వాషింగ్టన్: తాను, తన మూడేళ్ల కుమారుడు ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డామని అమెరికా సింగర్ అలేసియా బెత్ మూర్(పింక్) తెలిపారు. అయితే రెండు వారాల చికిత్స అనంతరం తాము పూర్తిగా కోలుకున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ తమ కుటుంబమంతా ఇప్పటికీ క్వారంటైన్‌లోనే ఉందని వెల్లడించారు. త్వరితగతిన కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడం వల్ల ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇది ప్రభుత్వ వైఫల్యేమేనని విమర్శించారు.
ఈ మేరకు... ‘‘ రెండు వారాల క్రితం నేను.. నా మూడేళ్ల కుమారుడు జేమ్‌సన్ కోవిడ్-19న బారిన పడ్డాం. అయితే మా ఫిజీషియన్ వెంటనే దీని లక్షణాలను గుర్తించి మాకు చికిత్స అందించడం మొదలుపెట్టారు. కుటుంబ సభ్యులకు మేం దూరంగా ఉన్నాం. ఈ క్రమంలో రెండోసారి టెస్టు చేయగా అదృష్టవశాత్తూ నెగటివ్ వచ్చింది. కరోనా చిన్నా- పెద్దా, యువత- వృద్ధులు, ధనిక- పేదా ఇలా అందరికీ సోకుతుంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి’’ అని అలేసియా సూచించారు. (పారిశుద్ధ్య కార్మికులను ప్రశంసించిన బాలీవుడ్ నటి)
అదే విధంగా తన తల్లి పనిచేసిన ఫిలడెల్పియా ఆస్పత్రికి తన వంతుగా విరాళం అందజేస్తానని పెద్దమనసు చాటుకున్నారు. 5 లక్షల డాలర్ల మేర ఆర్థిక సహాయం అందజేస్తానని తెలిపారు. తన తల్లి జుడీ మూర్ అక్కడ 18 ఏళ్లపాటు సేవలు అందంచారని.. ఆమె జ్ఞాపకార్థం ఈ మొత్తం అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా లాస్ ఏంజెల్స్ సహాయ నిధికి మరో 5 లక్షల డాలర్ల సాయం అందించనున్నట్లు వెల్లడించారు. కాగా పింక్‌గా ప్రేక్షకులకు సుపరిచితమైన అలేసియా తన గాత్రం, రచనా కౌశల్యం, నృత్య ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కరోనా సంక్షోభంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఈ 40 ఏళ్ల ఈ గాయనిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (కరోనా బారిన పడ్డ యువ గాయని)
Comments
Please login to add a commentAdd a comment