న్యూఢిల్లీ: ముంబైలో 1930 దశకంలో పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా నివసించిన భవంతిని తమ కాన్సులేట్‌కు అప్పగించాలన్న పాక్ అభ్యర్థనను భారత్ తిరస్కరించింది. ఆ ఆస్తిపై భారత్‌కే పూర్తి హక్కు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది.
‘అది ప్రభుత్వ ఆస్తి. దాన్ని నవీకరించే పనిలో ఉన్నాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. భారత్‌లో పర్యటించే ప్రముఖ దేశాల అధ్యక్షులు, ప్రధానులతో భేటీ, విందు కోసం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌ను వినియోగిస్తున్న తరహాలో జిన్నా హౌస్‌ను ఆధునీకరించాలని కేంద్రం భావిస్తోంది.
అయితే, ‘ఆ భవంతి మాదే అని భారత్ గతంలోనే అంగీకరించింది. అందుకు సంబంధించిన సాక్ష్యాలున్నాయి. భారతసర్కారు స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు’ అని ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో భారత్ గురువారం పైవిధంగా స్పందించింది.
Comments
Please login to add a commentAdd a comment