సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు( ఆర్‌ఆర్‌ఆర్)పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రీజినల్ రింగురోడ్డు పనులు నిలిచిపోయాయన్నారు. రూ. 300 కోట్ల డ్యూటీ ఛార్జెస్ కట్టనందువల్లే పనులు ఆగిపోయాయని తెలిపారు. అవినీతిపరుడైన సోమేష్ కుమార్ వల్లే ఇలా జరిగిందని కోమటిరెడ్డి మండిపడ్డారు.
‘కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పటికే 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారు. మూసీనదీ ప్రక్షాళన చేస్తాం. సిగ్గులేకుండా జలయాత్ర పేరుతో కేసీఆర్ మళ్లీ మోసం చేయాలనుకుంటున్నారు.
... కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టారు. అది అప్పుడే బీటలు వారింది. రీజినల్ రింగ్ రోడ్డు త్వరలో నిర్మాణం చేస్తాం. కాంగ్రేస్ పార్టీ చాలా రోజులుండదని చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలలు కంటున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి రూ. 100 తెచ్చుకోలేని చేతగానివాడు కిషన్‌రెడ్డి’ అని వెంకటరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment