Kingfisher Villa
-
విలాసవంతమైన ఆకాశహర్మ్యం: ఎవరిదో? ఎక్కడుందో తెలుసా?
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల ఎగవేసి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మాల్యాకు చెందిన బెంగళూరులోని ప్రతిష్టాత్మక కింగ్ ఫిషర్ టవర్స్‌పై నిర్మించిన ఇంద్రభవనం లాంటి పెంట్‌హౌస్ గురించి ఎపుడైనా విన్నారా? దాదాపు 400 అడుగుల ఎత్తులో బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్ పైభాగంలోమాన్షన్ స్టైల్ పెంట్ హౌస్‌ను నిర్మించారు. ఒకపుడు అతని పూర్వీకులకు చెందిన 4.5 ఎకరాల భూమిపై టవర్, దానిపై పెంట్‌హౌస్‌ను రూపుదిద్దుకుంది. హెలీప్యాడ్, ఇన్ఫినిటీ పూల్ ఇలాంటి మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలు దీని సొంతం. హెలిప్యాడ్‌తో రెండు స్థాయిలలో (34- 35వ ఫోర్లు) 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని విలువ 20 వేల డాలర్లకు పైమాటే. This 20 million dollar mansion was built on top of Kingfisher Towers in Bengaluru, India pic.twitter.com/Zce8Kk6Lx4 — Historic Vids (@historyinmemes) March 19, 2024 మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (UBHL),ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్‌గా ఇది నిర్మితమైంది. ఇందులో యూబీహెచ్ఎల్కు 55 శాతం, ప్రెస్టీజ్ డెవలపర్‌కు 45 శాతం వాటా ఉంది. కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని ఫ్లాట్లను కూడా ఏడింటిని రూ.150 కోట్లకు విక్రయించిదంటే దీని క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. మొత్తం అమ్మకాలు 2013లోనే పూర్తి అయినట్టు భావిస్తున్నారు. అయితే మాల్యాపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో 2014లో UBHL ఫ్లాట్లను పెంట్ హౌస్‌ను విక్రయించకుండా దర్యాప్తు సంస్థలు నిషేధించాయి. దేశంనుంచి పారిపోయిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించే ప్రయత్నంలో ఉంది కేంద్రం. -
మాల్యా విల్లాను కొనుగోలు చేసిన హీరో
ముంబై: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన గోవాలోని విలాసవంతమైన కింగ్ ఫిషర్ విల్లా ఎట్టకేలకు అమ్ముడైంది. సినీ నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి ఈ విల్లాను సొంతం చేసుకున్నారు. ఈ విల్లాను అమ్మడానికి బ్యాంకు అధికారులు పలుమార్లు వేలం నిర్వహించినా నిర్ణీత ధరకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. సంప్రదింపుల ద్వారా బేరం మాట్లాడుకుని సచిన్ జోషికి అమ్మేందుకు అంగీకరించారు. చివరి సారి వేలంలో నిర్ణయించిన రిజర్వ్ ధర 73 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం చెల్లించేందుకు ఆయన అంగీకరించారు. కింగ్ ఫిషర్ విల్లాను అమ్మిన విషయాన్ని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య ధ్రువీకరించారు. బ్యాంకులకు మాల్యా భారీ మొత్తంలో రుణాలను ఎగవేసిన కేసులో ఆయన ఆస్తులను కొన్నింటిని బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. రుణాలను రికవరీ చేసేందుకుగాను గోవాలోని మాల్యా విల్లాను వేలానికి ఉంచారు. కండోలిమ్‌లో అరేబియా సముద్రానికి ఎదురుగా ఈ విల్లా ఉంది. ఈ విలాసవంతమైన విల్లాలో అన్ని రకాల సదుపాయాలు, వసతులు ఉన్నాయి. వేలంలో ఈ విల్లాను కొనుగోలు చేసేందుకు కొందరు ఆసక్తి చూపినా రిజర్వ్ ధర చెల్లించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పలుమార్లు నిర్వహించిన వేలంలో రిజర్వ్ ధరను 85 కోట్ల నుంచి 81 కోట్లకు, చివరకు 73 కోట్ల రూపాయలకు తగ్గించారు. చివరకు ఈ విల్లాను సచిన్ జోషి సొంతం చేసుకున్నారు. జేఎంజే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్ హోదాలో జోషి ఫిట్నెస్ సెంటర్ల నుంచి హెల్త్ స్పేష్ వరకు పలు రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హిందీ చిత్రాలు అజాన్, ముంబై మిర్రర్, జాక్‌పాట్‌లలో నటించారు. -
మాల్యా విల్లాను కొనేవారే కరువయ్యారు
ముంబై: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు చెందిన విల్లాను కొనేందుకు ఈసారి కూడా ఎవరూ ముందుకు రాలేదు. గురువారం మూడోసారి వేలం నిర్వహించగా ఎవరూ పాల్గొనలేదు. గతంలో నిర్వహించిన వేలానికి స్పందన రాకపోవడంతో 5 శాతం డిస్కౌంట్‌తో రూ.81 కోట్ల రిజర్వ్ ధరగా విల్లాను మళ్లీ వేలానికి పెట్టారు. ఈ సారి బయ్యర్లు వస్తారని ఆశించామని, అయితే ఎవరూ బిడ్లను దాఖలు చేయకపోవడంతో వేలం ప్రక్రియ మళ్లీ ఆగిపోయిదని అధికారులు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో విల్లాకు ఇంత భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేయడానికి బయ్యర్లు విముఖత చూపారని నిపుణులు చెబుతున్నారు. అక్టోబరులో ఈ విల్లాకు నిర్వహించిన వేలంలో రిజర్వ్ ధరను 85.29 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. తాజాగా నిర్వహించిన వేలంలో ఈ ధరను మరింత తగ్గించినా ఫలితం లేకపోయింది. ఉత్తర గోవాలోని కండోలిమ్ వద్ద ఈ విల్లా ఉంది. బ్యాంకులకు చెల్లించాల్సిన 9 వేల కోట్ల రూపాయలను మాల్యా ఎగవేసిన కేసులో బకాయిల వసూళ్ల కోసం ఈ విల్లాను వేలానికి పెట్టారు. -
కింగ్ ఫిషర్ విల్లాకు వీడని నీలినీడలు
-
వేలానికి మాల్యా గోవా విల్లా
స్వదేశానికి రావాలని ఉంది...కానీ పాస్ పోర్టు రద్దయిందని చిలక పలుకులు పలికిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కు మరో బ్యాడ్ న్యూస్. మాల్యా ప్రసిద్ధ విల్లాను వేలం వేసేందుకు ముహూర్తం ఖరారైంది. సుమారు రూ 85 కోట్ల కు దీన్ని వేలంవేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాప్ ట్రస్టీ నిర్ణయించింది. కాండోలిమ్ బీచ్ లోని 12, 350 చ.మీ విస్తీర్ణమున్నఈ విల్లా విక్రయానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 19న ఈ వేలం నిర్వహించనున్నారు. ఈ విల్లాను తనిఖీ చేసుకోవాలనుకునే వారు సెప్టెంబర్ 26, 27, అక్టోబర్ 5, 6 తేదీల అవకాశం ఉంటుందని ట్రస్టీ తెలిపింది. విజయ్ మాల్యా గోవా వచ్చినప్పుడు ఈ విల్లాలో బస చేసి ప్రముఖులతో విందు చేసుకునేవాడు. అత్యాధునిక సదుపాయాలతో బీచ్ ఒడ్డున కొలువు దీరిన ఈ విల్లా విలువ సుమారు తొంభై కోట్లు ఉంటుందని అంచనా. కాగా సుమారు తొమ్మిదివేల కోట్ల రుణ బకాయిలు ఎగవేసి లండన్ కు పారిపోయాడు. గోవాలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వివాదంలో ఈ విల్లాను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ ఎటాచ్ చేసిన సంగతి తెలిసిందే. -
గోవా కింగ్ ఫిషర్ విల్లా స్వాధీన కసరత్తు!
పణజి: ఉత్తర గోవా క్యాండోలిమ్లో ఉన్న కింగ్‌ఫిషర్ విల్లా స్వాధీనానికి బ్యాంకులు కసరత్తు ప్రారంభించాయి. బ్యాంకింగ్ రుణాలు పొందడానికి ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’ పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా తనఖాపెట్టిన ఆస్తుల్లో ఇది ఒకటి. దీని విలువ దాదాపు 90 కోట్లుగా అంచనా. ఈ ఆస్తి స్వాధీనానికి రెండు రోజుల క్రితమే కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఎస్బీఐ క్యాపిటల్ కంపెనీ విల్లా వద్ద సర్ఫేసీ యాక్ట్ కింద ఒక నోటీసు బోర్డ్‌ను ఉంచింది. ఎస్బీఐ క్యాపిటల్ అధికారులతో పాటు జిల్లా పాలనాధికారులు విల్లాను సందర్శించారు. విజయ్ మాల్యా గోవా వచ్చినప్పుడు ఈ విల్లాలోనే ఉండేవారు. పలు పార్టీలకు ఇది వేదికగా ఉండేది.