రూ.వెయ్యి కోట్ల ఇల్లు.. వందేళ్ల చరిత్ర! | Rs 1000 crore house in mumbai Jinnah House | Sakshi
Sakshi News home page

రూ.వెయ్యి కోట్ల ఇల్లు.. వందేళ్ల చరిత్ర!

Published Sat, Mar 25 2023 10:08 PM | Last Updated on Sat, Mar 25 2023 10:09 PM

Rs 1000 crore house in mumbai Jinnah House - Sakshi

రూ.వెయ్యి కోట్ల విలువైన ఇల్లు ఇది.. కానీ ఇందులో ఎవరూ నివాసం ఉండటం లేదు. అత్యంత చారిత్రక నేపథ్యం ఈ ఇంటికి ఉంది. వందేళ్ల​ క్రితం రూ.2 లక్షల ఖర్చు పెట్టి ఈ ఇంటిని నిర్మించారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి విలువ ఇప్పుడు రూ.వెయ్యి కోట్లకుపైనే ఉంటుంది.

ముంబైలోని మలబార్ హిల్.. అత్యంత ఖరీదైన ప్రాంతం. దేశంలోని కొన్ని సంపన్న కుటుంబాలకు నిలయం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతంలోనే అక్కడ నివసిస్తున్నారు. గోద్రేజ్ కుటుంబం వంటి బిలియనీర్లు కూడా అక్కడ ఉంటున్నారు.  కానీ అదే స్థాయిలో వివాదాలు, విశేషాలు ఉన్న ఓ ఇల్లు అక్కడ ఉంది. అదే ‘సౌత్ కోర్ట్’. పాకిస్థాన్‌కు జాతిపితగా పిలిచే మహమ్మద్ అలీ జిన్నా దీన్ని నిర్మించారు.

ఇదీ చదవండి: పనేమీ లేకుండా రూ.కోటిన్నర జీతమిచ్చారు!

ఇల్లు అచ్చిరాలేదు..
వందేళ్ల క్రితం మలబార్ హిల్‌లో ఈ బంగ్లాను జిన్నా కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ మలబార్ హిల్ ముంబై (అప్పటి బొంబాయి) ప్రముఖులకు గోటూ జోన్‌గా ఉండేది. జిన్నా ఇల్లు అతని పార్సీ స్నేహితుడైన సర్ దిన్షా పెటిట్ ఇంటికి దగ్గరగా ఉండేది. ఆ సమయంలో సర్ దిన్షా పెటిట్ నగరంలోనే అత్యంత సంపన్నుడు. ఆయనకు రూట్టీ అనే కుమార్తె ఉండేది. 

18 ఏళ్ల వయసున్న ఆమెను జిన్నా 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. దీంతో పెటిట్ కుటుంబంతో విభేదాలు చలరేగాయి. కొన్ని రోజులపాటు ఆ ఇంట్లో ఉన్న జిన్నా దంపతులు తర్వాత విడిచిపెట్టి వెళ్లిపోయారు. విలాసవంతమైన తాజ్ మహల్ హోటల్‌లో నివాసమున్న రూట్టీ ఏడాది తరువాత మరణించింది. జిన్నా కూడా లండన్‌ వెళ్లిపోయారు.

ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్‌!

జిన్నా భారతదేశానికి తిరిగివచ్చాక కొన్నేళ్లపాటు ఆ ఇంట్లో ఉన్నారు. రాజకీయ సమావేశాల కోసం ఆ ఇల్లు సరిపోవడం లేదంటూ  1936లో రూ.2 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద భవనం నిర్మించారు. 1940లలో మహాత్మా గాంధీ, జిన్నా మధ్య కీలక సమావేశాలకు ఈ ఇంట్లోనే జరిగాయి. దేశ విభజన సమీపిస్తున్న నేపథ్యంలో జిన్నా ఈ ఇంటిని అమ్మేందుకు అప్పట్లో ప్రయత్నించినట్లు చెబుతారు. 

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాలపాటు ఆ ఇంటిని బ్రిటిష్ హైకమిషన్‌కు అద్దెకు ఇచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఖరీదైన ఇల్లు నిరుపయోగంగా ఉంది. 2021లో బీజేపీ నాయకుడు మంగళ్ ప్రభాత్ లోధా ఈ జిన్నా హౌస్‌ను కళా సాంస్కృతిక కేంద్రంగా మార్చడానికి ముందుకు వచ్చారు.

ఇదీ చదవండి: లక్ష టవర్లు.. 5జీ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో దూకుడు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement