Google CEO Sundar Pichai 31 Acres Of Luxury House In California, Details Inside - Sakshi
Sakshi News home page

సుందర్‌ పిచాయ్‌: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?

Published Mon, Jun 19 2023 4:09 PM | Last Updated on Mon, Jun 19 2023 4:55 PM

google Sundar Pichai House of 31 acres California details inside - Sakshi

సెర్చ్‌ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌,ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్  గురించి  ప్రత్యేక పరిచయం అవసరంలేదు. గ్లోబల్‌ టాప్‌ సీఈవోలలో ఒకరిగా చాలా మందికి ఆయన రోల్ మోడల్. తమిళనాడుకు చెందిన ఐఐటి గ్రాడ్యుయేట్‌ చెన్నైలోని అశోక్ నగర్‌లో ఉన్న పూర్వీకుల భవనాన్ని ఇటీవల విక్రయించిన సుందర్‌ పిచాయ్‌ నివాసముంటున్న ఇల్లు ఎలా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది. 

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఐటీ నిపుణుల్లో,బిలియన్ల మందికి రోల్ మోడల్‌ సుందర్‌ పిచాయ్‌ ఉంటున్న ఇల్లు ఖరీదు రూ. 10వేల కోట్లు అంటే నమ్ముతారా. సుందర్ పిచాయ్ అద్భుతమైన భవనం కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీలోని లాస్ ఆల్టోస్‌లోని కొండపై 31.17 ఎకరాల్లో ఉంది. సుందర్ పిచాయ్ భార్య అంజలి పిచాయ్ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ కోసం రూ. 49 కోట్లు ఖర్చు చేశారట.. కొన్నేళ్ల క్రితం ఈ భవనాన్ని సుందర్ పిచాయ్ 40 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.

(అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్‌బస్ హెలికాప్టర్‌, ఇంకా విశేషాలు)

విశాలమైన బెడ్‌ రూమ్స్‌ ఇన్ఫినిటీ పూల్, జిమ్నాసియం, స్పా, వైన్ సెల్లార్ సోలార్ ప్యానెల్స్ , లిఫ్టులు , నానీ క్వార్టర్‌ లాంటి హంగులతో ఉన్న అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ హోమ్‌ విలువ ఇపుడు రూ. 10,000 కోట్లకు పైమాటే. 2022లో రూ.1852 కోట్లు  జీతం అందుకున్న సుందర్ పిచాయ్‌ నికర విలువ 1,310 మిలియన్ల డాలర్లుగా ఉంది.


సుందర్ పిచాయ్ 2015లో గూగుల్ సీఈఓగా, 2019లో ఆల్ఫాబెట్ ఇంక్ సీఈవోగా ఎంపికయ్యారు. జూన్ 10, 1972న తమిళనాడులోని మధురైలో జన్మించారు.1989లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ఇం జనీరింగ్‌ పట్టాపొందారు. (అలియా హాలీవుడ్‌ ఎంట్రీ:ఆమె గ్రీన్‌ డ్రెస్‌ ధర ఎంతో తెలుసా?)

స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో  మెటీరియల్ సైన్స్ లో  ఎంఎస్‌చేశారు. ఈ తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి  చేశారు.

పిచాయ్ 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్‌గా చేరారు. కాలేజీ ఫ్రెండ్‌ను అంజలి పిచాయ్‌ని వివాహం చేసుకున్న పిచాయ్‌కు కిరణ్, కావ్య అనే ఇద్దరు పిల్లలున్నారు. 2022నలో ఇండియా మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement