న్యూఢిల్లీ: అదృష్టాన్ని నమ్మొద్దు, కష్టపడి పనిచేయాలని సాధారణంగా మనం అందరమూ నమ్ముతాం. కానీ ప్రపంచంలో ఎక్కువమందిని హార్డ్ వర్క్ కంటే అదృష్టమే ఎక్కువగా పలకరిస్తుంది. అలాంటి వారిలో కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి కూడా ఒకరు. చరిత్రలో ఏన్నడూ లేని విధంగా రికార్డ్ లాటరీ గెల్చుకుని బిలియనీర్‌గా అవతరించాడు. ఏకంగా వేల కోట్ల రూపాయల జాక్‌పాట్ తగలడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇల్లు సొంతం చేసుకుని మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు
బ్రిటిష్ పత్రిక ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం కాలిఫోర్నియాకు చెందిన ఎడ్విన్ కాస్ట్రో అమెరికా చరిత్రలోనే విలువైన పవర్‌బాల్ మెగా లాటరీని గెలుచుకున్నాడు. 2022, నవంబర్ నెలలో 2 బిలియన్ డాలర్ల (రూ.16,407 కోట్లు) ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అఅమెరికాలో ఇప్పటివరకు నలుగురు మాత్రమే ఒక బిలియన్ డాలర్లు గెల్చుకున్నారు. కాగా తాజా లాటరీలో పన్ను, ఇతర తగ్గింపుల తరువాత, మొత్తం రూ .8,180 కోట్లు కాస్ట్రో చేతికి వచ్చాయట.
ఈ జాక్‌పాట్‌తో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. హాలీవుడ్ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు నివాసముండే ఏరియాలో అతి ఖరీదైన 200 కోట్ల విలువైన భవనాన్ని కొనుగోలు చేశాడు. అలా అరియానా గ్రాండే, డకోటా జాన్సన్ జిమ్మీ కిమ్మెల్ వారికి పొరుగువాడిగా చేరిపోయాడు. ఈ విషయంలో భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటా వ్యక్తిగత ఆస్తుల కంటే నాలుగు రెట్లు ఎక్కువని ఇండిపెండెంట్ తెలిపింది. రతన్ టాటా వ్యక్తిగత ఆస్తి దాదాపు 4 వేల కోట్ల రూపాయలని పేర్కొంది.
ఈ భవనం ప్రత్యేకతలు
13,500 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం, ఐదు లగ్జరీ బెడ్ రూములు, అధునాతన సదుపాయాలతో ఏడు బాత్‌రూమ్‌లు. ఇంకా ఇన్ఫినిటీ పూల్, రెండు ఫైర్ పిట్స్, అవుట్‌డోర్ కిచెన్, స్పా అండ్ సౌరా, సినిమా థియేటర్ ఫిట్నెస్ స్టూడియో, రూఫ్ టాప్ డెక్, ఫైవ్ కార్ షోరూం, రెండు కారు గ్యారేజీలు లాంటి విలాసవంతమైన సౌకర్యాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment