ఓక్లే అనే ఐవేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ జన్నార్డ్ ఇటీవల తన మాలిబు ప్రాపర్టీని 210 మిలియన్ డాలర్లకు (రూ.1,754 కోట్లు) విక్రయించి కాలిఫోర్నియాలో అత్యంత ఖరీదైన ఇంటి అమ్మకంలో కొత్త రికార్డు నెలకొల్పారు. రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేకమైన మాలిబు ప్రాంతంలో.. డెలావేర్ ఆధారిత లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ద్వారా ఈ విక్రయం జరిగింది. అయితే కొనుగోలుదారు ఎవరన్నది వెల్లడి కాలేదు.
లాస్ ఏంజలెస్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. జానార్డ్ 2012లో బిలియనీర్ ఇన్వెస్టర్ హోవార్డ్ మార్క్స్ నుంచి 75 మిలియన్ డాలర్లకు ఈ ఓషన్ ఫ్రంట్ ఎస్టేట్ ను కొనుగోలు చేశారు. అంతకుముందు మార్క్స్ దీన్ని హెర్బాలైఫ్ సహ వ్యవస్థాపకుడు మార్క్ హ్యూస్ నుంచి 2002లో 31 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.
ఇంటి ప్రత్యేకతలు ఇవే..
15,000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీ ఎల్ పెస్కాడోర్ స్టేట్ బీచ్ కు ఆనుకుని ఉంది. దీనికి సొంత ప్రైవేట్ 300 అడుగుల స్ట్రెచ్ ఓషన్ ఫ్రంటేజ్ ఉంది. ప్రధాన నివాసంలో ఎనిమిది పడక గదులు, 14 బాత్ రూమ్ లు ఉన్నాయి. దీనికి అనుబంధంగా జిమ్, రెండు ప్రత్యేక గెస్ట్ హౌస్ లు ఉన్నాయి.
ఈ అమ్మకంతో, మాలిబు ఇప్పుడు కాలిఫోర్నియా చరిత్రలో మూడు అత్యధిక గృహాల అమ్మకాలను కలిగి ఉంది. ప్రస్తుత అమ్మకపు ధర గత సంవత్సరం జే-జెడ్, బియోన్స్ వారి మాలిబు కాంపౌండ్ పై సాధించిన 200 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. 2021లో మాలిబు ప్యారడైజ్ కోవ్‌లో విస్తారమైన ఎస్టేట్‌ను 177 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment