సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ర్యాపిడ్ కిట్లవాడకంపై హైకోర్టులో మంగళవారం రోజున విచారణ జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షల ర్యాపిడ్ కిట్లు వాడకంలో ఉన్నాయి. మరో 4 లక్షల కిట్లు ఆర్డర్ చేశాం. రాజస్థాన్‌లో ర్యాపిడ్ కిట్ల వాడకం ఇప్పటికే ఆపేశారని సీఎస్ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు ర్యాపిడ్ కిట్ల వాడకంపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఎన్‌ఆర్‌ఐ, సిటీ స్కాన్ ఛార్జీలపై ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలపై ఇప్పటివరకు 726 ఫిర్యాదులు అందాయని సీఎస్ చెప్పారు. కాగా.. 726 ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ హైకోర్టు వివరణ కోరింది. హైకోర్టు ఆదేశాలన్నీ అమలు చేయడానికి రెండు వారాల సమయం కావాలని సీఎస్ కోరారు. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేస్తూ.. ఆ రోజున సీఎస్, వైద్యాధికారులు మరోసారి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment