![Telangana Issues Order to Employ Brother of Man Who Killed in Agnipath Stir - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/25/Damera_Rakesh.jpg.webp?itok=-UXGbJmz)
దామెర రాకేశ్(ఫైల్)
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనల సమయంలో పోలీసు కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్ సోదరునికి ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
కారుణ్య నియా మకాల కింద మృతుని సోదరునికి ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం తెలిసిందే. ఈ మేరకు రాకేశ్ సోదరుడు దామెర రామ్‌రాజుకు అతని విద్యార్హతల ఆధారంగా వరంగల్ జిల్లాలో ఉద్యోగం ఇవ్వాలని సీఎస్ సోమేశ్‌కుమార్ వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. (క్లిక్: సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు!)
Comments
Please login to add a commentAdd a comment