Jinnah House
-
రూ.వెయ్యి కోట్ల ఇల్లు.. వందేళ్ల చరిత్ర!
రూ.వెయ్యి కోట్ల విలువైన ఇల్లు ఇది.. కానీ ఇందులో ఎవరూ నివాసం ఉండటం లేదు. అత్యంత చారిత్రక నేపథ్యం ఈ ఇంటికి ఉంది. వందేళ్ల క్రితం రూ.2 లక్షల ఖర్చు పెట్టి ఈ ఇంటిని నిర్మించారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి విలువ ఇప్పుడు రూ.వెయ్యి కోట్లకుపైనే ఉంటుంది. ముంబైలోని మలబార్ హిల్.. అత్యంత ఖరీదైన ప్రాంతం. దేశంలోని కొన్ని సంపన్న కుటుంబాలకు నిలయం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతంలోనే అక్కడ నివసిస్తున్నారు. గోద్రేజ్ కుటుంబం వంటి బిలియనీర్లు కూడా అక్కడ ఉంటున్నారు. కానీ అదే స్థాయిలో వివాదాలు, విశేషాలు ఉన్న ఓ ఇల్లు అక్కడ ఉంది. అదే ‘సౌత్ కోర్ట్’. పాకిస్థాన్‌కు జాతిపితగా పిలిచే మహమ్మద్ అలీ జిన్నా దీన్ని నిర్మించారు. ఇదీ చదవండి: పనేమీ లేకుండా రూ.కోటిన్నర జీతమిచ్చారు! ఇల్లు అచ్చిరాలేదు.. వందేళ్ల క్రితం మలబార్ హిల్‌లో ఈ బంగ్లాను జిన్నా కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ మలబార్ హిల్ ముంబై (అప్పటి బొంబాయి) ప్రముఖులకు గోటూ జోన్‌గా ఉండేది. జిన్నా ఇల్లు అతని పార్సీ స్నేహితుడైన సర్ దిన్షా పెటిట్ ఇంటికి దగ్గరగా ఉండేది. ఆ సమయంలో సర్ దిన్షా పెటిట్ నగరంలోనే అత్యంత సంపన్నుడు. ఆయనకు రూట్టీ అనే కుమార్తె ఉండేది. 18 ఏళ్ల వయసున్న ఆమెను జిన్నా 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. దీంతో పెటిట్ కుటుంబంతో విభేదాలు చలరేగాయి. కొన్ని రోజులపాటు ఆ ఇంట్లో ఉన్న జిన్నా దంపతులు తర్వాత విడిచిపెట్టి వెళ్లిపోయారు. విలాసవంతమైన తాజ్ మహల్ హోటల్లో నివాసమున్న రూట్టీ ఏడాది తరువాత మరణించింది. జిన్నా కూడా లండన్ వెళ్లిపోయారు. ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్! జిన్నా భారతదేశానికి తిరిగివచ్చాక కొన్నేళ్లపాటు ఆ ఇంట్లో ఉన్నారు. రాజకీయ సమావేశాల కోసం ఆ ఇల్లు సరిపోవడం లేదంటూ 1936లో రూ.2 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద భవనం నిర్మించారు. 1940లలో మహాత్మా గాంధీ, జిన్నా మధ్య కీలక సమావేశాలకు ఈ ఇంట్లోనే జరిగాయి. దేశ విభజన సమీపిస్తున్న నేపథ్యంలో జిన్నా ఈ ఇంటిని అమ్మేందుకు అప్పట్లో ప్రయత్నించినట్లు చెబుతారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాలపాటు ఆ ఇంటిని బ్రిటిష్ హైకమిషన్‌కు అద్దెకు ఇచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఖరీదైన ఇల్లు నిరుపయోగంగా ఉంది. 2021లో బీజేపీ నాయకుడు మంగళ్ ప్రభాత్ లోధా ఈ జిన్నా హౌస్‌ను కళా సాంస్కృతిక కేంద్రంగా మార్చడానికి ముందుకు వచ్చారు. ఇదీ చదవండి: లక్ష టవర్లు.. 5జీ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో దూకుడు! -
జిన్నా హౌస్‌పై సిగపట్లు!
భారత్–పాక్‌ల మధ్య కొనసాగుతున్న వివాదాల్లోకి తాజాగా జిన్నా హౌస్ వచ్చి చేరింది. ముంబైలోని జిన్నా హౌస్ తమదంటే తమదంటూ భారత్, పాకిస్తాన్‌లు వాదిస్తున్నాయి. ఆ హౌస్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుంటామని, ఉన్నత స్థాయి అధికార సమావేశాలకు, విందులకు అనువుగా తీర్చిదిద్దుతామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించడం తాజా వివాదానికి తెర తీసింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ మాదిరిగా జిన్నా హౌస్‌ను అభివృద్ధి చేయాలని భారత్ భావిస్తోంది. దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ బీజేపీ ఎమ్మెల్యే మంగల్ ప్రభాత్ లోధాకు ఈ నెల 5న రాసిన లేఖలో సుష్మా ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అధీనంలో ఉంది. ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు దాన్ని విదేశాంగ శాఖకు బదలాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని సుష్మా పేర్కొన్నారు. జిన్నా హౌస్ తమ సొంతమని భారత్ స్పష్టంగా చెబుతుంటే.. అది తమదని, దాన్ని సొంతం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని పాక్ అంటోంది. గతంలో కూడా జిన్నాహౌస్ తమకివ్వాలని, అందులో పాక్ దౌత్య కార్యాలయం పెడతామని పాక్ చెబుతోంది. అయితే జిన్నా హౌస్ భారత ఆస్తి అని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ స్పష్టం చేశారు. పాక్‌కు దీనిపై ఎలాంటి హక్కు లేదని, ఒకవేళ హక్కు కోసం ప్రయత్నిస్తే తామూ పోరాడుతామని పేర్కొన్నారు. మరోవైపు జిన్నా హౌస్‌పై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని పాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ అన్నారు. పాక్ కర్తార్‌పూర్‌ను ఇస్తుందా..? జిన్నాహౌస్‌ను ఇస్తే కర్తార్‌పూర్‌ను భారత్‌కు ఇస్తారా అన్న ప్రశ్నకు ఫైజల్ బదులిస్తూ అలా ఎప్పటికీ జరగదన్నారు. సిక్కుల కోరిక మేరకు కర్తార్‌పూర్‌కు వీసా లేకుండా వెళ్లివచ్చే అవకాశం కల్పించామని, ఈ నిర్ణయంలో భారత్‌కు కూడా భాగముందని వివరించారు. జిన్నాహౌస్పై తనకు యాజమాన్య హక్కు కల్పించాలని కోరుతూ జిన్నా కుమార్తె దినా వాడియా 2007 ఆగస్టులో ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారు. జిన్నా ఏకైక వారసురాలిని తానే కాబట్టి తనకు ఆ ఇల్లు అప్పగించాలని కోరారు. ఆమె మరణించడంతో ఆమె కుమారుడు నస్లీవాడియా ఈ కేసును నడిపిస్తున్నారు. ఐరోపా శిల్పశైలికి ప్రతీక పాక్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా 1936లో జిన్నా హౌస్‌ను నిర్మించుకున్నారు. ముంబై మలబార్ హిల్‌లో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవంతికి ప్రముఖ ఐరోపా ఆర్కిటెక్చర్ క్లాడ్ బాట్లే ఐరోపా శిల్పశైలిలో అద్భుతంగా రూపకల్పన చేశారు. దేశ విభజన జరిగి పాకిస్తాన్ (కరాచి)వెళ్లే వరకు జిన్నా ఈ ఇంట్లోనే ఉన్నారు. అప్పట్లోనే దీని నిర్మాణానికి రూ.2 లక్షలు ఖర్చయింది. రెండున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ భవంతి నిర్మాణానికి ఇటాలియన్ పాలరాయిని వాడారు. 1944 సెప్టెంబర్‌లో దేశ విభజనపై గాంధీ, జిన్నాల మధ్య చర్చలు ఈ ఇంట్లోనే జరిగాయి. 1946 ఆగస్టు 15న నెహ్రూ, జిన్నాలు ఇక్కడే చర్చలు జరిపారు. -
జిన్నా హౌస్ ముమ్మాటికీ భారత్‌దే
న్యూఢిల్లీ: ముంబైలో 1930 దశకంలో పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా నివసించిన భవంతిని తమ కాన్సులేట్‌కు అప్పగించాలన్న పాక్ అభ్యర్థనను భారత్ తిరస్కరించింది. ఆ ఆస్తిపై భారత్‌కే పూర్తి హక్కు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ‘అది ప్రభుత్వ ఆస్తి. దాన్ని నవీకరించే పనిలో ఉన్నాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. భారత్‌లో పర్యటించే ప్రముఖ దేశాల అధ్యక్షులు, ప్రధానులతో భేటీ, విందు కోసం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌ను వినియోగిస్తున్న తరహాలో జిన్నా హౌస్‌ను ఆధునీకరించాలని కేంద్రం భావిస్తోంది. అయితే, ‘ఆ భవంతి మాదే అని భారత్ గతంలోనే అంగీకరించింది. అందుకు సంబంధించిన సాక్ష్యాలున్నాయి. భారతసర్కారు స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు’ అని ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో భారత్ గురువారం పైవిధంగా స్పందించింది. -
ముంబైలోని ఆ ఇల్లు మాదే: పాకిస్తాన్
న్యూఢిల్లీ: తమ దేశ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఇంటిని అప్పగించాలని పాకిస్తాన్ కోరింది. ముంబైలోని జిన్నా ఇంటిపై తమ ప్రభుత్వానికి ఉన్న యాజమాన్య హక్కును భారత సర్కారు గౌరవించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఇంటిని భారత ప్రభుత్వం పరిరక్షిస్తుందన్న నమ్మకాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా వ్యక్తం చేశారు. ముంబైలో ఉన్న జిన్నా ఇల్లు తమదేశ ఆస్తి అని పేర్కొన్నారు. దీన్ని పాకిస్తాన్ కు అప్పగిస్తామని చాలా సందర్భాల్లో భారత్ హామీయిచ్చిందని, ఇప్పటివరకు మాట నిలబెట్టుకోలేదని వెల్లడించారు. దక్షిణ ముంబైలో ఉన్న జిన్నా ప్యాలెస్‌ను కూల్చివేసి, సాస్కృంతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ బిల్డర్ మంగల్ ప్రభాత్ లోధా ఈ నెల 25న అసెంబ్లీలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ భవనం ప్రభుత్వ ఆస్తి అని పేర్కొన్నారు. దీని నిర్వహణకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన తెలిపారు. -
జిన్నా ఇంటిని కూల్చొద్దంటూ పాక్ వేడుకోలు
ఇస్లామాబాద్(పాకిస్తాన్): పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఇంటిని కూల్చొద్దంటూ పాకిస్తాన్, భారత ప్రభుత్వాన్ని వేడుకుంది. మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే దానిని కూల్చి ఆస్థలంలో మరో బిల్డింగ్‌ను నిర్మించాలని ప్రతిపాదన తేవడంతో పాక్ వెంటనే అప్రమత్తమైంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన జిన్నా ఇంటిని గౌరవించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందని పాకిస్తాన్ అధికార ప్రతినిధి నఫీజ్ జాకారియా తెలిపారు. భారతదేశ విభజన జిన్నా ఇంట్లోనే పునాది పడిందని, జిన్నా ఇల్లు విభజనకు గుర్తు అని.. అటువంటి ఇంటిని తప్పకుండా నాశనం చేయాలని బీజేపీ నేత మంగళ్ ప్రభాత్ లోథా డిమాండ్ చేస్తున్నారు. జిన్నా ఇల్లు దక్షిణ ముంబైలో ఉంది. ఆ ఇంటిలోనే భారత జాతి పిత మహాత్మా గాంధీతో జిన్నా స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో సమాలోచనలు జరిపేవారు. -
2600 కోట్ల జిన్నా ప్యాలెస్.. నేలమట్టం!
ఆ భవనం విభజనకు ప్రతీక.. దానిని కూల్చాల్సిందే: బీజేపీ నేత దక్షిణ ముంబైలో ఉన్న మహమ్మద్ అలీ జిన్నా ప్యాలెస్‌ను కూల్చాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ బిల్డర్ మంగల్ ప్రభాత్ లోధా డిమాండ్ చేశారు. ఈ విస్తారమైన భవనాన్ని కూల్చి.. ఇక్కడ సాస్కృంతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అసెంబ్లీలో కోరారు. 2.5 ఎకరాల విస్తారమైన ప్రదేశంలో సముద్రానికి అభిముఖంగా యూరోపియన్ శైలిలో నిర్మితమైన ఈ భవనం విలువ రూ. 2600 కోట్లకు (400 మిలియన్ డాలర్ల)కుపైగా ఉంటుంది. 'దక్షిణ ముంబైలోని జిన్నా నివాసంలోనే దేశ విభజన కుట్రకు బీజాలు పడ్డాయి. జిన్నా నివాసం విభజనకు ప్రతీక. కాబట్టి ఆ నిర్మాణాన్ని కూల్చాల్సిందే' అని ఆయన పేర్కొన్నారు. అత్యంత విలాసవంతంగా రూపొందిన ఈ కట్టడంలో 1982 వరకు బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ నివసించారు. ఆ తర్వాత ఈ భవనాన్ని ఎవరూ వినియోగించకపోవడంతో ఇది ప్రస్తుతం చాలావరకు శిథిల దశకు చేరుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ భవనం ప్రభుత్వ ఆస్తి అని, దీనిని కూల్చడమొక్కటే ప్రస్తుతమున్న ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు.