:08 AM | Last Updated on Fri, Apr 2 2021 10:45 AM

TRS Govt Clarifies On Lockdown In telangana After Fake GO Goes Viral - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: కరోనాతో రాష్ట్రానికి ముప్పు ఉండడంతో రాత్రి వేళల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా పేర్కొంటూ ఓ నకిలీ జీవో గురువారం రాత్రి కలకలం సృష్టించింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రంలోని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, క్రీడా స్థలాల మూసివేతకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటూ.. గుర్తుతెలియని ఆగంతకులు నకిలీ ఉత్తర్వులను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు.

ఏప్రిల్‌ 30 లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేరు, 2021 ఏప్రిల్‌ 1వ తేదీతో ఈ నకిలీ జీవోను రూపొందించారు. అచ్చం ప్రభుత్వం జారీ చేసే జీవోలా ఉండడంతో కొందరు నిజంగానే నమ్మి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కొన్ని టీవీలు కూడా ఈ వార్త ప్రసారం చేశాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది నకిలీ జీవో అని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ప్రకటించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.   

చదవండి: లాక్‌డౌన్‌ దిశగా మహారాష్ట్ర!
మళ్లీ కరోనా పంజా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement