Telugu Indian Idol Winner Vagdevi Wins How Much Prize Money, Full Details Inside - Sakshi
Sakshi News home page

Telugu Indian Idol Winner: తొలి తెలుగు ఇండియన్‌ ఐడల్‌ వాగ్దేవి ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

Published Sat, Jun 18 2022 2:16 PM | Last Updated on Sat, Jun 18 2022 3:33 PM

How Much Telugu Indian Idol Winner Vagdevi Wins Prize Money Here Is Details - Sakshi

ప్ర‌ముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వ‌హించిన తెలుగు ఇండియన్‌ ఐడల్‌ ఫినాలే ఎపిసోడ్‌ ఉత్కంఠ భరితంగా సాగింది. శుక్రవారం రాత్రి స్ట్రీమింగ్‌ అయిన ఈ ఫైనల్‌ ఎపిసోడ్‌కు మెగాస్టార్‌ చిరు చీఫ్‌ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కంటెస్టెంట్స్‌ చేసిన సందడి బాగా ఆకట్టుకుంది. చిరుతో పాటు రానా, సాయిప‌ల్ల‌విలు ‘విరాట‌ప‌ర్వం’ ప్ర‌మోషన్‌లో భాగంగా ఈ షోలో సంద‌డి చేశారు.

 

చదవండి: ‘ఆ బుక్‌ ఆధారంగా కెఫె కాఫీ డే వీజీ సిద్ధార్థ బయోపిక్‌ తీస్తున్నాం’

కాగా ఈ సింగింగ్ రియాలిటీ షోకు శ్రీరామ్‌చంద్ర హోస్ట్‌గా.. సంగీత ద‌ర్శ‌కుడు తమ‌న్‌, న‌టి నిత్యామీన‌న్, సింగ‌ర్ కార్తీక్‌లు జ‌డ్జ్‌లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఫినాలే ఎపిసోడ్‌లో వాగ్దేవి, వైష్ణ‌వి, ప్ర‌ణ‌తి, జ‌యంత్‌, శ్రీనివాస్‌లు ఫైన‌ల్‌కు రాగా.. వాగ్దేవి విన్నర్‌గా నిలిచింది. శ్రీనివాస్‌, వైష్ణవిలు 2, 3 స్థానాల్లో నిలిచి రన్నర్లుగా నిలిచారు. విజేతగా నిలిచిన వాగ్దేవికి చిరంజీవి ట్రోఫీని అందించాడు. అలాగే ట్రోఫీతో పాటు రూ.10 ల‌క్ష‌ల ప్రైజ్‌మనీని కూడా ఆమె గెలుచుకుంది. అంతేకాదు ఇకపై గీతా ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో ఓ పాట పాడే అవ‌కాశం కూడా ఆమె అందుకుంది. 

చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య

మొద‌టి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన శ్రీనివాస్‌కు రూ. 3 ల‌క్ష‌లు ప్రైజ్‌మని, రెండ‌వ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన వైష్ణ‌వికి 2 ల‌క్ష‌ల రూపాయలు బ‌హుమాతిగా అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి తన తదుప‌రి సినిమా ‘గాడ్‌ఫాద‌ర్‌’లో వైష్ణ‌వికి పాట పాడే అవ‌కాశం ఇచ్చాడు. అలాగే సింగ‌ర్ కార్తీక్‌ త‌ను సంగీతం అందించనున్న నెక్స్ట్ సినిమాలో విన్నర్‌ వాగ్దేవికి ఛాన్స్ ఇస్తున్న‌ట్లు తెలిపాడు. ఆనంతరం చిరుతో ముందుగానే వాగ్ధేవికి చెక్‌ను కూడా అందించాడు. ఇక ఈ ఎపిసోడ్‌లో నిత్యా మీన‌న్ పాట పాడ‌టం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. థ‌మ‌న్, కార్తిక్ పాట‌ల ప్ర‌ద‌ర్శ‌న‌, శ్రీరామ్ చంద్ర నృత్య ప్ర‌ద‌ర్శ‌నతో షోను మ‌రింత వినోదంగా సాగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement