
ప్రియాంకకు అభిమానుల ఝలక్...
తనను ఏ ప్రశ్న అయినా అడగొచ్చంటూ సోషల్ మీడియాలో సవాలు విసిరిన ప్రియాంకా చోప్రాకు అభిమానులు ఝలక్ ఇచ్చారు. మీడియాలో ఆమెపై వచ్చిన వదంతులన్నింటిపైనా ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న వార్తలు మొదలుకొని, షారూఖ్‌తో ప్రేమాయణంపై వచ్చిన కథనాల వరకు పలు ఇబ్బందికరమైన అంశాలపై గుచ్చి గుచ్చి ప్రశ్నించి ఇరకాటంలో పెట్టడంతో ప్రియాంక కంగుతింది.
ఇళ్లులేని వారిపై బియాన్స్ ఔదార్యం
పాప్‌స్టార్ బియాన్స్ ఇళ్లులేని వారి కోసం 7 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చి, ఔదార్యాన్ని చాటుకుంది. హూస్టన్ చర్చి పాస్టర్ రూడీ రాస్మస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇళ్లులేని 42 కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఆమె ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చిందని పాస్టర్ రాస్మస్ ఒక స్థానిక న్యూస్ చానల్‌కు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం బియాన్‌స చాలా ఔదార్యాన్ని చూపుతోందని ఆయన అన్నారు.