
ముంబై: నియంత్రణపరమైన నిబంధనల అమలులో లోపాలు ఉన్నట్టు గుర్తించిన ఆర్‌బీఐ ఫెడరల్‌బ్యాంక్‌కు రూ.5.72 కోట్ల జరిమానా విధించింది. అలాగే, కేవైసీ నిబంధనలు కొన్ని పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.70 లక్షల జరిమానాను విధిస్తూ ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.
బీమా బ్రోకింగ్, కార్పొరేట్ ఏజెన్సీ సర్వీసెస్ కోసం ఉద్యోగులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా నిబంధనలను అమలు చేయడంలో ఫెడరల్ బ్యాంక్ విఫలమైనట్టు ఆర్‌బీఐ తెలిపింది.
కేవైసీ నిబంధనలను అమలు చేయనందుకు గురుగ్రామ్‌కు చెందిన ధనిలోన్స్ అండ్ సర్వీసెస్‌కు సైతం ఆర్‌బీఐ 7.6 లక్షల జరిమానా విధించింది.