సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక లాంఛనప్రాయం నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు క్యాడర్ ఉన్న లీడర్ లేని లోటు ఉన్న నేపథ్యంలో పొంగులేటి చేరికతో జిల్లాలో బలం పెరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం.. హైదరాబాద్‌లోని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలకు వెళ్లి వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పొంగులేటి నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలన్నారు. ‘‘అత్యంత అవినీతి పరుడైన కేసీఆర్‌ను గద్దె దించాలి. ఖమ్మం జిల్లా ముఖ్య నేతలను మాతో కలిసి రావాలని ఆహ్వానించాం. ఖమ్మం నేతలంతా పొంగులేటి రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు అందించడమే మా లక్ష్యం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
ప్రజల బాగోగులే ముఖ్యం: కోమటిరెడ్డి
అప్పులు తీసుకొచ్చి రోడ్లు కూడా వేయలేదని, బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ధరణి పేరుతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మాకు అధికారం కాదు.. ప్రజల బాగోగులే ముఖ్యం అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
చదవండి: బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాల్సిన అవసరం ఉంది: జూపల్లి
Comments
Please login to add a commentAdd a comment