మీరు చదుతున్నది నిజమే. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని పెంట్ హౌస్ రూ.240 కోట్లకు అమ్మడుపోయింది. ఈ అపార్ట్‌మెంట్ ముంబై నగరంలోని వోర్లీ ప్రాంతంలో ఉంది. వెల్సన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా ఇంత భారీ మొత్తం చెల్లించి దీన్ని సొంతం చేసుకున్నారు. ఖరీదైన ఈ ట్విన్ టవర్స్ పేరు ‘360వెస్ట్’. ఇందులో 63, 64, 65 అంతస్థుల్లో ఈ పెంట్‌హౌస్ ఉంది. దీని విస్తీర్ణం 30వేల చదరపు అడుగులు.
నగరంలో అత్యంత విలాసవంతమైన ‘360వెస్ట్’ అపార్ట్‌మెంట్‌లో ట్రిపులెక్స్ పెంట్ హౌస్ భారీ ధరకు అమ్ముడుపోయి అత్యంత భారీ అమ్మకాల్లో ఒకటిగా నిలిచింది. ఈ భారీ డీల్ బుధవారం జరిగింది. ఇందులో నివసించేందుకు పారిశ్రామికవేత్త ఈ ఖరీదైన ట్రిపులెక్స్ పెంట్ హౌస్‌ను కొనుగోలు చేశారు. అయితే పక్కగా ఉన్న మరో పెంట్ హౌస్‌ను బిల్డర్ వికాస్ ఒబెరాయ్ రూ.24 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం.
కాగా గత వారంలోనే ఒబెరాయ్ రియల్టీ సంస్థ.. ఈ విలాసమంతమైన ‘360వెస్ట్’ భవన సముదాయాన్ని రూ.4వేల కోట్లకు కొనుగోలు చేసినట్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌సీల్లో నమోదు చేసుకుంది. ఇందులో 63 అపార్ట్‌మెంటులు ఉన్నాయి. ల్యాండ్ ఏరియా 5.25 లక్షల చదరపు అడుగులు. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న సముదాయం రెండు భవంతులుగా ఉంటుంది. ఇందులో ఒకటి రెసిడెన్సియల్ ప్రాజెక్ట్ కాగా మరొకటి రిట్జ్-కార్ల్‌టన్ హోటల్.
(ఇదీ చదవండి: ఓలా కొత్త స్కూటర్లు వచ్చేశాయి.. ధర ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment