హూస్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీకి దిగుతున్న కమలా హారిస్‌కు ప్రఖ్యాత గాయని బియాన్స్ మద్దతు ప్రకటించారు. శుక్రవారం రాత్రి హూస్టన్‌లో జరిగిన డెమొక్రటిక్ ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘‘ఒక సెలబ్రిటీకి ఇక్కడికి రాలేదు. ఒక రాజకీయ నాయకురాలిగా రాలేదు. ఒక తల్లిగా వచ్చాను. మన బిడ్డలు ప్రతిబంధకాలు, పరిమితులు లేకుండా పెరగాలంటే కమలా హారిస్‌కు ఓటు వేయాలి’’అని పిలుపునిచ్చారు.
హూస్టన్ బియాన్స్ సొంత నగరం కావడం విశేషం. 2016లోనూ ఆమె అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతు పలికారు. క్లీవ్‌లాండ్‌లో ప్రచార సభలో హిల్లరీకి మద్దుతుగా ఒక పాట కూడా పాడారు. ఈసారి మాత్రం పాడలేదు. కమలా హారిస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. హూస్టన్ సభలో కమలా హారిస్ మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. మహిళల పునరుత్పత్తి హక్కుల విషయంలో గత 50 ఏళ్లలో సాధించిన ప్రగతిని ట్రంప్ నాశనం చేశారని మండిపడ్డారు. మహిళలకు హక్కులు నిరాకరించారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ను చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment