ఫొటోలో కనిపిస్తున్న ఈ భవంతి విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ‘ది హోల్మ్’ అని పిలిచే దీని ప్రస్తుత ధర రూ. 2,500 కోట్లు పలికి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతిగా నిలిచింది.
(వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్‌లోనే కంట్రోలింగ్)
లండన్‌లో 1818లో జార్జియన్ ప్రాపర్టీ డెవలపర్ జేమ్స్ బర్టన్ అనే వ్యక్తి దీనిని నిర్మించాడు. ముందు బర్టన్ వంశస్థులే ఇందులో నివాసం ఉండేవారు. కొద్ది రోజులు బర్టన్ కళశాలగా మార్చారు. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా 1980లో ప్రైవేటు నివాసంగా మార్చారు. ఇక అప్పటి నుంచి అనేక సార్లు, అనేకమంది దీనిని మార్కెట్‌లో అమ్మకానికి ఉంచారు. ప్రతిసారి అనుకున్నదాని కంటే ఎక్కువ ధర పలుకుతూనే ఉంది.
(నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్)
గత సంవత్సరం సౌదీ రాజకుటుంబ సభ్యుల్లో ఒకరు దీనిని రూ.1500 కోట్లకు కొనుగోలు చేశారు. వారే ఇప్పుడు రూ.2,500 కోట్ల ధరకు అమ్మకానికి ఉంచారు. ఈ వేలం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. చూడాలి ఈసారి హోల్మ్‌ను దక్కించుకునే ఆ యజమాని ఎవరో!
Comments
Please login to add a commentAdd a comment