ఇండియాకి రావొద్దు! | Priyanka Chopra Do not come back to India | Sakshi
Sakshi News home page

ఇండియాకి రావొద్దు!

Aug 18 2017 12:19 AM | Updated on Oct 22 2018 6:05 PM

ఇండియాకి రావొద్దు! - Sakshi

ఇండియాకి రావొద్దు!

పాపం.. ప్రియాంకా చోప్రా. తన చేష్టలతో ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుని విమర్శలపాలవుతున్నారు.

పాపం.. ప్రియాంకా చోప్రా. తన చేష్టలతో ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుని విమర్శలపాలవుతున్నారు. ఆ మధ్య బెర్లిన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఈ బ్యూటీ చిట్టిపొట్టి డ్రెస్‌ వేసుకోవడం.. పైగా ప్రధాని ఎదుట కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న తీరుపై నెటిజన్లతో పాటు పలువురు ఆమెను తప్పుబట్టారు. సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. అది మరచిపోక ముందే మరో వివాదంలో చిక్కుకున్నారామె.

ప్రస్తుతం ప్రియాంక విదేశాల్లో ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే’ అంటూ ఆమె పోస్ట్‌ చేసిన సెల్ఫీ వివాదమైంది. జీన్స్‌ ప్యాంట్, లోనెక్‌ టీ–షర్ట్‌ వేసుకొని జాతీయ పతాకం రంగులతో ఉన్న చున్నీ మెడకు చుట్టుకుని, సెల్ఫీ తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారామె. అంతే.. విమర్శలు మొదలయ్యాయి. ‘సంప్రదాయంగా చీర కట్టుకోకుండా ఆ పిచ్చి డ్రెస్‌ ఏంటి? పైగా జెండాను మెడకు చుట్టుకోవడం ఏంటి? ఇదేం దేశభక్తి? అసలు నువ్వు ఇండియాకి తిరిగి రావొద్దు?’ అని సోషల్‌ మీడియా సాక్షిగా పలువురు మండిపడ్డారు. కొంతమంది ఫ్యాన్స్‌ మాత్రం ప్రియాంకను వెనకేసుకొస్తున్నారు. ఏదేమైనా పాపులార్టీతో పాటు ప్రియాంకను వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement