
సాక్షి, హైదరాబాద్ : రాష్ర్టవ్యాప్తంగా సోమవారం నుంచి ధరణి సేవలు ప్రారంభం అయ్యాయి. శంషాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో ధరణి సేవలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం అయ్యాయి. కాగా ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాలా అక్టోబర్ 29న ముఖ్యమంత్రి ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూ రిజిస్ట్రేషన్ల కోసం 946 మంది నగదు చెల్లించగా, 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నట్లు సోమేశ్ కుమార్ తెలిపారు.
మీసేవా కేంద్రాల్లోనూ రూ.200 లు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చున్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లపై త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తామని, ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా , ఎలాంటి అవినీతికి తావు లేకుండా స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామని చెప్పారు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. (ప్రతి ఇంచూ డిజిటల్ సర్వే )
Comments
Please login to add a commentAdd a comment