సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ తన ముఖ్య సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమేష్ కుమార్ నియామకంపై తెలంగాణ ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రిటైర్ అయిన వాళ్లను ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్నించారు.
కాగా, ఈ వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. తాజాగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్‌లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే గౌరవంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పనిచేసుకోవాలి. కానీ, సోమేష్ కుమార్ లాంటి వ్యక్తి ఏపీకి వెళ్లకుండా ప్రభుత్వ అడ్వయిజర్‌గా నియమికమయ్యారు. రైటర్ అయిన వాళ్లను ఎందుకు నియమిస్తున్నారు. వీళ్లపై చాలా అపోహలు ఉన్నాయి. భూ భకాసురులు భూములను ఆక్రమించుకునేందుకు సోమేష్ సహాయపడ్డారు. ధరణితో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి భూములను ధరణి పేరుతో లాక్కున్నారు. ప్రభుత్వం పేదల భూమిని లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 5లక్షల కోట్ల విలువైన భూములు లాక్కున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల కోట్ల విలువైన భూములను లాక్కునే ప్లాన్‌లో సూత్రదారి సోమేశ్ కుమార్. అలాంటి వ్యక్తిని మళ్ళీ సలహాదారుగా నియమించుకున్నారు. ఓఆర్‌ఆర్ లీజ్ వెనుక సోమేష్ కుమార్, అరవింద్ ఉన్నారు. 30 సంవ్సతరాలు లీజుకు ఇవ్వడం ఏంటి?. ఇంత మంది సలహాదారులు ఎందుకు?. రిటైర్డ్ అధికారులతో ప్రభుత్వం నడపాలనుకుంటున్నారా?. లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఇరిగేషన్ శాఖకు రిటైర్డ్ అయిన వ్యక్తిని ఎలా కొనసాగిస్తారు. సోమేష్ కుమార్‌ను సలహాదారుగా నియమించడం అంటే.. మళ్లీ దోపిడీని ప్రారంభించినట్టే. వెంటనే సోమేష్ సలహాదారు పదవిని రద్దు చేయాలి. ఆయనపై ఎంక్వరీ వేయాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేస్తాం. సోమేస్ కనుసన్నల్లోనే హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల భూములు చేతులు మారాయి. ఇంధిరా గాంధీ, ప్రియాంక గాంధీల గురించి మాట్లాడే అర్హత తలసానికి లేదు. ఉస్మానియా యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీకి వెల్లి వచ్చే దమ్ము కేటీఆర్‌కు తలసానికి ఉందా?. ఫార్మాసిటీ కట్టాలంటే పేదల భూములు లాక్కోవడం ఎందుకు?. గజ్వేల్, సిరిసిల్లలో భూములు లేవా?. ప్రభుత్వం బెదిరింపులతో ఎంతకాలం నడుస్తుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్.. కేటీఆర్ అనుచరుడికి సీటు!
Comments
Please login to add a commentAdd a comment