
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతాల ముద్దుల తనయ ఇషా అంబానీ వివాహం వేడుక అంశం మరోసారి వార్తల్లో కిచ్చింది. త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనున్న ఇషా, ఆనంద్ పిరామల్ (ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ పిరామల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అజయ్ పిరామల్ తనయుడు)మూడుముళ్ల సంబరానికి ముందస్తు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఈ కార్పొరేట్ కుటుంబాలు ప్లాన్ చేశాయి. పెళ్లిలో ప్రధాన ఘట్టమైన సంగీత్ ను స్పెషల్ ఎట్రాక్షన్‌తో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నాయని మీడియాలో పలు అంచనాలు గుప్పుమన్నాయి.
డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న సంగీత్ కార్యక్రమానికి ప్రముఖ పాప్ సింగర్ ప్రదర్శన ఇవ్వనున్నారట. అంతేకాదు ఇందుకు ఆమె భారీగా పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రీ రాయల్ వెడ్డింగ్ బాష్‌ను ఉదయపూర్‌లో ప్లాన్ చేశారట. ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్సే ఈ సంగీత్ కార్యక్రమంలో తన ప్రదర్శనతో హల్ చల్ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఆమెకు రూ.15 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారని తెలుస్తోంది.
కాగా డిసెంబర్10న ముంబైలో వీరు పెళ్లి పీటలెక్కనున్నారట. ఈ లవ్‌బర్డ్స్ నిశ్చితార్థ కార్యక్రమాన్ని గత నెలలో ఇటలీలో అధికారికంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు అక్టోబర్ 23 ఇషా అంబానీ 27వ పుట్టిన రోజు.
Comments
Please login to add a commentAdd a comment