
బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి శనివారం ఆమె జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు.
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా నేడు బాధ్యతలు చేపట్టారు. బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి శనివారం ఆమె జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. సంతోషికి రెవెన్యూశాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నిరోజుల క్రితం ఆమెకు నియామక పత్రాన్నిఅందజేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం వారికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆమెకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. దీంతోపాటు సంతోష్‌బాబు కుటుంబానికి హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలం, రూ.5 కోట్ల నగదును కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కాగా, గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరో 20 మంది సైనికులు అమరులయ్యారు.
(హెలికాప్టర్‌తో రైతులను రక్షించిన రెస్క్యూ టీం)