మైక్‌ ఇస్తే కేసీఆర్‌ బండారం బయటపెడతా | komatireddy venkareddy fires on kcr | Sakshi
Sakshi News home page

మైక్‌ ఇస్తే కేసీఆర్‌ బండారం బయటపెడతా

Published Fri, Dec 30 2016 7:52 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

మైక్‌ ఇస్తే కేసీఆర్‌ బండారం బయటపెడతా - Sakshi

మైక్‌ ఇస్తే కేసీఆర్‌ బండారం బయటపెడతా

హైదరాబాద్‌: శాసనసభలో తనకు మాట్లాడటానికి మైక్‌ ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ బండారం బయటపెడతానని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి హెచ్చరించారు. మీడియాపాయింట్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రశ్నల్లో ప్రతిపక్షానికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.

కనీసం నిరసన చెప్పే అవకాశం కూడా ప్రతిపక్షసభ్యులకు ఇవ్వడంలేదని విమర్శించారు. తనకు పదవులు ముఖ్యంకాదన్నారు. ప్రజల సమస్యలను వినడానికి ప్రజలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు కలవడంలేదని ప్రశ్నించారు. అధికారపక్షం ఇలాగే వ్యవహరిస్తే సీరియస్‌గా వ్యవహరిస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement