Malibu beach house
-
రియల్ ఎస్టేట్ రికార్డ్.. రూ.1,754 కోట్ల ఇల్లు అమ్మకం
ఓక్లే అనే ఐవేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ జన్నార్డ్ ఇటీవల తన మాలిబు ప్రాపర్టీని 210 మిలియన్ డాలర్లకు (రూ.1,754 కోట్లు) విక్రయించి కాలిఫోర్నియాలో అత్యంత ఖరీదైన ఇంటి అమ్మకంలో కొత్త రికార్డు నెలకొల్పారు. రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేకమైన మాలిబు ప్రాంతంలో.. డెలావేర్ ఆధారిత లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ద్వారా ఈ విక్రయం జరిగింది. అయితే కొనుగోలుదారు ఎవరన్నది వెల్లడి కాలేదు.లాస్ ఏంజలెస్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. జానార్డ్ 2012లో బిలియనీర్ ఇన్వెస్టర్ హోవార్డ్ మార్క్స్ నుంచి 75 మిలియన్ డాలర్లకు ఈ ఓషన్ ఫ్రంట్ ఎస్టేట్ ను కొనుగోలు చేశారు. అంతకుముందు మార్క్స్ దీన్ని హెర్బాలైఫ్ సహ వ్యవస్థాపకుడు మార్క్ హ్యూస్ నుంచి 2002లో 31 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.ఇంటి ప్రత్యేకతలు ఇవే..15,000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీ ఎల్ పెస్కాడోర్ స్టేట్ బీచ్ కు ఆనుకుని ఉంది. దీనికి సొంత ప్రైవేట్ 300 అడుగుల స్ట్రెచ్ ఓషన్ ఫ్రంటేజ్ ఉంది. ప్రధాన నివాసంలో ఎనిమిది పడక గదులు, 14 బాత్ రూమ్ లు ఉన్నాయి. దీనికి అనుబంధంగా జిమ్, రెండు ప్రత్యేక గెస్ట్ హౌస్ లు ఉన్నాయి.ఈ అమ్మకంతో, మాలిబు ఇప్పుడు కాలిఫోర్నియా చరిత్రలో మూడు అత్యధిక గృహాల అమ్మకాలను కలిగి ఉంది. ప్రస్తుత అమ్మకపు ధర గత సంవత్సరం జే-జెడ్, బియోన్స్ వారి మాలిబు కాంపౌండ్ పై సాధించిన 200 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. 2021లో మాలిబు ప్యారడైజ్ కోవ్‌లో విస్తారమైన ఎస్టేట్‌ను 177 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. -
లాస్ఏంజిల్స్లో చిల్ అవుతున్న బాలీవుడ్ భామ..
ముంబై: బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తన కొత్త చిత్రం ‘రూహి’ విడుదల తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని కొంచెం చిల్ అవ్వడానికి లాస్ ఏంజిల్స్‌కు వెళ్లింది. ఆమె వెంట సోదరి ఖుషీ, స్నేహితుడు రోహన్ జౌరా కూడా ఉన్నారు. కాలిఫోర్నియాలోని మాలిబు ప్రాంత బీచ్ సమీపాన తన పరివారంతో కలిసి సేదతీరుతున్న ఫొటోలను ఈ బ్యూటీ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో మాలిబు తీరంలోని పాయింట్ డ్యూమ్ వద్ద సముద్రం, ఆకాశం కలుస్తున్నట్లు కనిపించే అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడవచ్చు. లిలక్ స్ట్రాపీ టాప్, లావెండర్ ప్యాంటులో ప్రకృతి అందాల మధ్య మరో అందంలా నిల్చున్న జాన్వీ కపూర్ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ప్రస్తుతం నేను లాస్ఎంజెల్స్ ఉన్నప్పటికీ, నాకు మాత్రం మా ఇంట్లో ఉన్నట్టే ఉంది’ అని జాన్వీ చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం ఓ సరదా వీడియోను సైతం పంచుకుంది. 'మరో ఐస్‌క్రీమ్ స్కూప్ తినడం కోసం నాతో నేనే పోరాడుతున్నా' అంటూ ఫన్నీగా క్యాప్షన్ పెట్టింది. ఇదిలా వుంటే తన లేటెస్ట్ చిత్రం 'రూహి'లో దెయ్యం పట్టిన మహిళ పాత్రలో నటించిందీ భామ. హార్దిక్ మెహతా దర్శకత్వం వహించిన రూహిలో రాజ్‌కుమార్ రావు, వరుణ్ శర్మ నటించారు. జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నటించింది. ఇక జాన్వీ తదుపరి ప్రాజెక్టుల విషయానికి వస్తే నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘ఘోస్ట్ స్టోరీస్’ లో నటిస్తోంది. ప్రస్తుతం తనకి గుడ్ లక్ జెర్రీ, కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన తఖ్త్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న దోస్తానా 2 ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి డాటర్‌గా అరంగ్రేటం చేసిన జాన్వీ కపూర్ బాలీవుడ్లో తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) ( చదవండి : జాన్వీ కపూర్‌ని ముద్దడిగిన ఫ్యాన్.. తన రిప్లై చూస్తే.. ) -
ఇంటిని అమ్మకానికి పెట్టిన సింగర్
సింగర్ పింక్, కేరె హర్ట్ దంపతులు కాలిఫోర్నియాలోని తమ విలాసవంతమైన భవనాన్ని అమ్మకానికి పెట్టారు. గతేడాదే అమ్మకానికి పెట్టినా అమ్ముడు కాకపోవడంతో ఈసారి ధర తగ్గించారు. సుమారు రూ. 86 కోట్లకు (12.99 మిలియన్ డాలర్లు) బేరం పెట్టారు. బీచ్ సిటీ మాలిబులో పసిఫిక్ తీర్ర ప్రాంతానికి అనుకునివున్న ఈ విలాస భవంతిని 2010లో రూ. 79 కోట్లకు(11.85 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేశారు. 2015లో దాదాపు రూ. 93 కోట్లు(13.99 మిలియన్ డాలర్లు)కు అమ్మకానికి పెట్టారు. అయితే దీన్ని కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మిలియన్ డాలర్లు తగ్గించి 12.99 మిలియన్ డాలర్లకు బేరం పెట్టారు. ఆరు బెడ్రూములు, బాత్రూములతో 1.2 ఎకరాల విస్తీర్ణంలో 2005లో ఈ భవంతిని నిర్మించారు. మోటర్ క్రాస్ రైడర్ అయిన కేరె హర్ట్ ను పింక్ 2006లో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2008లో వీడిపోయి 2010లో మళ్లీ కలిశారు.