ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ టవర్‌పై స్కై మాన్షన్!
బెంగళూరులో 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది
ఆకాశమంత ఎత్తులో ఉందీ ఇంద్రభవనం
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల ఎగవేసి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మాల్యాకు చెందిన బెంగళూరులోని ప్రతిష్టాత్మక కింగ్ ఫిషర్ టవర్స్‌పై నిర్మించిన ఇంద్రభవనం లాంటి పెంట్‌హౌస్ గురించి ఎపుడైనా విన్నారా?
దాదాపు 400 అడుగుల ఎత్తులో బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్ పైభాగంలోమాన్షన్ స్టైల్ పెంట్ హౌస్‌ను నిర్మించారు. ఒకపుడు అతని పూర్వీకులకు చెందిన 4.5 ఎకరాల భూమిపై టవర్, దానిపై పెంట్‌హౌస్‌ను రూపుదిద్దుకుంది. హెలీప్యాడ్, ఇన్ఫినిటీ పూల్ ఇలాంటి మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలు దీని సొంతం. హెలిప్యాడ్‌తో రెండు స్థాయిలలో (34- 35వ ఫోర్లు) 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని విలువ 20 వేల డాలర్లకు పైమాటే.
This 20 million dollar mansion was built on top of Kingfisher Towers in Bengaluru, India pic.twitter.com/Zce8Kk6Lx4
— Historic Vids (@historyinmemes) March 19, 2024
మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (UBHL),ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్‌గా ఇది నిర్మితమైంది. ఇందులో యూబీహెచ్‌ఎల్‌కు 55 శాతం, ప్రెస్టీజ్ డెవలపర్‌కు 45 శాతం వాటా ఉంది.
కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని ఫ్లాట్లను కూడా ఏడింటిని రూ.150 కోట్లకు విక్రయించిదంటే దీని క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. మొత్తం అమ్మకాలు 2013లోనే పూర్తి అయినట్టు భావిస్తున్నారు. అయితే మాల్యాపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో 2014లో UBHL ఫ్లాట్‌లను పెంట్ హౌస్‌ను విక్రయించకుండా దర్యాప్తు సంస్థలు నిషేధించాయి. దేశంనుంచి పారిపోయిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించే ప్రయత్నంలో ఉంది కేంద్రం.
Comments
Please login to add a commentAdd a comment