ఇంటిని అమ్మకానికి పెట్టిన సింగర్ | Pink selling Malibu house for USD 12.9 million | Sakshi
Sakshi News home page

ఇంటిని అమ్మకానికి పెట్టిన సింగర్

May 27 2016 10:50 AM | Updated on Sep 4 2017 1:04 AM

ఇంటిని అమ్మకానికి పెట్టిన సింగర్

ఇంటిని అమ్మకానికి పెట్టిన సింగర్

సింగర్ పింక్, కేరె హర్ట్ దంపతులు కాలిఫోర్నియాలోని తమ విలాసవంతమైన భవనాన్ని అమ్మకానికి పెట్టారు.

సింగర్ పింక్, కేరె హర్ట్ దంపతులు కాలిఫోర్నియాలోని తమ విలాసవంతమైన భవనాన్ని అమ్మకానికి పెట్టారు. గతేడాదే అమ్మకానికి పెట్టినా అమ్ముడు కాకపోవడంతో ఈసారి ధర తగ్గించారు. సుమారు రూ. 86 కోట్లకు (12.99 మిలియన్ డాలర్లు) బేరం పెట్టారు. బీచ్ సిటీ మాలిబులో పసిఫిక్ తీర్ర ప్రాంతానికి అనుకునివున్న ఈ విలాస భవంతిని 2010లో రూ. 79 కోట్లకు(11.85 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేశారు. 2015లో దాదాపు రూ. 93 కోట్లు(13.99 మిలియన్ డాలర్లు)కు అమ్మకానికి పెట్టారు.

అయితే దీన్ని కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మిలియన్ డాలర్లు తగ్గించి 12.99 మిలియన్ డాలర్లకు బేరం పెట్టారు. ఆరు బెడ్రూములు, బాత్రూములతో 1.2 ఎకరాల విస్తీర్ణంలో 2005లో ఈ భవంతిని నిర్మించారు. మోటర్ క్రాస్ రైడర్ అయిన కేరె హర్ట్ ను పింక్ 2006లో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2008లో వీడిపోయి 2010లో మళ్లీ కలిశారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement