సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకంతో కలిపి అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వయంగా తెలిపారు. ప్రధాని మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు. బీఆర్‌కేఆర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరైన సీఎస్.. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను ఆరోగ్యశ్రీతో కలిపి అమలు చేయనున్నట్టు నివేదించారు. ఈ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment