RBI review
-
పథకాల టార్గెట్లు సాధించండి..బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచన
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, సామాజిక భద్రత పథకాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంపై మరింతగా దృష్టి పెట్టాలని బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ), ఆర్థిక సంస్థల చీఫ్‌లతో ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సూచనలు చేసింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) తదితర పథకాలను సమీక్షించినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి చేర్చేందుకు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) ఉద్దేశించిన స్కీములపై ప్రజల్లో అవగాన పెంచేందుకు బ్యాంకులు ఆర్థిక అక్షరాస్యత క్యాంపులు నిర్వహించే అంశంపైనా చర్చ జరిగినట్లు పేర్కొంది. -
పట్టణవాసి ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదిక
నగదు కొరత, మందగిస్తున్న ఉపాధి కల్పన, పెట్రోలు, డీజిల్ సహా నిత్యావసర ధరల పెరుగుదల వల్ల దేశ ఆర్థిక పరిస్థితిపై పట్టణ ప్రాంతాల వినియోదారులకు నమ్మకం సన్నగిల్లుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ప్రతి మూడు నెలలకు చేసే తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కిందటి డిసెంబర్ సర్వే మినహా 2017 మార్చినాటి సర్వే నుంచీ భారత నగరవాసులకు దేశ ఆర్థిక వ్యవహారలపై ఆశలు తగ్గుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సాధారణ ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అవకాశాలపై వినియోగదారులు నిరాశా నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు. 2019 ఏప్రిల్‌మేలో జరిగే లోక్ సభ ఎన్నికలకల్లా దేశ ఆర్థికాంశాలు మెరుగవుతాయని భావిస్తున్నారుగాని, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్లలో కనిపించిన ఆశావహ వాతావరణం వచ్చే ఏడాదిలో ఉండకపోవచ్చని అంచనా. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు తొలి రెండేళ్లూ ఆర్థిక వ్యవస్థను సాఫీగా నడిపించి మంచి పేరు తెచ్చుకున్నాక హఠాత్తుగా దానికి బ్రేకులు పడేలా రెండు అనూహ్య చర్యలు తీసుకుంది. 2016 నవంబర్‌లో పెద్ద నోట్లు రద్దు చేసి, వాటి స్థానంలో ఆలస్యంగా కొత్త కరెన్సీ విడుదల చేయడంతో దేశ ప్రజలు కుదేలయ్యారు. చేతుల్లో డబ్బున్నా దిగులు లేకుండా బతకలేని పరిస్థితి సృష్టించిన నోట్ బందీ వల్ల 2017లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంతకు ముందు ఏడాదిలో నమోదైన 8.2 శాతం నుంచి 7.1 శాతానికి పడిపోయింది. ఆరు నెలల తర్వాత 2017లో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రవేశపెట్టడంతో ఆర్థిక వ్యవస్థ మరింత మందగించింది. జీఎస్టీ వల్ల సత్ఫలితాలు నెమ్మదిగా వస్తున్నాయని ఆర్థికవేత్తలు అంటున్నాగాని వినియోగదారులకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. నాలుగు అంశాల్లో ప్రతికూలం బెంగళూరు, చెన్సై, హైదరాబాద్, కోల్ కత్తా, ముంబై, దిల్లీలో 5, 297 మంది వినియోగదారులను సాధారణ ఆర్థిక పరిస్థితి, ఉపాధి కల్పన అవకాశాలు, ధరల పరిస్థితి, వారి ఆదాయం, వ్యయంపై వారి కుటుంబాల అంచనాలపై ఆర్బీఐ ప్రతినిధులు ప్రశ్నించగా ప్రజల్లో విశ్వాసం పెరగలేదని తేలింది. ఆర్థిక స్థితి, ఉపాధి, ధరలు, ఆదాయంపై పౌరులకు సానుకూల అంచనాలు లేవు. ఈ నాలుగు విషయాల్లో పరిస్థితి దిగజారుతుందని భావిస్తున్నామని వినియోగదారులు చెప్పారు. వ్యయంపై ఆశలు సానుకూలంగా ఉన్నా గతంతో పోల్చితే అవి తక్కువే. వచ్చే ఏడాదికి ప్రజల సెంటిమెంటు బాగుందిగాని పూర్వపు స్థాయితో పోల్చితే మెరుగ్గా లేదు. సాధారణ ఆర్థిక పరిస్థితిపై దాదాపు తటస్థ స్థితిలో ఉన్న 2017 డిసెంబర్ఫలితాలతో పోల్చితే వినియోగదారుల విశ్వాసం ఈ మూడు నెలల్లో బాగా తగ్గిందని తాజా సర్వే చెబుతోంది. మోదీ రాకతో ‘అచ్ఛే దిన్’ ఆశలు! 2012 డిసెంబర్నుంచీ విడుదల చేసిన త్రైమాసిక ఆర్బీఐ వినియోగదారుల సర్వేల వివరాలు గమనిస్తే, నరేంద్రమోదీ 2014 మేలో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి 2017 మార్చి వరకూ ప్రజలు ఆర్థికంగా ఆశావహంగానే ఉన్నారని స్పష్టమౌతుంది. అంతకు ముందు అంటే కాంగ్రెస్నాయకత్వంలోని యూపీఏ హయాంలో నగరాల్లో వినియోగదారులు ఇలాంటి ఆశావహ దృక్పథంతో ఉన్నది 2013 జూన్ సమయంలోనే. ఆ తర్వాత నుంచి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ పట్టణ కుటుంబాల సెంటిమెంటు దిగజారిపోతూనే ఉందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. మళ్లీ మోదీ అధికారంలోకి వచ్చి ఆ తరువాత రెండేళ్ల వరకూ ‘అచ్ఛే దిన్’ వచ్చాయని భావించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో పరిస్థితి దిగజారిందని ఆర్బీఐ వెల్లడించింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఎస్ బీఐకి ఎన్ పీఏల షాక్!
♦ క్యూ3లో నికర లాభం 67% డౌన్; రూ.1,259 కోట్లు ♦ మొండిబకాయిలపై అధిక కేటాయింపుల ప్రభావం ♦ 5.1%కి ఎగబాకిన స్థూల ఎన్పీఏలు; ♦ రూ. 72,791 కోట్లకు పెరుగుదల... ♦ 3 శాతం దిగజారిన షేరు ధర.... ఆర్బీఐ సమీక్ష ప్రభావంతో క్యూ3లో చాలా వరకూ పెద్ద ఖాతాలను ఎన్‌పీఏల్లోకి చేర్చాం. మిగిలిన బలహీన ఖాతాలపై సమీక్ష జరుపుతున్నాం. బహుశా ప్రస్తుత నాలుగో త్రైమాసికంలోనూ లాభాలపై ఈ ప్రభావం ఉండొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొంత భారం ఉంటుందని భావిస్తున్నాం. కాగా, బాండ్ల విక్రయం ద్వారా మార్చిలోపు రూ.6,000 కోట్లను సమీకరించడంపై దృష్టిపెట్టాం. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు మొండిబకాయిలు షాకిచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2015-16, క్యూ3)లో బ్యాంక్ కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలతో కలిపి) నికర లాభం 67 శాతం దిగజారి... రూ.1,259 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,828 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మొండిబకాయిలకు అధిక పరిమాణంలో కేటాయింపులు(ప్రొవిజనింగ్) చేయడం లాభాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎస్బీఐ మొత్తం ఆదాయం క్యూ3లో రూ.67,594 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది క్యూ3లో ఆదాయం రూ. 64,605 కోట్లతో పోలిస్తే... స్వల్పంగా 4.6 శాతం వృద్ధి చెందింది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఇలా... ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాల(స్టాండెలోన్) ప్రకారం చూస్తే... ఈ డిసెంబర్ క్వార్టర్లో ఎస్బీఐ నికర లాభం 61.6 శాతం క్షీణించి రూ.1,115 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం 2,910 కోట్లుగా నమోదైంది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం రూ.43,784 కోట్ల నుంచి రూ.46,731 కోట్లకు పెరిగింది. 6.7 శాతం మాత్రమే వృద్ధి చెందింది. మార్కెట్ విశ్లేషకులు ఎస్బీఐ సగటున రూ.3,250 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. ఎన్పీఏలు పైపైకి... ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో ఎస్బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) మరింత ఎగబాకాయి. మొత్తం రుణాల్లో 5.1 శాతానికి(రూ.72,792 కోట్లు) చేరాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి 4.9 శాతం(రూ.61,992 కోట్లు) కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 4.15 శాతం( రూ.56,834 కోట్లు) మాత్రమే. ఇక నికర ఎన్పీఏలు కూడా గత క్యూ3లో 2.8 శాతం(రూ.34,469 కోట్లు) నుంచి 2.89 శాతానికి(రూ.40,249 కోట్లు) పెరిగాయి. అయితే, క్రితం క్వార్టర్(సెప్టెంబర్ త్రైమాసికంలో 2.14 శాతం; రూ.28,592 కోట్లు)తో పోలిస్తే భారీగా పెరగడం గమనార్హం. ప్రధానంగా మొండిబకాయిల పరిష్కారం కోసం ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రభావంవల్లే ఎన్పీఏలను అధికంగా చూపించాల్సి వచ్చిందని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. మొండిబకాయిల సమీక్షలో భాగంగా టాప్-150 బలహీన ఖాతాలను గుర్తించిన ఆర్బీఐ... వాటినీ ఎన్పీఏలుగా పరిగణించి మార్చిలోపు కేటాయింపులు జరపాలంటూ బ్యాంకులను ఆదేశించడం తెలిసిందే. కాగా, ఈ డిసెంబర్ క్వార్టర్లో బ్యాంక్ మొత్తం ప్రొవిజనింగ్ రూ. 7,645 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.4,810 కోట్లు మాత్రమే. క్యూ3లో కొత్తగా మొండిబకాయిలుగా మారిన రుణాల విలువ రూ.20,692 కోట్లుగా నమోదైంది. ఇందులో రూ.5,900 కోట్లు మాత్రమే అసలు మొండిబకాయిలని, ఆర్బీఐ సమీక్ష ప్రభావంతో మిగిలిన మొత్తాన్ని కూడా ఈ జాబితాలోకి చేర్చినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఇప్పటివరకూ సగం బలహీన ఖాతాలకు మాత్రమే కేటాయింపులు జరిపామని, క్యూ4 ఫలితాలపైనా ఈ ప్రభావం ఉంటుందని వెల్లడించింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ డిసెంబర్ త్రైమాసికంలో ఇతర ఆదాయం 18 శాతం ఎగబాకి రూ.6,178 కోట్లకు చేరింది. లాభాలు మరింత పడిపోకుండా ఇది కొంతవరకూ దోహదం చేసింది. ♦ ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 1.2% వృద్ధి చెంది రూ.13,777 కోట్ల నుంచి రూ.13,606 కోట్లకు చేరింది. ♦ రుణాలు 12.9 శాతం వృద్ధి చెందాయి. దీంతో డిసెంబర్ చివరినాటికి బ్యాంక్ మొత్తం రుణాల పరిమాణం రూ.14.28 లక్షల కోట్లకు పెరిగింది. ♦ డిపాజిట్ల పరిమాణం 10.7 శాతం వృద్ధితో 16.71 లక్షల కోట్లకు ఎగబాకింది. ♦ ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు ధర గురువారం బీఎస్ఈలో 3 శాతం క్షీణించి రూ. 154 వద్ద ముగిసింది. -
28,790 దిగువన కరెక్షన్
మార్కెట్ పంచాంగం రెండు వారాల్లో 12 శాతంవరకూ పెరిగిన బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ ఫలితంగా ప్రధాన స్టాక్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు గతవారం కరెక్షన్కు లోనయ్యాయి. అయితే ప్రధాన సూచీలు 2 శాతం వరకూ క్షీణించిన శుక్రవారంనాడు పలు ప్రధాన, మిడ్‌క్యాప్ షేర్లు ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలోనూ, నెలల గరిష్టస్థాయిలోనూ ముగియడం మార్కెట్ అంతర్గతంగా బలపడుతున్నడానికి సంకేతం. ఇక ఈ వారం జరగనున్న ఆర్బీఐ సమీక్షలో మరోసారి రేట్లు తగ్గిస్తే మార్కెట్లో వెనువెంటనే బడ్జెట్ ర్యాలీ మొదలయ్యే అవకాశాలుంటాయి. రేట్లలో మార్పేదీ లేకపోతే బ్యాంకింగ్ షేర్లలో మరో రౌండు లాభాల స్వీకరణ జరగవచ్చు. ఫలితంగా మరో కొద్దిరోజులు మార్కెట్ దిద్దుబాటుకు లోనుకావొచ్చు. అటుపై బడ్జెట్‌పై అంచనాల్ని పెంచుకుంటూ నెమ్మదిగా ర్యాలీ బిల్డప్ అయ్యే ఛాన్స్ వుంది. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జనవరి 30తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో తొలి మూడురోజులూ వరుసగా అప్‌ట్రెండ్ సాగించిన సెన్సెక్స్ చివరిరోజైన శుక్రవారం 29,844 పాయింట్ల రికార్డుస్థాయిని నమోదుచేసి, అక్కడ్నుంచి 29,070 కనిష్టానికి పడిపోయింది. వారంలో గరిష్ట, కనిష్టస్థాయిలు రెండూ అదేరోజు నమోదుకావడం విశేషం. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 96 పాయింట్ల స్వల్పనష్టంతో 29,183 వద్ద ముగిసింది. గత వారాంతంలో అమెరికా మార్కెట్లు క్షీణించిన ప్రభావంతో ఈ వారం గ్యాప్‌డౌన్‌తో మొదలైతే సెన్సెక్స్‌కు 28,890 సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 28,790 మద్దతుస్థాయి సెన్సెక్స్‌కు కీలకం. ఇదే స్థాయి నుంచి జనవరి 21న భారీ ట్రేడింగ్ పరిమాణంతో మార్కెట్ పెరిగినందున 28,790 దిగువన ముగిస్తేనే తదుపరి క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన మద్దతులు 28,325, 28,200 పాయింట్లు. వచ్చే కొద్దిరోజుల్లో 28,200 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడుతుందని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. ఈ వారం 28,790 మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 29,400 వరకూ పెరగవచ్చు. ఆపైన 29,750 స్థాయికి ర్యాలీ జరిపే చాన్స్ ఉంది. 30,000 శిఖరాన్ని అందుకోవాలంటే 29,750 స్థాయిపైన సూచీ స్థిరపడాల్సివుంటుంది. నిఫ్టీ మద్దతు 8,690 ఎన్ఎస్ఈ నిఫ్టీ గత శుక్రవారం 9,000 పాయింట్ల మ్యాజిక్ ఫిగర్‌ను కేవలం 4 పాయింట్లతో మిస్సయ్యింది. అదేరోజున 8,996 రికార్డుస్థాయి నుంచి 8,775 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమైంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 27 పాయింట్లు నష్టంతో 8,809 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ క్షీణిస్తే 8,690 వద్ద ప్రధాన మద్దతు లభిస్తున్నది. 8,690 దిగువన మద్దతుస్థాయిలు 8,575, 8,530 పాయింట్లు. ఆర్బీఐ పాలసీ ప్రకటనవెలువడిన తర్వాత 8,690 మద్దతుస్థాయిని నిఫ్టీ పరిరక్షించుకోగలిగితే తిరిగి 9,000 స్థాయిని అందుకునే ప్రయత్నం చేయగలదు. ఈ వారం నిరోధస్థాయిలు 8,870, 8,960 పాయింట్లు. - పి. సత్యప్రసాద్