komatireddy venkareddy
-
ఇది.. ప్రగతి, సంక్షేమాల బడ్జెట్!
‘‘సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు’’ అన్నారు అంబేడ్కర్ మహాశయుడు. అక్షరాలా ఈ మార్గంలోనే సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజసంక్షేమాన్ని నిర్భయంగా అందించేందుకు, నిజాయితీగా ప్రజల జీవితాలను గాడిన పెట్టేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరిపింది. ‘అభయ హస్తం’ కింద ఎన్నికలలో ప్రకటించిన ఆరు హామీలు ఇవ్వాళ తెలంగాణ నిరుపేదల జీవితాల్లో విశేషమైన మార్పు తెస్తు్తన్నాయి. వాటిని నెరవేర్చేలా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. రూ. 2,91,159 కోట్ల బడ్జెట్ తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసాదించేందుకు, గత దశాబ్ద కాలంగా ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు భరోసా కల్పించేందుకు తోడ్పడుతుంది.‘‘వెన్నెలలు లేవు–పున్నమ కన్నె లేదుపైడి వన్నెల నెలవంక జాడలేదుచుక్కలే లేవు ఆకాశ శోక వీధిధూమధామమ్ము దుఃఖ సంగ్రామ భూమి’’ – దాశరథి కృష్ణమాచార్యఅవును... దాశరథి స్థితికి దగ్గరగా... గత అరవై యేండ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో మాత్రమే కాదు, గత ప్రభుత్వ దశాబ్ద పాలనలో కూడా తెలంగాణ అదే నిస్తేజ పరిస్థితిని అనుభవించింది. సంక్షేమం మాటను ఆశ్రితులకు సమర్పయామి మంత్రం... రూల్స్ మాటున తమ రాజకీయ యవనికకు రూట్స్‌గా నిలబడ్డ బడా బాబులకు అప్పనంగా ప్రజల ఆస్తుల సంతర్పణ చేసింది బీఆర్ఎస్ సర్కారు. ఏ బడ్జెట్ చూసినా... కేటాయింపులు, ఆపై తటపటాయింపులతో తల్లడిల్లిపోయిన తెలంగాణ ప్రజానీకానికి నిజసంక్షేమాన్ని నిర్భయంగా అందించేందుకు, నిజాయితీగా ప్రజల జీవితాలను గాడిన పెట్టేందుకు కావాల్సిన కేటాయింపులను ఈ బడ్జెట్లో చేశాం. అటు అసెంబ్లీలో గౌరవ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖామాత్యులు భట్టి విక్రమార్క, ఇటు మండలిలో సోదరుడు, ఐటీ పరిశ్రమల శాఖా మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఒకవైపు సంక్షేమం, మరో వైపు పురోగామి నిర్ణయాలతో జనరంజక బడ్జెట్‌ను మిత్రులిద్దరూ ప్రవేశపెట్టారు.నిరుద్యోగులకు అభయం..దాదాపు లక్షన్నర ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు తమ కోర్సులను పూర్తి చేసుకొని ఉద్యోగ సాధనలోకి దిగుతున్నారు. వీరికి స్కిల్స్ అందించే స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన గత ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. దానివల్ల ప్రతీ యేటా నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ, ఉద్యమాలు చేసే స్థాయికి సమస్య పెరిగింది. అందుకే, విద్యార్థుల నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు దిగ్గజ సంస్థ టాటా టెక్నాలజీస్‌తో కలిసి రూ. 2,324 కోట్లతో 65 ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చుతున్నాం. యూనివర్సిటీల పునర్వై భవం కోసం రూ. 500 కోట్లను కేటాయించాం. నిరుద్యోగ జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నాం. కృత్తిమ మేధలో నిపుణులను తయారు చేసేందుకు, హైదరాబాద్‌ను ఈ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సెప్టెంబర్ 5, 6 తేదీలలో ‘మేకింగ్ ఏఐ ఫర్ ఎవ్రీవన్’ ప్రధానాంశంగా నిర్వహించ తలపెట్టిన సమావేశం తెలంగాణ యువతకు కొత్త భవి ష్యత్తుకు మార్గం చూపిస్తుందని విశ్వసిస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆయురారోగ్యాలకు శ్రీరామరక్షగా నిలిచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. ఈ పథకం కింద ఉన్న 1,672 చికిత్సలలో 1,375 చికిత్సలకు ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీ ధరలను 20 శాతం పెంచడంతోపాటుగా 163 వ్యాధులను కొత్తగా ఈ పథకంలో చేర్చాం. ప్రతీ ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు ఉండేలా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును తీసుకువస్తున్నాం. ఇవేకాదు, ఎస్సీ సంక్షేమానికి రూ. 33,124 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.17,056 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 9,200 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ. 3,003 కోట్లు కేటాయించాం.అభయహస్తం – పేదోళ్ల నేస్తం..రహదారులు అభివృద్ధికి జీవనాడులు అంటారు. అందుకే మా ప్రభుత్వం రహదారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టే రీజినల్ రింగు రోడ్డుకు ఈ బడ్జెట్లో రూ.1,525 కోట్లు కేటాయించాం. దాదాపు రూ. 26,502 కోట్ల ప్రాథమిక అంచనాతో నిర్మించతలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు ఏర్పడి అనూహ్యమైన అభివృద్ధిని సాధించి తెలంగాణను దేశంలో నెంబర్ వన్‌గా మార్చు తాయి. రాష్ట్ర రహదారులు, భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ. 5,790 కోట్లు కేటాయించాం.అభయ హస్తం క్రింద ఎన్నికలలో ప్రకటించిన ఆరు హామీలు ఇవ్వాళ తెలంగాణ నిరుపేదల జీవితాల్లో విశేషమైన మార్పును తెస్తు్త న్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 68.60 కోట్ల మంది అక్కలు, చెల్లెండ్లు, తల్లులు తమ గమ్యాలకు చేరు కున్నారు. దీనికోసం రూ. 2,351 కోట్లను సోదరీమణులకు ఆదా చేశాం. అంతేకాదు 39,57,637 కుటుంబాల్లోని సోదరీమణులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. దీనికోసం ఇప్పటికే రూ. 200 కోట్లను కేటాయించాం. బడ్జెట్లో మరో రూ. 723 కోట్లను కేటాయించాం. గృహజ్యోతి పథకం ద్వారా అల్పాదాయ వర్గాల ఇళ్లలో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపాలనే సత్సంకల్పంతో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పటికే ఈ పథకం కింద 45,81,676 ఇళ్లకు ఉచిత విద్యుత్ వెలుగులు అందించాం. దీని కోసం బడ్జెట్లో రూ. 583.05 కోట్లు కేటాయించాం. నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ఇంది రమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. దీని కింద ప్రతీ నియోజక వర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మొత్తం 4 లక్షల 50 వేల ఇండ్లను నిర్మించాలని సంకల్పించాం.వెలుగుల తెలంగాణను నిర్మిస్తాం..ప్రతీకార రాజకీయాలకన్నా, ప్రగతి రాజకీయాలను విశ్వసిస్తాం. అందుకే, 2014 నాటికి ఉన్న రూ. 75,577 కోట్ల అప్పులను 2023 డిసెంబర్ నాటికి రూ. 6,71,757 కోట్ల రూపాయలకు చేర్చినప్పటికీ విశాల ఆలోచనలతో పొదుపు మంత్రాన్ని పఠిస్తూ, దుబారాను తగ్గిస్తూ, క్రమశిక్షణతో కూడిన పాలనకు బాటలేస్తున్నాం. ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు కలిపి ఇప్పటికే రూ. 42,892 కోట్లు చెల్లించాం. సంక్షేమానికి రూ. 34,579 కోట్లు ఖర్చు చేశాం. అంబేడ్కర్ మహాశయుడు చెప్పినట్టు, ‘‘సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. పునాది ఎంత బలంగా ఉంటే, ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది.’’ అక్షరాలా మేం ఈ మార్గాన్నే ఎంచు కున్నాం.‘అది చేసేంతవరకూ చూడటానికి ఎప్పుడూ అసాధ్యంగా కనిపి స్తుంది’ అని నెల్సన్ మండేలా చెప్పినట్టు, మేం రుణమాఫీ ప్రకటించిన రోజు అందరూ సందేహించినవారే. కానీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 11 లక్షల మంది లక్షలోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేశాం. ఆగస్ట్ 15 లోపలే రెండు లక్షల రుణాలున్న రైతన్నలందరి రుణాలను మాఫీ చేసి ఈ దేశ స్వాతంత్యం వచ్చిన రోజు నాటికి తెలంగాణ రైతన్నకు రుణ స్వాతంత్య్రం కలిగిస్తాం. భూమిలేని రైతుకూలీ లకు యేడాదికి 12 వేల ఆర్థిక సాయం అందిస్తాం. పంట బీమా చేసి రైతన్న కష్టనష్టాల్లో అండగా ఉంటాం. వరి రైతుకు ఇచ్చిన మాట ప్రకారం రూ. 500 బోనస్‌ను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం.శ్రీధర్ బాబు బడ్జెట్లో మహాత్మాగాంధీ మాటను ఉట్టంకించినట్టు, ‘‘మనం చేసే పనులకు, చేయగలిగే సామర్థ్యానికి ఉన్న అంతరం ప్రపంచంలోని సమస్యలన్నింటిని పరిష్కరించడానికి సరి పోతుం’’దనే మాట అక్షర సత్యం. ఇవ్వాళ మేం ప్రవేశపెట్టిన రూ. 2,91,159 కోట్ల బడ్జెట్ తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసాదించేందుకు, గత దశాబ్ద కాలంగా ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు భరోసా కల్పించేందుకు తోడ్పడుతుంది.– కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యాసకర్త రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు -
రీజనల్ రింగురోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు( ఆర్ఆర్ఆర్)పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రీజినల్ రింగురోడ్డు పనులు నిలిచిపోయాయన్నారు. రూ. 300 కోట్ల డ్యూటీ ఛార్జెస్ కట్టనందువల్లే పనులు ఆగిపోయాయని తెలిపారు. అవినీతిపరుడైన సోమేష్ కుమార్ వల్లే ఇలా జరిగిందని కోమటిరెడ్డి మండిపడ్డారు. ‘కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పటికే 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారు. మూసీనదీ ప్రక్షాళన చేస్తాం. సిగ్గులేకుండా జలయాత్ర పేరుతో కేసీఆర్ మళ్లీ మోసం చేయాలనుకుంటున్నారు. ... కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టారు. అది అప్పుడే బీటలు వారింది. రీజినల్ రింగ్ రోడ్డు త్వరలో నిర్మాణం చేస్తాం. కాంగ్రేస్ పార్టీ చాలా రోజులుండదని చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలలు కంటున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి రూ. 100 తెచ్చుకోలేని చేతగానివాడు కిషన్‌రెడ్డి’ అని వెంకటరెడ్డి అన్నారు. -
interview: శత్రువును ప్రేమించే గుణం నాది: కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
‘పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. నల్లగొండను కేసీఆర్ దత్తత తీసుకుని ఒక్క రోడ్డు వేసి ఇంకా దత్తత అయిపోలేదని మాయమాటలు చెబుతుండు. ఆ మాటలు నమ్మితే మళ్లీ మోసపోతాం. బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. నన్ను గెలిపిస్తే మీ సేవకుడిగా పని చేస్తా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. అందరి కష్టాలు తీరుస్తాం. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేయడంతోపాటు పేదలకు ఇళ్లు నిర్మిస్తాం’ అని అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే.. –నల్లగొండ అధికారంలోకి వస్తాం.. అందరి కష్టాలు తీరుస్తాం నల్లగొండ నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంతో ఆదరించి 20 ఏళ్లు ఆశీర్వదించారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. గత ఎన్నికల్లో కేసీఆర్ దత్తత పేరుతో మాయమాటలు చెబితే ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ, నల్లగొండలో ఐదేళ్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వల్ల జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. ఒక్క రోడ్డు వేసి అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడే నల్లగొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశాను. అప్పటి సీఎం వైఎస్ఆర్ను ఒప్పించి శ్రీశైలం సొరంగ మార్గం, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులను మంజూరు చేయించాను. 250 ఎకరాల్లో మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్మించా. పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే రైల్వే ఫ్లైవోవర్ బ్రిడ్జి నిర్మించాను. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే కేసీఆర్‌లా నియంతలా వ్యవహరిస్తూ తొక్కి చంపుతా అని బెదిరిస్తున్నారు. అంతేకాదు భూకబ్జాలు, అక్రమ దందాలు పెరిగిపోయాయి. నాకు అవకాశం ఇవ్వండి. నల్లగొండలో రౌడీయిజం లేకుండా చేస్తా. శత్రువును ప్రేమించే గుణం నాది. నా కొడుకు పేరున ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద వారిని ఆదుకుంటున్నా. మీ పిల్లల్లో నా కొడుకును చూసుకుంటా. నా కూతురు పెళ్లి అయిపోయింది. నాకు మీ సేవ తప్ప మరొకటి లేదు. నల్లగొండలోనే ఉంటా. మీతో బతకాలని వచ్చా. మరోసారి ఆశీర్వదించండి. నాతోపాటు ఎన్నికల్లో నా భార్య, కూతురు మీ వద్దకు ఓటు అడగడానికి వచ్చారు. సమయభావం వల్ల కొందర్ని కలువలేకపోయా. 30వ తేదీన చేయి గుర్తుపై ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలి. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్ 24 గంటల కరెంట్ ఇస్తుంది. గ్రూప్–2 ఉద్యోగాలతో పాటు మిగతా ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తాం. విద్య వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల ఇస్తాం. నల్లగొండలో ఐటీ పార్కు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. పాటు ఇళ్లు లేని వారికి ఇల్లు, ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు మంజూరు చేస్తాం. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అవకతవకల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని దీనికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం చేతకాని తనమే. మాయ మాటలు నమ్మి బీఆర్ఎస్కు ఓటేసే గోస పడతాం. విజ్ఞులైన ప్రజలు ఆలోచించి కాంగ్రెస్‌కు ఓటేయాలి. కేసీఆర్‌ది దొంగ దీక్ష తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసింది దొంగ దీక్ష, ఆస్పత్రిలో మెడిసన్ తీసుకుని ఆయన దీక్ష చేశారు. అందుకు నా దగ్గర ఆధారాలున్నాయి. మణిపూర్‌లో ఒక మహిళ 13 ఏళ్లు మెడిసన్ తీసుకుని దీక్ష చేసింది. విద్యార్థులు, యువకుల ఆత్మబలిదానాలతో తెలంగాణ వస్తే కేసీఆర్ కుటుంబం తెలంగాణ సాధించినట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఏ మేలూ జరగలేదు. రైతు బంధు అమెరికాలో ఉన్న వారికి ఇస్తుంది. మంత్రి మల్లారెడ్డి కూడా తీసుకుంటున్నాడు. కేసీఆర్‌ది అంతా ఉన్న వారిని దోచి పెట్టడమే. ఇది చదవండి: ఓటు ఎవరికి అంటే.. కాకే మన ఆదర్శం! -
కాంగ్రెస్‌లో జోష్.. పొంగులేటి ఇంటికి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక లాంఛనప్రాయం నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు క్యాడర్ ఉన్న లీడర్ లేని లోటు ఉన్న నేపథ్యంలో పొంగులేటి చేరికతో జిల్లాలో బలం పెరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం.. హైదరాబాద్‌లోని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలకు వెళ్లి వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొంగులేటి నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలన్నారు. ‘‘అత్యంత అవినీతి పరుడైన కేసీఆర్‌ను గద్దె దించాలి. ఖమ్మం జిల్లా ముఖ్య నేతలను మాతో కలిసి రావాలని ఆహ్వానించాం. ఖమ్మం నేతలంతా పొంగులేటి రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు అందించడమే మా లక్ష్యం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల బాగోగులే ముఖ్యం: కోమటిరెడ్డి అప్పులు తీసుకొచ్చి రోడ్లు కూడా వేయలేదని, బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ధరణి పేరుతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మాకు అధికారం కాదు.. ప్రజల బాగోగులే ముఖ్యం అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాల్సిన అవసరం ఉంది: జూపల్లి -
సీడబ్ల్యూసీకి ఎవరో?.. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏఐసీసీ పదవులపై చర్చ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరికి ప్రాతినిధ్యం లభిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్లీనరీ అనంతరం ఏర్పాటు చేయనున్న సీడబ్ల్యూసీలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న టి.సుబ్బిరామిరెడ్డి (ఆంధ్రప్రదేశ్)తోపాటు తెలంగాణ నుంచి నలుగురైదుగురు నేతలు ఈ రేసులో ఉన్నారు. అయితే, సుబ్బిరామిరెడ్డికి మళ్లీ రెన్యువల్ అవుతుందని, మిగిలిన నేతలకు సీడబ్ల్యూసీలో చోటు దక్కే అవకాశం లేదని 10 జన్‌పథ్ వర్గాలు చెబుతున్నాయి. కోమటిరెడ్డితో పాటు పలువురు సీడబ్ల్యూసీ సభ్యత్వం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దగా డిమాండ్ కనిపించకపోయినా తెలంగాణ నుంచి నలుగురైదుగురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. తనకు సీడబ్ల్యూసీ అవకాశం తప్పకుండా వస్తుందని, సీడబ్ల్యూసీ సభ్యుని హోదాలోనే పాదయాత్రను ప్రారంభిస్తాననే ధీమాతో ఉన్నారు. సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య కూడా సీడబ్ల్యూసీలో స్థానాన్ని ఆశిస్తున్నారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి పేరు నాలుగైదు నెలలుగా వినిపిస్తోంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగితే తాను పోటీచేసి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక సభ్యుల ఓట్లతో గెలుపొందాలని ఆయన భావించారు. కానీ సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నిక ద్వారా కాకుండా ఏఐసీసీ చీఫ్ ఎంపిక చేయాలని ప్లీనరీలో నిర్ణయించడంతో ఇప్పుడు తనను ఎంపిక చేస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులుగా ఏపీ నుంచి రఘువీరారెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయనతోపాటు తెలంగాణలోని ఏఐసీసీ కార్యదర్శుల్లో ఒకరికి ప్రమోషన్ ఇస్తారని తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇతర రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జిగా న్యాయం చేయలేమని, రాష్ట్రంలోనే ఉండాల్సి వస్తుందని కొందరు సీనియర్ నేతలు నిరాసక్తత వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
మైక్ ఇస్తే కేసీఆర్ బండారం బయటపెడతా
హైదరాబాద్: శాసనసభలో తనకు మాట్లాడటానికి మైక్ ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ బండారం బయటపెడతానని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి హెచ్చరించారు. మీడియాపాయింట్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రశ్నల్లో ప్రతిపక్షానికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కనీసం నిరసన చెప్పే అవకాశం కూడా ప్రతిపక్షసభ్యులకు ఇవ్వడంలేదని విమర్శించారు. తనకు పదవులు ముఖ్యంకాదన్నారు. ప్రజల సమస్యలను వినడానికి ప్రజలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు కలవడంలేదని ప్రశ్నించారు. అధికారపక్షం ఇలాగే వ్యవహరిస్తే సీరియస్‌గా వ్యవహరిస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు.