hackathon
-
ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేలా పరిష్కారాలు
ఆర్థిక సేవల్లో మరింత భద్రతను పెంచడం, దివ్యాంగులు సులువుగా ఆర్థిక లావాదేవీలను వినియోగించేలా విభిన్న పరిష్కారాలు అందించిన కంపెనీలను భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మూడో హ్యాకథాన్ విజేతలుగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాకథాన్(Hackathon)లో పాల్గొనేందుకు మొత్తం 534 ప్రతిపాదనలు వచ్చాయని ఆర్బీఐ తెలిపింది.‘జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్’, ‘బీయింగ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ’ థీమ్‌లతో గ్లోబల్ హ్యాకథాన్ మూడో ఎడిషన్‌ను ఆర్బీఐ ఇటీవల నిర్వహించింది. ఈ హ్యాక్‌థాన్‌కు వచ్చిన మొత్తం ప్రతిపాదనల్లో యునైటెడ్ స్టేట్స్(USA), యూకే, హాంకాంగ్, సింగపూర్, బ్రెజిల్, మొరాకోతో సహా దేశంలోని చాలా కంపెనీలు ప్రతిపాదనలు పంపించాయి. వీటిలో 28 సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. వాటిని ఫైనల్ లిస్ట్ కోసం స్వతంత్ర జ్యూరీకి పంపించినట్లు పేర్కొంది. అందులో కింది కంపెనీలను విజేతలుగా నిలిచినట్లు ఆర్బీఐ ప్రకటించింది.ఎఫ్‌పీఎల్ టెక్నాలజీస్క్సాల్స్ టెక్నాలజీస్ఎపిఫై టెక్నాలజీస్న్యాప్ఐటీ సైబర్సెక్హెచ్విజన్ ఇండియారూప్య దర్శినివిస్ఆస్ట్ఇదీ చదవండి: రత్నాభరణాలపై జీఎస్టీ తగ్గింపు?అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఆర్థిక మోసాలను కట్టడి చేయడంతోపాటు, దివ్యాంగులు సులభంగా వీటిని వినియోగించేలా ఈ కంపెనీలు పరిష్కారాలు అందించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుత నిబంధనలకు లోబడి ఈ కంపెనీల టెక్నాలజీలు పటిష్ఠ భద్రతతో, సులువుగా ఆర్థిక సేవలను అందుబాటులో ఉంచేందుకు దోహదం చేస్తాయని తెలిపింది. -
బీవోబీ-మైక్రోసాఫ్ట్ జెన్ఏఐ హ్యాకథాన్.. రూ.లక్షల్లో ప్రైజ్‌మనీ
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా మైక్రోసాఫ్ట్ సహకారంతో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ)పై దేశవ్యాప్త ఆన్లైన్ హ్యాకథాన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.బ్యాంక్ నిర్వచించిన నిర్దిష్ట అంశాల్లో జెన్ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పాల్గొనేవారిని ప్రేరేపించడమే ఈ హ్యాకథాన్ లక్ష్యం. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతులు అందజేస్తామని, హ్యాకథాన్ నుంచి వెలువడే ఉత్తమ ఐడియాలను అమలు చేస్తామని బ్యాంక్ పేర్కొంది.డెవలపర్లు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్, స్టార్టప్స్, ఫిన్‌టెక్‌లు వ్యక్తిగతంగా లేదా బృందంగా ఈ హ్యాకథాన్‌లో పాల్గొనవచ్చు. కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, ఆడిట్ & కాంప్లయన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, పర్సనలైజ్డ్ కంటెంట్ జనరేషన్ అనే ఆరు విభాగాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అద్భుతమైన పరిష్కారాలను కోరుతోంది.బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్నోవేషన్‌లో ముందంజలో ఉంటుందని, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి జెన్ఏఐ కొత్త మార్గాలను అందిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఉమ్మడి విజన్ ను పంచుకోవడానికి సంతోషిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా&దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు.కంటెస్టెంట్లు https://bobhackathon.com ద్వారా హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు వ్యక్తిగతంగా లేదా టీమ్‌గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక్కో టీమ్‌లో గరిష్టంగా నలుగురు వ్యక్తులు ఉండొచ్చు. జూన్ 10 నుంచి 30వ తేదీలోపు ఐడియాలను సమర్పించవచ్చు. షార్ట్ లిస్ట్ చేసిన జట్లు ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. -
హ్యాకథాన్‌తో వ్యాపార సమస్యలకు పరిష్కారాలు
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణలో ఎదురయ్యే వాస్తవిక సవాళ్లకు హ్యాకథాన్లతో తగు పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సేవల సంస్థ ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ కాప్సే తెలిపారు. ఇప్పటిదాకా తాము నిర్వహించిన అయిదు హ్యాకథాన్స్లో 1,100 పైచిలుకు ఐడియాలు నమోదయ్యాయని ఆయన చెప్పారు. వీటిలో కస్టమర్ల ధృవీకరణను సరళతరం చేసేందుకు ఉద్దేశించిన యాప్, ఉద్యోగుల ఉత్పాదకతను పెంపొందించే ట్రావెల్ యాప్ మొదలైనవి ఉన్నట్లు వివరించారు. కొన్ని ఐడియాలు .. ఒక క్లయింటుకు 1,00,000 డాలర్ల పైగా ఆదా చేసినట్లు విశాల్ చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)తో కలిసి నిర్వహించిన హ్యాకథాన్‌లో భారత్, అమెరికా, బ్రిటన్, ఫిలిప్పీన్స్, మెక్సికోలోని 3,000 మంది పైగా ఫస్ట్‌సోర్స్ ఉద్యోగులు పాల్గొన్నట్లు విశాల్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మంది క్లయింట్లతో కలిసి వీటిని నిర్వహించే యోచన ఉన్నట్లు వివరించారు. ఏటా ఆరు–ఎనిమిది హ్యాకథాన్ ఈవెంట్లు నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐడియాలను ఆహ్వానించడం మొదలుకుని షార్ట్‌లిస్ట్‌ను ప్రకటించే వరకు ప్రతి ఈవెంట్ సుమారు నాలుగు నుంచి ఆరు వారాల పాటు సాగుతుందని ఆయన చెప్పారు. -
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హ్యాకథాన్ పోటీలు.. పోస్టర్ ఆవిష్కరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తోంది. దేశ నలుమూలల నుంచి కోడింగ్ పట్ల ఆసక్తిగల విద్యార్థులు ఎవరైనా ఈ కాంపిటిషన్లో పాల్గొనవచ్చు. ఈ పోటీలో టాప్ స్కోర్ సాధించిన వారికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అడ్మిషన్ లభిస్తుంది. వారికి నచ్చిన కోర్సు ఎంచుకోవచ్చు. ట్యూషన్ ఫీజుపై 100 శాతం వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. అలాగే రూ.లక్ష విలువ చేసే బహుమతులు అందుకోవచ్చు. నేషనల్ టాలెంట్ హంట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఏపీ సచివాలయంలో ఆవిష్కరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హ్యాకథాన్‌ను రెండు భాగాలుగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మొదట మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ (ఎంసీక్యూ) పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో కోడింగ్ నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండు టెస్టులు ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. హ్యాకథాన్ పోటీ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 13న ప్రారంభమైంది. జనవరి 31 వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చదవండి: అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్ -
మధుమేహులకు వర్షిత తీపికబురు!
డయాబెటిస్ రోగికి రోజూ వేలికి సూది గుచ్చుకుని మరీ పరీక్ష చేస్తేగానీ... రక్తంలో చక్కెర మోతాదు ఎంత ఉందో తెలియదు. మరి అలాంటి అవసరమే లేకుండా దేహంలో షుగర్ ఎంత ఉందో చటుక్కున తెలిసిపోతే ఎంత బాగుంటుంది? క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాల్సి రావడం వల్ల నెలకు నాలుగైదు వేలు ఖర్చు తప్పదు. కానీ ఇలా రోజూ పరీక్షలు చేయిస్తున్నా సరే... నాలుగేళ్లు గడిచాక కూడా ఆ వ్యయం... నెల ఖర్చుకు మించకపోతే ఇంకెంత బాగుంటుంది? చక్కెర జబ్బు అంటూ పేరులో మాత్రమే తీపి ఉన్న డయాబెటిస్ అనే ఈ సమస్య రోజూ చేసుకోవాల్సిన చిన్నపాటి గాయాలతోనూ, వ్యయాలతోనూ చాలా బాధిస్తుంటుంది. కానీ ఇకపై అలాంటి బాధలేవీ లేకుండానే... మొబైల్సహాయంతోనే చక్కెర మోతాదును తెలుసుకునే యాప్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసింది దువ్వూరు వర్షిత. ఆ ప్రయత్నానికి సాంకేతికంగా సహాయపడ్డాడు విమల్ అనే ఇంజినీర్. కాలం కలిసొస్తే ఎలాంటి గుచ్చుకోవడాలు లేకుండా మన మొబైల్లోనే గ్లూకోమీటర్ రూపొంది... దాని సహాయంతో చక్కెర మోతాదులు చాలా తేలిగ్గా తెలుసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనీ, మహా అయితే మరో ఆర్నెల్లు లేదా ఏడాది లోపే ఇది అందుబాటులోకి రావచ్చంటున్నారు 20 ఏళ్ల వర్షిత, యువ ఇంజనీర్ విమల్ కుమార్ లు. వారిరువురూ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పిన విషయాలు డయాబెటిస్తో బాధపడుతున్న ఎందరికో తీపికబురు కాబోతున్నాయి. అవేమిటో తెలుసుకుందాం. ‘‘నా పేరు దువ్వూరు వర్షిత. మాది నెల్లూరు. పుట్టినప్పట్నుంచే టైప్–1 డయాబెటిస్ తో బాధపడుతున్నాను. ఒక్కోసారి ఒకేరోజు నాలుగైదుసార్లు సూదితో వేలిని గుచ్చుకుని చక్కెరను పరీక్షించుకోవాల్సి వచ్చేది. ఒక్కసారి పరీక్ష కోసం పెట్టే ఖర్చు రూ. 40 వరకు అయ్యేది. అంటే ఒక్కరోజుకు రూ. 160 అన్నమాట. అలా చూస్తే నెలలో కేవలం వైద్యపరీక్ష కోసమే ఐదువేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వచ్చేది. చిన్నప్పుడు పెద్దగా బాధ తెలియకపోయినా పెరుగుతున్న కొద్దీ వేదన మరింత ఎక్కువైంది. రోజులో ఇన్నిసార్లు పరీక్షల కోసం పెట్టే ఖర్చే కాకుండా... ఇక మందులు, ఇన్సులిన్ లాంటివాటికి ఎంతవుతుందో ఊహించవచ్చు. ఓ సగటు మధ్యతరగతి వారికి ఇది ఎంత పెద్ద మొత్తమో ఎవరికైనా తెలిసే విషయమే. ఎప్పటికైనా నాలాంటివాళ్లకోసం ఏదైనా చేస్తానంటూ పదేళ్ల వయసప్పుడే నాన్న దగ్గర ఓ సంకల్పం తీసుకున్నా. అందుకే ఐఐటీకి క్వాలిఫై అయి, అందులో చేరాక కూడా బయోటెక్నాలజీపై ఆసక్తితో బయటకి వచ్చి చెన్నైలో ఆ కోర్సులో చేరాను. కోయంబత్తూరులో 2019లో ఓ హ్యాకాథాన్ (కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై తమ తమ భావాలు, ఆలోచనలు పంచుకునే సదస్సు) నిర్వహించారు. అక్కడ పరిచయమయ్యారు తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన విమల్‌కుమార్ అనే యువ ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఈ హ్యాకాథాన్లో నా ఆలోచనలను వివరించా. తన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సామర్థ్యంతో నా ఐడియాలను సాకారం చేయవచ్చని విమల్‌తో మాట్లాడినప్పుడు తెలిసింది. అంతే... మేమిద్దరమూ కలిసి మా ప్రాజెక్టు కోసం పనిచేయడం ప్రారంభించాం. ఇందుకోసం రూపొందించిన గ్లూకోమీటర్ కూడా చాలా సింపుల్‌గా పనిచేస్తుంది. నిజానికి ఇదో చిన్న పెన్ డ్రైవ్ తరహాలో ఉండే పరికరం. దీన్ని మన మొబైల్‌కి జతచేయాలి. అక్కడ మన వేలిని ఉంచితే చాలు... ఎలాంటి సూదిగాయాలూ, నొప్పి లేకుండానే మన రక్తంలోని చక్కెర మోతాదులు తెలిసిపోతాయి’’ అంటూ తమ ప్రాజెక్టు గురించి వివరించింది వర్షిత. ‘‘ఇది వన్ టైమ్ ఎక్స్పెన్స్ ఎక్విప్మెంట్. అంటే ఒక్కసారి కొంటే చాలు ఎప్పటికీ వాడుకునేలా రూపొందించిన డివైస్ ఇది. నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ (ఎన్ఐఆర్) అనే సాంకేతికత సహాయంతో ఎలాంటి గాటూ లేకుండానే మన దేహంలోని చక్కెరను అంచనా వేస్తుంది ‘ఈజీ లైఫ్’ అనే పేరున్న ఈ పరికరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో చక్కెర విలువలను విశ్లేషించడం వల్ల నిమిషంలోపే షుగర్ రీడింగ్స్ మనకు తెలిసిపోతాయి. ఎక్కడైనా ఎప్పుడైనా నిస్సంకోచంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు’’ అంటూ వివరించారు విమల్. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సదస్సులో వర్షిత, విమల్‌ల ఈ ‘స్టార్ట్ అప్’ ప్రథమస్థానంలో నిలిచింది. అంతేకాదు ‘ఎమ్పవర్–2021’ పేరిట గతేడాది నిర్వహించిన ‘వుమన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాంపిటీషన్’లో రన్నరప్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు... ‘ఎన్ఐటీటీఈ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్’ హ్యాకథాన్‌తో పాటు మరికొన్ని సదస్సుల్లోనూ వీరి ఆవిష్కరణ అనేక బహుమతులను గెలుచుకుంది. గతంలో దుబాయిలో గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించిన ఓ సదస్సులో దాదాపు 42 దేశాల నుంచి యువతులు పాల్గొన్నారు. ‘టై ఉమన్ గ్లోబల్ పిచ్–2021 హైదరాబాద్ చాప్టర్’ ప్రాజెక్టును ప్రోత్సహించి... వర్షితను ఆ సదస్సు కు పంపినప్పుడు అక్కడ కూడా ఆమె ప్రాజెక్టుకు మంచి ప్రశంసలు దొరికాయి. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని గుర్తించిన హైదరాబాద్‌కు చెందిన గ్రేలాజిక్ టెక్నాలజీస్ అండ్ ఎడిఫై పాత్ సంస్థల డైరెక్టర్ వర్ల భానుప్రకాశ్‌రెడ్డి... ఈ ప్రాజెక్టుకు మెంటార్‌గా, ప్రమోటర్‌గా వర్షిత, విమల్లకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ పరిశోధనలో పాలు పంచుకునేలా అనేక ఇతర సంస్థలను సైతం వీరి ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో రూపొందించనున్న ఈ ప్రాజెక్టుకు ‘వివాలైఫ్’ అని పేరు పెట్టుకున్నారు. వీళ్ల పరిశోధనలకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వేదికగా నిలిచింది. -
మీ శక్తిని ఎప్పటికీ విశ్వసిస్తాను: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : గత శతాబ్దాలలో భారతదేశం ఒక్కటే ఎక్కువ మంది ఉత్తమ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, సాంకేతిక వ్యవస్థాపకులను ప్రపంచానికి పరిచయం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ దేశాలకు భారతీయులు సేవలందిస్తున్నందుకు దేశ ప్రజానీకమంతా గర్వపడాలని వ్యాఖ్యానించారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో దేశం తన ప్రభావవంతమైన పాత్రను పోషించడానికి 21వ శతాబ్దం మరింత వేగంగా మారాలని అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనతో దేశంలో ఆవిష్కరణ, పరిశోధన, రూపకల్పన, అభివృద్ధి, వ్యవస్థాపకత కోసం అవసరమైన పర్యావరణ వ్యవస్థ వేగంగా తయారవుతోందని వ్యాఖ్యానించారు. (ఎన్ఈపీ 2020: చైనీస్ భాషపై సందిగ్దత!) 130 కోట్ల భారతీయుల ఆకాంక్షల ప్రతిబింభం స్మార్ట్ ఇండియా హ్యాకథన్ 2020 యొక్క గ్రాండ్ ఫినాలేలో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఆన్లైన్ విద్య కోసం కొత్త వనరులను సృష్టించడం లేదా స్మార్ట్ ఇండియా హాకథాన్ వంటి ప్రచారాలు, భారతదేశ విద్య మరింత ఆధునికంగా, ఆధునికంగా మారాలని ప్రయత్నం, ఇక్కడ ప్రతిభకు పూర్తి అవకాశం లభిస్తుంది. దేశానికి కొత్త విద్యా విధానం కొద్ది రోజుల క్రితం ప్రకటించబడింది. 21వ శతాబ్దపు యువత ఆలోచన, అవసరాలు మరియు ఆశలు మరియు ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానం రూపొందించబడింది. ఇది కేవలం విధాన పత్రం మాత్రమే కాదు, 130 కోట్లకు పైగా భారతీయుల ఆకాంక్షల ప్రతిబింభం. తల్లిదండ్రులు బంధువులు మరియు స్నేహితుల నుండి ఒత్తిడి వచ్చినప్పుడు, వారు ఇతరులు ఎంచుకున్న విషయాలను చదవడం ప్రారంభిస్తారు. దేశానికి చాలా పెద్ద జనాభా ఉంది. ఇందులో బాగా చదువుకున్నవారు ఉన్నారు, కాని వారు చదివిన వాటిలో చాలా వరకు అది వారికి నిజజీవితంలో పనిచేయదు. డిగ్రీల డిగ్రీ తర్వాత చేసికూడా తనలో సామర్ధ్యం కొరవడడం కారణంగా అసంపూర్ణత గల విద్యార్ధి అవుతాడు. కొత్త విద్యా విధానం ద్వారా ఈ విధానాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మునుపటి లోపాలను తొలగిస్తున్నారు. భారతదేశ విద్యా వ్యవస్థలో ఒక క్రమబద్ధమైన సంస్కరణ, విద్య యొక్క ఉద్దేశ్యం మరియు కంటెంట్ రెండింటినీ మార్చే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పులు, భారతదేశ భాషలు మరింత పురోగమిస్తాయి, మరింత అభివృద్ధి చెందుతాయి. ఇది భారతదేశ జ్ఞానాన్ని పెంచడమే కాక, భారతదేశ ఐక్యతను కూడా పెంచుతుంది. భారతదేశంలోని గొప్ప భాషలకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. విద్యార్థులు తమ ప్రారంభ సంవత్సరాల్లో వారి స్వంత భాషలో నేర్చుకోవడం చాలా పెద్ద ప్రయోజనం. జీడీపీ ఆధారంగా ప్రపంచంలోని టాప్ 20 దేశాల జాబితాను పరిశీలిస్తే, చాలా దేశాలు తమ మాతృభాషలో విద్యను అందిస్తాయి. ఈ దేశాలు తమ దేశంలోని యువత ఆలోచన మరియు అవగాహనను అభివృద్ధి చేస్తాయి. ప్రపంచంతో కమ్యూనికేట్ చేయడానికి ఇతర భాషలకు కూడా ప్రాధాన్యత ఇస్తాయి. యువత శక్తిని నేను ఎప్పుడూ విశ్వస్తాను స్థానిక జానపద కళలు మరియు విభాగాలకు, శాస్త్రీయ కళ మరియు జ్ఞానానికి సహజమైన స్థలాన్ని ఇవ్వడం గురించి చర్చ జరుగుతుండగా, మరోవైపు టాప్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా భారతదేశంలో క్యాంపస్ తెరవడానికి ఆహ్వానించబడ్డాయి. దేశ యువత శక్తిని నేను ఎప్పుడూ విశ్వస్తాను. ఈ నమ్మకాన్ని ఈ దేశంలోని యువత మళ్లీ మళ్లీ నిరూపించబడింది. ఇటీవల కరోనాను రక్షించడానికి ఫేస్ షీల్డ్స్ కోసం డిమాండ్ పెరిగింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో దేశ యువత ఈ డిమాండ్‌ను తీర్చడానికి ముందుకు వచ్చింది. దేశంలోని పేదలకు మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి ఈజీ ఆఫ్ లివింగ్ అనే మా లక్ష్యాన్ని సాధించడంలో మీ అందరి పాత్ర చాలా ముఖ్యమైనది. స్మార్ట్ ఇండియా హాకథాన్ ద్వారా గత సంవత్సరాల్లో దేశానికి అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చాయి. ఈ హాకథాన్ తరువాత కూడా దేశ అవసరాలను అర్థం చేసుకుని, దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి కొత్త పరిష్కారాలపై కృషి చేస్తూనే ఉంటారని యువతపై నమ్మకం ఉంది.’ అని మోదీ పేర్కొన్నారు. -
ఏ పంట వేయాలో చెప్పేస్తుంది...
వారంతా రైతు బిడ్డలు. చిన్నప్పట్నుంచీ తాము తిరిగిన ఊరు, పంట పొలాలు, అక్కడ మట్టి పరిమళాలు గురించి మాత్రమే తెలుసు. అయితేనేం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగించుకోవడంలో తమకు ఎవరూ సాటి పోటీ లేదని నిరూపించుకున్నారు. చిన్నప్పట్నుంచీ భూమినే నమ్ముకున్న బతుకులైనా దానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం జోడించారు. వాన రాకడల్ని, వాతావరణంలో మార్పుల్ని, పంటలపై వాటి ప్రభావాన్ని తెలుసుకోవడం కోసం ఒక యాప్‌ని రూపొందించారు. ఈ యాప్ ద్వారా మట్టిలో నాణ్యత ఎంత?, అది ఏ పంటలకు అనుకూలం? వంటివన్నీ ఆ యాప్ కచ్చితమైన అంచనాలతో చెప్పేస్తుంది. భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో అత్యంత మారుమూల గ్రామాలకు చెందిన వీరంతా ఒక బృందంగా ఏర్పడి ఈ యాప్‌ను రూపొందించింది. పుణేకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ఐసెర్టిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసే సరికొత్త ఆవిష్కరణలకు ఇచ్చే ప్రైజ్ వీరి యాప్‌కు లభించింది. సాఫ్ట్వేర్ కార్యక్రమాలకు సంబంధించిన హాక్‌థాన్ అనే వేదికలో వీరంతా చేరి తమ మేధకు పదునుపెట్టారు. హాక్‌థాన్ విసిరే సవాళ్లలో టీమ్ వర్క్, ఏఐ వినియోగం, బ్లాక్‌చైన్ టెక్నాలజీ వంటివన్నీ విస్తృతంగా అధ్యయనం చేస్తారు. మొత్తం 12 మంది రైతు బిడ్డలంతా కలిసి ఈ యాప్‌ని రూపొందించి ప్రైజు కొట్టేశారు. -
పోలీస్ హ్యాకథాన్
సాక్షి,సిటీబ్యూరో: సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనేతొలిస్థానంలో ఉన్న హైదరాబాద్ సిటీ పోలీసులు మరో వినూత్నకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భద్రతలో విద్యార్థులు, స్టార్టప్ కంపెనీలకు భాగస్వామ్యం కల్పిస్తూ తొలిసారిగా హ్యాకథాన్తలపెట్టారు. రాష్ట్రంలో ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ఇదేప్రథమమని పోలీసు అధికారులు చెబుతున్నారు. నగర అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) శిఖా గోయల్ సారథ్యంలో నిర్వహించే హ్యాకథాన్‌కు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (కేవీబీఆర్) స్టేడియంవేదిక కానుంది. ఈ నెల 18 ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం నిర్వరామంగా 36 గంటల పాటు సాగుతుంది. ఇందులో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టార్టప్, విద్యార్థికి రూ.లక్ష ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు. చెన్నై, బెంగళూరు పోలీసులు గత ఏడాది నవంబర్‌లో ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. నగర పోలీసు విభాగం ఇప్పటికే పలురకాలైన టెక్నాలజీలను వినియోగిస్తోంది. ప్రజల–పోలీసులకు వారధిగా హాక్–ఐ వంటి యాప్స్ సైతం అందుబాటులోకి తెచ్చింది. అయితే, సమాజంలో నేరాల తీరు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇలా అవసరమైన ప్రతిసారి పోలీసులు కొన్ని సంస్థలను సంప్రదించడమో, తమ వద్ద ఉన్న బృందాల సహకారం తీసుకోవడమో చేస్తుంటారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చెన్నై, బెంగళూరు పోలీసుల మాదిరిగా హ్యాకథాన్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, స్టార్టప్ సంస్థలకు మాత్రమే.. చెన్నై, బెంగళూరు పోలీసులు ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు, ఐటీ పారిశ్రామిక వేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్‌తో పాటు రక్షణ రంగానికి చెందిన వారికీ అవకాశం కల్పించారు. నగర పోలీసులు మాత్రం స్టార్టప్ ఇండస్ట్రీస్, సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులతో పాటు కార్పొరేట్ ఉద్యోగులను మాత్రమే ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. హ్యాకథాన్‌లో పాల్గొనే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుగా wehub.telangana.gov.in/hackathon.html వెబ్ పేజీ సైతం అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమానికి ఐఐఐటీ హైదరాబాద్, ఐఐటీ హైదరాబాద్, జేఎన్టీయూ, వి–హబ్ వంటి సంస్థలు సహకరిస్తున్నాయి. రిజిస్టర్ చేసుకున్న వారంతా హ్యాకథాన్‌కు హాజరై తమ ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త యాప్స్‌ను పోలీసుల ముందు ప్రదర్శిస్తారు. వీటిని పరిశీలించి ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. వీటిలో తాము గుర్తించిన లోపాలు, అవసరమైన మార్పుచేర్పులను సూచిస్తారు. వీటిని పరిగణలోకి తీసుకుని సదరు విద్యార్థి/స్టార్టప్ సంస్థ ఆయా మార్పులు చేసి తక్షణం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇలా ఎంపికైన వాటిలో మూడింటికి బహుమతులు అందిస్తారు. నగర పోలీసు విభాగంతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లాలు, యూనిట్స్‌కు చెందిన పోలీసులు ఈ హ్యాకథాన్‌ను సందర్శించనున్నారు. ఇందులో సైబర్ నేరాలతో పాటు మహిళలు–చిన్నారులపై జరిగే నేరాలు నిరోధించడం, కేసులను కొలిక్కి తీసుకురావడం, రోడ్డు భద్రత పెంపొందించడం–అవగాహన కల్పించడం, సోషల్ మీడియాపై నిఘా–నకిలీ వార్తల గుర్తింపు అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. స్టూడెంట్‌తో పాటు స్టార్టప్ కేటగిరీల్లో వేర్వేరుగా విజేతలను ఎంపిక చేస్తారు. ఈ విజేతల ఆలోచనలను అమలు చేయడంలో పోలీసు విభాగంతో పాటు ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థలు సహకరించనున్నాయి. ప్రధానంగా వీటిపైనే దృష్టి.. సైబర్ క్రైమ్: ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ ఫోరెన్సిక్వెరిఫికేషన్ టూల్స్, నకిలీ టూల్స్, యాప్స్ గుర్తింపు, నకిలీ వెబ్‌సైట్స్, పోర్టల్స్ గుర్తింపు ఉమెన్/చిల్ట్రన్ సేఫ్టీ: ట్రాఫికింగ్ నిరోధం, వేళగాని వేళల్లో సంచరించే మహిళలకు రక్షణ, వర్క్ఫోర్స్హెరాస్మెంట్ నిరోధం, ఈవ్ టీజింగ్ నిరోధం,జీపీఎస్ టెక్నాలజీ వినియోగం, చైల్డ్ పోర్నోగ్రఫీనిరోధం, సోషల్ మీడియా–ఇంటర్నెట్పై నిఘా రోడ్ సేఫ్టీ: ఇంటెలిజెంట్ పార్కింగ్ సిస్టం, ఫుట్పాత్ఆక్రమణల నిరోధం, ఉల్లంఘనల గుర్తింపు సోషల్ మీడియా: నకిలీ వార్తల గుర్తింపు,మూలాలు కనిపెట్టడం -
హైదరాబాద్ హబ్‌లోనే డీబీఎస్ టెక్నాలజీ అభివృద్ధి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సింగపూర్‌కు చెందిన డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్) గ్రూప్ సాంకేతికత, అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతుంది. 2016లో నగరంలో 2 లక్షల చ.అ.ల్లో డీబీఎస్ ఏషియా హబ్ 2ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సింగపూర్ తర్వాత రెండో అతిపెద్ద టెక్నాలజీ హబ్ ఇదే. ఈ సెంటర్లో అతిపెద్ద బ్యాంకింగ్ అప్లికేషన్స్ ప్రొగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఫ్లాట్‌ఫామ్స్ (ఏపీఐఎస్), ఇంటిగ్రేటెడ్ ఈ–బ్యాంకింగ్ సొల్యూషన్స్, అకౌంటింగ్ అండ్ ఈఆర్పీ ఫ్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి జరుగుతుందని డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్) సీఈఓ సురోజిత్ షోమీ తెలిపారు. మన దేశంతో పాటూ చైనా, తైవాన్, సింగపూర్, హాంగ్‌కాంగ్ మార్కెట్లలో 350కి పైగా ఏపీఐఎస్ సేవలందిస్తున్నామని చెప్పారు. మంగళవారమిక్కడ డీబీఐఎల్ తొలి బ్యాంక్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం నానక్‌రాంగూడలోని వేవ్‌రాక్‌లో 2 లక్షల చ.అ.ల్లో డీబీఎస్ హబ్–2 ఉంది. ఇందులో 2 వేల మంది ఇంజనీర్లు, డెవలపర్లు పనిచేస్తున్నారు. త్వరలోనే రూ.260 కోట్ల పెట్టుబడులతో రాయదుర్గంలోని ఆర్ఎంజెడ్ స్కైవ్యూలో మరొక 2 లక్షల చ.అ.ల్లో కొత్త క్యాంపస్‌ను ప్రారంభించనున్నాం. ఏడాదిలో వెయ్యి మంది ఇంజనీరింగ్, టెక్నాలజీ నిపుణులను నియమించుకుంటామని’’ ఆయన వివరించారు. 25 నగరాలు, 100 బ్రాంచీలు.. ఇప్పటివరకు డీబీఎస్ గ్రూప్ ఇండియాలో రూ.7,700 కోట్ల పెట్టుబడులు పెట్టింది. వచ్చే 12–18 నెలల్లో దేశంలో 25 నగరాల్లో 100 బ్రాంచ్‌లు, కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని లకి‡్ష్యంచాం. ఇందుకోసం రూ.125–150 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాం. ఈ నెల ముగింపు నాటికి అహ్మదాబాద్, కోయంబత్తూరు, వడోదర, ఇండోర్, లుథియానాలో 9 బ్రాంచీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఐదు బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నాం. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, నాసిక్, సూరత్, కొల్హాపూర్, సాలీం, కుద్దాలూర్, ముర్దాబాద్ నగరాల్లో 12 బ్రాంచ్‌లున్నాయి. మూడేళ్లలో 1.50 లక్షల కోట్ల వ్యాపారం.. ప్రస్తుతం డీబీఐఎల్‌కు డిపాజిట్లు రూ.30 వేల కోట్లుగా ఉన్నాయి. ఇందులో సీఏఎస్ఏ 15–18%గా ఉంది. వచ్చే ఐదేళ్లలో 25 శాతం సీఏఎస్ఏ వృద్ధిని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం రూ.50 వేల కోట్ల బ్యాలెన్స్ షీట్స్ ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యాపారాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నాం. ఇప్పటివరకు కార్పొరేట్ రుణాల మీద ఎక్కువ దృష్టిపెట్టాం. ఇక నుంచి ఎస్ఎంఈ, రిటైల్ రుణాల మీద ఫోకస్ చేస్తాం. మొత్తం మొత్తం రుణాల్లో కార్పొరేట్ రూ.20 వేల కోట్ల వరకుంటాయి. 18 దేశాలు 280 బ్రాంచీలు.. ఇప్పటివరకు డీబీఎస్‌కు 18 దేశాల్లో 280 బ్రాంచీలు, 1200 ఏటీఎం సెంటర్లున్నాయి. 25 వేల మంది ఉద్యోగులున్నారు. ఏటా 11% వృద్ధి రేటుతో 13.2 సింగపూర్ బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. గత ఆర్ధిక సంవత్సరంలో 28% వృద్ధితో 5.6 సింగపూర్ బిలియన్ డాలర్ల లాభాన్ని మూటగట్టుకుంది. హ్యాక్‌థాన్ ద్వారా ఉద్యోగుల నియామకం క్యాంపస్ రిక్రూట్మెంట్, ఇంటర్వ్యూ వంటివి కాకుండా డీబీఎస్ బ్యాంక్ ఉద్యోగుల నియామకాలను హ్యాక్‌థాన్ ద్వారా నిర్వహిస్తుంది. డీబీఎస్ బ్యాంక్ మొత్తం నియామకాల్లో 30–40 శాతం హ్యాక్‌థాన్ ద్వారానే ఎంపిక చేస్తుంది. హ్యాక్ 2 హైర్ ప్రోగ్రామ్ ద్వారా ఆన్లైన్ చాలెంజ్ నిర్వహించి.. ఎంపికైన అభ్యర్థులు 24 గంటల రియల్ లైఫ్ బిజినెస్ ప్రొబ్లమ్స్ను పరిష్కరించాల్సి ఉంటుందని డీబీఎస్ ఆసియా హబ్ 2 హెడ్ మోహిత్ కపూర్ తెలిపారు. ఒక్కో హ్యాక్ 2 హైర్లో 13 వేలకు పైగా అభ్యర్థులు పాల్గొంటున్నారని.. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా విభాగాల్లో సుమారు వంద మంది నిపుణులను నియమించుకుంటామని తెలిపారు. త్వరలోనే 6వ ఎడిషన్‌ను ప్రారంభిచనున్నట్లు ఆయన చెప్పారు. నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. పాతికేళ్ల క్రితం ముంబైలో తొలి బ్రాంచ్ ప్రారంభించిన డీబీఎస్ బ్యాంక్ 2015లో పూర్తి సొంత అనుబంధ సంస్థ (డబ్ల్యూఓఎస్) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి దరఖాస్తు చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత అంటే ఈ ఏడాది మార్చి 1న ఆర్బీఐ అనుమతినిచ్చింది. దీంతో ప్రస్తుతం దేశంలోని 12 డీబీఎస్ బ్రాంచీలు కూడా డీబీఐఎల్‌లోకి మారాయి. ప్రస్తుతం మన దేశంలో 45 విదేశీ బ్యాంక్‌లున్నాయి. స్టాండర్డ్ చార్డెర్డ్కు 100 బ్రాంచీలు, సిటీ బ్యాంక్‌కు 35, హెచ్ఎస్బీసీకీ 26 బ్రాంచీలున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్‌కు 4 బ్రాంచీలున్నాయి. విదేశీ బ్యాంక్ నుంచి డబ్యూఓఎస్ బ్యాంక్‌గా మారిన తొలి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్. ఇది గతేడాది డిసెంబర్లో ఆర్బీఐ అనుమతి పొందింది. -
శాంతి, ప్రగతి మా ప్రాథమ్యాలు
సింగపూర్: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. సభ్య దేశాల మధ్య బహుళ రంగాల్లో సహకారం, సంబంధాలు పరిపుష్టం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం జరిగిన 13వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొన్నారు. తూర్పు ఆసియా సమావేశానికి మోదీ హాజరుకావడం ఇది 5వ సారి. ‘సభ్య దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలతో పాటు బహుళ రంగాల్లో సహకారం పెరగాలని తూర్పు ఆసియా దేశాల సదస్సు(ఈఏఎస్)లో నా ఆలోచనలు పంచుకున్నా. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశా’ అని మోదీ ఆ తరువాత ట్వీట్ చేశారు. అంతకుముందు, జపాన్ ప్రధాని షింజో అబేతో పాటు పలువురు దేశాధినేతలతో మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. దానికి ముందు జరిగిన ఆసియాన్–ఇండియా అల్పాహార సమావేశంలో మోదీ మాట్లాడుతూ..వ్యూహాత్మక ఇండో–పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి తీర భద్రతలో సహకారం, వాణిజ్య వికేంద్రీకరణ కీలకమని నొక్కిచెప్పారు. కేడెట్ మార్పిడి కార్యక్రమంలో భాగంగా సింగపూర్‌లో పర్యటిస్తున్న ఎన్సీసీ కేడట్లను కలుసుకున్న మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. మోదీ రెండు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకొని సాయంత్రం తిరుగు పయనమయ్యారు. హ్యాకథాన్ విజేతలకు సత్కారం.. ఇండియా, సింగపూర్ సంయుక్తంగా నిర్వహించిన తొలి హ్యాకథాన్ విజేతల్ని మోదీ సత్కరించారు. 36 గంటల పాటు జరిగిన గ్రాండ్ ఫినాలేలో రెండు దేశాల నుంచి మూడేసి చొప్పున జట్లు ఈ పోటీలో గెలుపొందాయి. భారత్ నుంచి విజేతలుగా నిలిచిన జట్లలో ఐఐ టీ ఖరగ్‌పూర్, ఎన్ఐటీ తిరుచ్చి, పుణే ఎంఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ బృందాలున్నాయి. సింగ పూర్ మంత్రి ఓంగ్ యే కుంగ్‌తో కలసి మోదీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
ఈసీకి పోటీగా ఆప్ హ్యాకథాన్
న్యూఢిల్లీ : ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడానికి ఈసీకి పోటీగా జూన్ 3న హ్యాకథాన్‌ను నిర్వహిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెలిపింది. ఇందుకు సాంకేతిక నిపుణులు, రాజకీయ పార్టీలు, ఈవీఎం తయారీ కంపెనీలతో పాటు ఈసీని కూడా ఆహ్వానిస్తామని ఆప్ ఢిల్లీయూనిట్ కార్యదర్శి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఈసీ కంటే మెరుగైన, పారదర్శకమైన హ్యాకథాన్‌ను నిర్వహిస్తామని భరద్వాజ్ స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రదర్శించిన ఈవీఎంలనే ఇందుకు ఉపయోగిస్తామని తెలిపారు. హ్యాకథాన్‌లో భాగంగా ట్యాంపరింగ్ కోసం ఈవీఎంలోని భాగాల్ని మార్చడానికి ఈసీ అనుమతించకపోవడంపై భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిబంధనను తొలగించాలని తాము ఇప్పటికే ఈసీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ నిబంధనల ప్రకారమే ఈసీ తమ ఈవీఎంను ట్యాంపరింగ్ చేయాలని భరద్వాజ్ సవాలు విసిరారు. జూన్ 3న హ్యాకథాన్ కోసం ఈసీ అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. కానీ సీపీఐ(ఎం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లు మాత్రమే ఇందుకు దరఖాస్తు చేసుకున్నాయి. -
రైతుల కోసం టెక్ హ్యాకథాన్
సాక్షి, హైదరాబాద్: చిన్న, సన్నకారు రైతులకు టెక్నాలజీ లాభాలు అందాలన్న లక్ష్యంతో మెట్టపంటల వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్), మైక్రోసాఫ్ట్, టీ-హబ్‌లు హైదరాబాద్‌లో రెండురోజుల పాటు హ్యాకథాన్ నిర్వహించాయి. రైతు సమస్యలకు టెక్నాలజీతో పరిష్కార మార్గాలను చూపే లక్ష్యంతో నిర్వహించిన ‘హ్యాక్4ఫార్మర్స్’లో ‘డిజిటల్ అగ్రి, రూరల్ ఈ-మార్కెటింగ్’ (డేర్-ఈ) యాప్ విజేతగా నిలిచింది. వివిధ మార్కెట్లలో ధరలు, కొనుగోలుదారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించే ఈ యాప్‌ను ఇక్రిశాట్, మైక్రోసాఫ్ట్ శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు రూపొందించారు. ఇక్రిశాట్లో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ అనిల్ భన్సాలీ, ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డేవిడ్ బెర్గ్‌విన్సన్, టీ-హబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమా అయ్యర్ హ్యాకథాన్ వివరాలను వెల్లడించారు. డేర్-ఈ బృందం ఆలోచనను ఒక ఉత్పత్తి/సేవగా రూపాంతరం చెందేందుకు టీ-హబ్ సహకరిస్తుందని రమా అయ్యర్ తెలిపారు. అన్నిరంగాలను ప్రభావితం చేస్తున్న టెక్నాలజీ సామర్థ్యాన్ని రైతులకూ అందించే లక్ష్యంతో హ్యాకథాన్ నిర్వహణకు ఇక్రిశాట్ ముందుకొచ్చిందని సంస్థ డెరైక్టర్ జనరల్ బెర్గ్‌విన్సన్ తెలిపారు. హ్యాకథాన్‌లో మొత్తం 11 బృందాలు పొల్గొన్నాయి.