Muhammad Ali Jinnah
-
Independence Day: ఒకరోజు ముందే ఎందుకంటే..!
బ్రిటిష్ పాలన నుంచి 1947లో ఇండియాకు విముక్తి లభించినా ఆంగ్లేయుల కుట్ర దేశాన్ని రెండు ముక్కలు చేసింది. ఫలితంగా భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఆగస్టు 15న ఒకే రోజు అధికారికంగా ఉనికిలోకి వచ్చాయి. కనుక రెండింటికీ అదే స్వాతంత్య్ర దినం. కానీ పాక్ మాత్రం ఆగస్టు 14నే తమ స్వాతంత్య్ర దినంగా జరుపుకుంటుంది. ఎందుకో తెలుసా? ఏటా భారత్ కంటే ముందే వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దలు చేసిన ఆలోచన వల్ల! లేదంటే చరిత్రను చూసినా, ఇంకే కోణంలో ఆలోచించినా అంతకుమించి దీని వెనక మరో కారణమేదీ ఏమీ కన్పించదు. స్వాతంత్య్ర ప్రకటన మొదలుకుని రెండు దేశాలకు అధికారాన్ని బ్రిటన్ బదలాయించడం దాకా ఏం జరిగిందన్నది నిజంగా ఆసక్తికరం... భారత స్వాతంత్య్ర చట్టాన్ని 1947 జూలై 18న ప్రకటించారు. ‘1947 ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ పేరిట బ్రిటిషిండియా రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడనుంది’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ జాతి పిత, తొలి గవర్నర్ జనరల్ మహ్మదాలీ జిన్నా కూడా జాతినుద్దేశించి ప్రసంగించింది కూడా ఆగస్టు 15వ తేదీనే. ఆగస్టు 15ను స్వతంత్ర, సార్వ¿ౌమ పాకిస్తాన్’ పుట్టినరోజుగా ఆ ప్రసంగంలో ఆయన అభివర్ణించారు. ఇలాంటి వాస్తవాలు, రికార్డులతో పాటు లాజిక్ ప్రకారం చూసినా పాక్‌కు కూడా ఆగస్టు 15 మాత్రమే స్వాతంత్య్ర దినమని ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టు షాహిదా కాజీ అభిప్రాయపడ్డారు. జిన్నా, పాక్ తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది కూడా 1947 ఆగస్టు 15వ తేదీనే అని ఆయన గుర్తు చేశారు. 1948 జూలైలో పాక్ విడుదల చేసిన తొలి స్మారక పోస్టల్ స్టాంపుపై కూడా ఆగస్టు 15ను దేశ స్వాతంత్య్ర దినంగా స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ మాజీ ప్రధాని చౌధురీ ముహమ్మద్ అలీ 1967లో రాసిన పుస్తకంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ‘‘1947 ఆగస్టు 15 ఈదుల్ ఫిత్ర్ పర్వదినం. ముస్లింలకు అతి పవిత్రమైన ఆ రోజునే ఖౌద్–ఏ–ఆజం (జిన్నా) పాక్ తొలి గవర్నర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. నెలవంక, నక్షత్రంతో కూడిన పాక్ పతాకం ప్రపంచ యవనికపై తొలిసారి అధికారికంగా ఎగిరింది’’ అని రాసుకొచ్చారు.ఆగస్టు 14న ఏం జరిగిందంటే...1947 ఆగస్టు 14న నాటి బ్రిటిíÙండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ కరాచీలో పాక్ రాజ్యాంగ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర చట్టం ప్రకారం ఆయన ఆగస్టు 15న భారత్, పాక్ రెండింటికీ అధికారాన్ని లాంఛనంగా బదలాయించాలి. బ్రిటన్ సింహాసన ప్రతినిధిగా సంబంధిత ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి పూర్తి చేయాలి. కానీ, అందుకోసం ఒకే రోజు ఇటు ఢిల్లీలో, అటు కరాచీలో ఉండటం సాధ్యపడని పని. పోనీ ముందుగా భారత్‌కు అధికారాన్ని బదలాయించాక కరాచీ వెళ్లడమూ కుదరదు. ఎందుకంటే బ్రిటన్ రాణి నిర్ణయం మేరకు విభజన అనంతరం స్వతంత్ర భారత్‌కు ఆయన తొలి గవర్నర్ జనరల్ అవుతారు. భారత్‌కు అధికార బదలాయింపు జరిగిన క్షణమే ఆయనకు వైస్రాయ్ హోదా పోయి గవర్నర్ జనరల్ హోదా వస్తుంది. కనుక బ్రిటిíÙండియా వైస్రాయ్గా ఉండగానే పాక్‌కు అధికార మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే మౌంట్‌బాటెన్ 14వ తేదీనే కరాచీ వెళ్లి ఆ లాంఛనం పూర్తి చేసి ఢిల్లీ తిరిగొచ్చారు. పాక్‌కు స్వాతంత్య్రం మాత్రం ఆగస్టు 15నే వచ్చింది.ముందుకు జరుపుకోవడం వెనక... విభజన చట్టం ప్రకారం, వాస్తవాల ప్రాతిపదికన... ఇలా ఏ లెక్కన చూసినా పాక్ కూడా భారత్‌తో పాటే ఏటా ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్ర దినం జరుపుకోవాలి. కానీ స్వాతంత్య్రం వచి్చన మరుసటి ఏడాది నుంచే, అంటే 1948 నుంచే ఆగస్టు 14న స్వాతంత్య్ర దినం జరుపుకుంటూ వస్తోంది. దీనికి రకరకాల కారణాలు చెబుతారు. ఎక్కువమంది చెప్పేదేమిటంటే, భారత్ కంటే ముందే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దల మెదళ్లను ఓ పురుగు తొలిచిందట! దాంతో 1948 జూన్ చివర్లో నాటి ప్రధాని లియాకత్ అలీ ఖాన్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి ఈ మేరకు అధికారికంగా తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించొద్దంటే పాక్ జాతి పిత జిన్నా ఆమోదముద్ర ఉండాలని భావించారట. అందుకే, స్వాతంత్య్ర దినాన్ని ఒక రోజు ముందుకు జరిపేందుకు జిన్నా కూడా అనుమతించారని తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అది శుద్ధ అబద్ధమని, 1948 ఆగస్టు నాటికే జిన్నా మరణశయ్యపై ఉన్నారని ఆయన జీవిత చరిత్ర రాసిన యాసర్ లతీఫ్ హందానీ స్పష్టం చేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇండియా@75: తెగని బంధం
1947 ఆగస్ట్ 7న ఉదయమే బొంబాయిలోని మజ్గావ్లో ఉన్న ఇస్నాషరి శ్మశానవాటికకు వెళ్లారు జిన్నా. చేతిలో పుష్పగుచ్ఛం. ఒకచోట పెద్ద పేటిక వంటి పాలరాతి సమాధి ముందు నిలిచారు. ముందు భాగంలో శిలాఫలకం మీద నల్లటి అక్షరాలు : రతన్‌బాయి మహమ్మద్ అలీ జిన్నా (జననం 20 ఫిబ్రవరి 1900–మరణం 20 ఫిబ్రవరి 1929). పుష్పగుచ్ఛం ఆ సమాధి మీద పెట్టారు. రతన్‌బాయి పెటిట్ లేదా రతన్‌బాయి జిన్నా లేదా రూతీ.. జిన్నా భార్యే. బొంబాయి కోటీశ్వరులలో ఒకరైన దిన్షా మానేక్‌జీ పెటిట్, దీన్ల కూతురు రూతీ. జిన్నా ప్రేమలో పడింది. అప్పటికి జిన్నా వయసు 41 ఏళ్లు. అంత వయసున్న జిన్నాను మైనారిటీ తీరని ఈ అమ్మాయి ఎందుకు ప్రేమించింది? జిన్నాకు ఆ రోజుల్లో ఉన్న ఖ్యాతి వల్లనే. కరాచీ వదిలి బొంబాయి వచ్చిన జిన్నా పెద్ద బారిస్టర్ అయ్యారు. 1904 నాటికే భారత జాతీయ కాంగ్రెస్‌లో ముఖ్యుడయ్యారు. 1910 నాటికే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడయ్యారు. గోపాలకృష్ణ గోఖలేకే కాదు, బాలగంగాధర్ తిలక్‌కూ, అనిబీసెంట్కూ, మదన్మోహన్ మాలవీయకూ సన్నిహితులు. సరోజినీ నాయుడు.. జిన్నాను హిందూ ముస్లిం స్నేహ వారధిగా శ్లాఘించేవారు. కొన్ని అభిరుచులు కూడా జిన్నాను ఆ రూతీకి చేరువచేశాయి. అయితే ఆ ఇద్దరు మాట్లాడుకోకుండా దిన్షా పెటిట్ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చారు. కానీ పద్దెనిమిదేళ్లు నిండగానే రూతీ మలబార్ హిల్స్‌లోనే ఉన్న జిన్నా పాత ఇంటికి కట్టుబట్టలతో వచ్చేశారు. ఆ ఇంటిలోనే జిన్నా ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. భర్తను ‘జే’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారామె. 1919 ఆగస్ట్ 14న వారికి కూతురు దీనా (వాడియా) పుట్టింది. తరువాత జిన్నా ముస్లింలీగ్ రాజకీయాలలో తలమునకలైపోయారు. అప్పటికే రూతీకి పేగు క్యాన్సర్. సరిగ్గా పుట్టిన రోజునే అంటే 1929 ఫిబ్రవరి 20న ఆమె కన్ను మూశారు. దేశ విభజన సమయంలో తనతో పాకిస్తాన్ వచ్చేయమని కూతురు దీనాను ఆర్తితోనే అడిగారు జిన్నా. ఆమె వెళ్లలేదు. ప్రతి ఆగస్ట్ 14న పాకిస్తాన్ ఆవిర్భావ దినోత్సవానికి జెండా ఎగురవేస్తుంటే భారత్‌లోనే ఉండిపోయిన ఒక్కగానొక్క కూతురు దీనా పుట్టినరోజు గుర్తుకు రాకుండా ఉంటుందా? కానీ అలాంటి హింసాత్మక సంఘర్షణకు గురయ్యే పరిస్థితి నుంచి కాలమే అతడిని కరుణించింది. 1948 సెప్టెంబర్ 11న, పాకిస్తాన్ ఏర్పడిన మరుసటి ఏడాదే మేధస్సుతో కాకుండా, హృదయంతో స్పందించడం మొదలు పెడుతున్న వేళ బారిస్ట్టర్ జిన్నా చనిపోయారు. (చదవండి: ఉద్యమం కాదు.. మహాభారత యుద్ధం!) -
అఖిలేశ్‌పై అమిత్ షా మాటల దాడి
ఆజంగఢ్: పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను గాంధీజీ, పటేల్, నెహ్రూతో సమానంగా పోల్చుతూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అఖిలేశ్ జిన్నాలో గొప్పతనం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అఖిలేశ్ సొంత లోక్‌సభ నియోజకవర్గం ఆజంగఢ్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ‘ఇక్కడి ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ‘జేఎఎం’ జన్‌ధన్, ఆధార్, మొబైల్ ఫోన్లు ఇవ్వగా, సమాజ్‌వాదీ నేతలు మాత్రం ‘జేఏఎం’..జిన్నా, ఆజంఖాన్, ముఖ్తార్(డాన్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ)లను తెరపైకి తెచ్చారు’ అంటూ విమర్శించారు. సీఎం యోగి తీసుకుంటున్న కఠిన చర్యలతో పూర్వాంచల్ ప్రాంతంలో మాఫియా ముఠాలే కాదు, దోమలు కూడా పరారయ్యాయన్నారు. -
రతన్‌బాయి- జిన్నా.. వారిది విచిత్ర వివాహం
దేశ విభజన, దేహ విభజన వేర్వేరు కావు. పోలండ్, జర్మనీ, వియత్నాం, కొరియా, యెమెన్ వంటి దేశాలు విడిపోయాయి. కొన్ని మళ్లీ ఏకమైనాయి. ఏ దేశ విభజనైనా విషాదాంతమే. ఫలశ్రుతి ఒక్కటే. జీవితాలు ఛిన్నాభిన్నం. అనుబంధాల నిలువుకోత. వలసలు, తరిమివేయడం, రక్తపాతం.. 1947 నాటి భారత విభజనలోనూ అదే పునరావృతమైంది. దేశ/దేహ విభజన ఒకటేనంటూ గుండెను చీల్చుకు వచ్చిన అనుభవం ఆ విభజన కారకుడిగా చరిత్ర బోనులో నిలబడిన మహమ్మద్ అలీ జిన్నాకే ఎదురైంది. 1947 ఆగస్ట్ 7న ఉదయమే బొంబాయిలోని మజ్గావ్లో ఉన్న ఇస్నాషరి శ్మశానవాటికకు వెళ్లాడు జిన్నా. చేతిలో పుష్పగుచ్ఛం. ఒకచోట ఇత్తడి రెయిలింగ్ మధ్య ఉన్న నాలుగు అడుగుల ఎత్తు, ఆరడుగుల పొడువు ఉన్న పెద్ద పేటిక వంటి పాలరాతి సమాధి ముందు నిలిచాడు. ముందు భాగంలో శిలాఫలకం మీద నల్లటి అక్షరాలు రతన్‌బాయి మహమ్మద్ అలీ జిన్నా (జననం 20 ఫిబ్రవరి 1900–మరణం 20 ఫిబ్రవరి 1929) పుష్పగుచ్ఛం ఆ సమాధి మీద పెట్టాడు. రతన్‌బాయి పెటిట్ లేదా రతన్‌బాయి జిన్నా లేదా రూతీ జిన్నా భార్యే. ఆ ఇద్దరిదీ ఒక విచిత్ర వివాహం. చిత్రమైన ప్రేమగాథ. బొంబాయి కోటీశ్వరులలో ఒకడైన దిన్షా మానేక్‌జీ పెటిట్, దీన్ల ముద్దుల పట్టి రూతీ. నూలు మిల్లులను బొంబాయికి తెచ్చిన పార్సీ కుటుంబం. దిన్షా పెటిట్, జిన్నా ఆప్తమిత్రులు. పెటిట్ కేసులను వాదించే న్యాయవాదుల బృందంలో జిన్నా ఒకడు. పెటిట్ సన్నిహితుడు, కాంగ్రెస్ ప్రముఖుడు ఫిరోజ్‌షా మెహతా.. జిన్నాకూ ఆప్తుడే. అలా పెటిట్ కుటుంబీకులకూ సన్నిహితుడయ్యాడు జిన్నా. 1916 సంవత్సరంలో తమ కుటుంబంతో పాటు డార్జిలింగ్ వచ్చి అక్కడి తమ వేసవి విడిదిలో అతిథిగా ఉండవలసిందని జిన్నాను కోరాడు దిన్షా. నిజానికి ఏటా వేసవికి ఫ్రాన్స్‌లో గడపి వస్తుంది ఆ కుటుంబం. ప్రపంచ యుద్ధం కారణంగా అప్పుడు డార్జిలింగ్‌ను ఎంచుకున్నారు. ఆ ప్రయాణం జిన్నా జీవితాన్ని మలుపు తిప్పింది. ‘రూతీ జిన్నా: ది స్టోరీ, టోల్డ్ అండ్ అన్‌టోల్డ్’ (ఖ్వాజా రజా హైదర్), ‘రోజెస్ ఇన్ డిసెంబర్’ (ఎంసీ చాగ్లా), ‘ఫ్రీడవ్‌ు ఎట్ మిడ్నైట్’ (ల్యారీ కోలిన్స్, డొమినీక్ లాపీరె) పుస్తకాలు ఈ ఘట్టాలను నమోదు చేశాయి. పెటిట్ కుమార్తె ..‘ఫ్లవర్ ఆఫ్ బాంబే’గా పేర్గాంచిన అందాలరాశి, పదహారేళ్ల రతన్‌బాయి జిన్నా ప్రేమలో పడింది. అప్పటికి జిన్నా వయసు 41 ఏళ్లు. ఆమె తండ్రి వయసూ దాదాపు అంతే. అంతదాకా జిన్నాకు పెళ్లి కాలేదా? అయింది. 1893లో జిన్నాను చదువు కోసం లండన్ పంపించే ముందు అతడి తల్లి ముందుజాగ్రత్తగా ఎమీ బాయి అనే దగ్గర బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది. కానీ అతడు తిరిగి దేశం వచ్చే సరికి ఎప్పుడూ చూడనీ, మాట్లాడనీ భార్య, తల్లి కూడా ప్లేగుతో చనిపోయారు. మళ్లీ వివాహం చేసుకోలేదు. అంత వయసున్న జిన్నాను మైనారిటీ తీరని ఆ అమ్మాయి ఎందుకు ప్రేమించింది? జిన్నాకు ఆ రోజుల్లో ఉన్న ఖ్యాతి వల్లనే. కరాచీ వదిలి బొంబాయి వచ్చిన జిన్నా పెద్ద బారిస్టర్ అయ్యాడు. 1904 నాటికే భారత జాతీయ కాంగ్రెస్‌లో ముఖ్యుడయ్యాడు. 1910 నాటికే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడయ్యాడు. గోపాలకృష్ణ గోఖలేకే కాదు, బాలగంగాధర్ తిలక్‌కూ, అనిబీసెంట్కూ, మదన్మోహన్ మాలవీయకూ సన్నిహితుడు. సరోజినీ నాయుడు.. జిన్నాను హిందూ ముస్లిం స్నేహ వారధిగా శ్లాఘించేవారు. కొన్ని అభిరుచులు కూడా జిన్నాను ఆ రూతీకి చేరువ చేశాయి. అందులో మొదటిది సాహిత్యం. డార్జిలింగ్ తేయాకు తోటలలో, జలపాతాల దగ్గర, బౌద్ధారామాలలో అంకురించిన ఆ ప్రేమను సమాజం అంగీకరిస్తేనే వింత తప్ప, అంగీకరించపోతే వింతేకాదు. ఆ ఇద్దరు మాట్లాడుకోకుండా దిన్షా పెటిట్ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చాడు. కానీ పద్దెనిమిదేళ్లు నిండగానే రూతీ మలబార్ హిల్స్‌లోనే ఉన్న జిన్నా పాత ఇంటికి వచ్చేసింది కట్టుబట్టలతో, తన కుక్కపిల్లతో. 1918 ఏప్రిల్ 18న ఆమె మతం మార్చి (రూతీ ‘మరియం’ అయింది), మరునాడు ఆ ఇంటిలోనే రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ‘జే’ అంటూ జిన్నాను ఆప్యాయంగా పిలిచేదామె. గాఢంగా ప్రేమించింది. ప్రేమయాత్ర కోసం కశ్మీర్ వెళ్లారు. దాల్ సరస్సులో రూ. 50,000తో బోట్‌హౌస్‌కు అలంకారాలు చేయించిందామె. కాంగ్రెస్‌లో జిన్నా మితవాది. గోఖలే సలహాతో ముస్లింలీగ్‌లో చేరాడు. జిన్నాలోని మితభాషిని క్షమించింది గానీ, ఇంగ్లిష్ పాలనను ఆరాధించే మితవాదిగా, ముస్లింలీగ్ నేతగా మాత్రం సహించలేక పోయిందనిపిస్తుందామె. ‘జిన్నా ‘‘సర్ జిన్నా’’ అయితే, నేను వేరుగా ఉండడానికే ఇష్టపడతాన’ని చెప్పింది. అత్యాధునికంగా ముస్తాబై జిన్నాతో వెళుతుంటే లీగ్ సభ్యులు మండిపడేవారు. దేనికీ జిన్నా ఆమెను వారించలేదు. బ్రిటిష్ జాతంటే ఆమెకు ద్వేషం. వైస్రాయ్ లార్డ్ రీడింగ్‌కే కళ్లు బైర్లు కమ్మే సమాధానమిచ్చింది. ఢిల్లీలో వైస్రాయ్ ఇచ్చిన విందుకు జిన్నాతో పాటే వెళ్లింది. పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ‘నేను జర్మనీ వెళ్లాలి. కానీ వెళ్లలేను’ అన్నాడు రీడింగ్. ‘ఎందుకు?’ అనడిగింది రూతీ.‘వాళ్లకి బ్రిటిషర్లంటే పరమ ద్వేషం!’ అన్నాడు. ‘అయితే ఇక్కడికి మాత్రం ఎందుకొచ్చారు?’ అన్నదామె. జిన్నా, గాంధీ విభేదాలు తారస్థాయికి చేరినప్పుడు కూడా రూతీ నాగ్‌పూర్ కాంగ్రెస్ సదస్సుకు వెళ్లింది. అంతకు ముందే 1919 ఆగస్ట్ 14న వారికి కూతురు దీనా (వాడియా) పుట్టింది. తరువాత జిన్నా ముస్లింలీగ్ రాజకీయాలలో తలమునకలైపోయాడు. సంస్థ కేంద్రం ఢిల్లీకి మారింది. రూతీ వెళ్లలేదు. జిన్నా, అతడి అవివాహిత సోదరి ఫాతిమాల మీద నిరసనతో రూతీ మలబార్‌హిల్స్ నివాసం వదిలి తాజ్ హోటల్‌కు మకాం మార్చింది. అప్పటికే ఆమెకు పేగు క్యాన్సర్. సరిగ్గా పుట్టిన రోజునే అంటే 1929 ఫిబ్రవరి 20న ఆ హోటల్లోనే అనంతమైన దిగులుతో కన్నుమూసింది. అమ్మమ్మ అండతో దీనా పార్సీ మతస్థుడు నెవిల్లే వాడియాను జిన్నా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు నుస్లీ, డయానా. డయానా రెండు కాళ్లకూ పోలియో. తరువాత ఆ భార్యభర్తలు విడిపోయారు. నెవిల్లే విదేశాలలో. దీనా పిల్లలతో బొంబాయిలో. తనతో పాకిస్తాన్ వచ్చేయమని కూతురిని ఆర్తితోనే అడిగాడు జిన్నా. ఒక లేఖ రాసి ఆ ఇద్దరు పిల్లలతోనే తాతయ్యకి పంపింది దీనా. ‘నాన్నా! మీ ప్రయాణం సుఖంగా సాగాలి. మీరు సాధించుకున్న పాకిస్తాన్ సౌభాగ్యంతో వర్ధిల్లాలి. సదా మీ ఆశీస్సులు కోరుతూ, దీనా.’ అంతే. ఆగస్ట్ 7న బొంబాయిలోనే విమానం ఎక్కాక వెనక్కి తిరిగి 51 ఏళ్ల అనుబంధమున్న బొంబాయిని కంటి నిండుగా చూసుకున్నాడు జిన్నా. పాకిస్తాన్ వెళ్లాక ఇక్కడున్న తన రూతీ సమాధిని చూసే అవకాశం, జ్ఞాపకంగా ఎప్పుడైనా ఓ గులాబీనుంచే సందర్భం వస్తాయా? ప్రతి ఆగస్ట్ 14న పాకిస్తాన్ ఆవిర్భావ దినోత్సవానికి జెండా ఎగురవేస్తుంటే భారత్‌లోనే ఉండిపోయిన ఒక్కగానొక్క కూతురు దీనా పుట్టినరోజు గుర్తుకు రాకుండా ఉంటుందా? కానీ అలాంటి హింసాత్మక సంఘర్షణకు గురయ్యే పరిస్థితి నుంచి కాలమే అతడిని కరుణించింది. 1948 సెప్టెంబర్ 11న, పాకిస్తాన్ ఏర్పడిన మరుసటి ఏడాదే మేధస్సుతో కాకుండా, హృదయంతో స్పందించడం మొదలు పెడుతున్న వేళ బారిస్ట్టర్ జిన్నా చనిపోయాడు. -డా. గోపరాజు నారాయణరావు -
నేను నోరు జారాను!
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బాలీవుడ్ షాట్‌గన్ శత్రుఘ్నసిన్హా నోరుజారారు. ముస్లింలీగ్ నేత మహమ్మద్ ఆలీ జిన్నాను కాంగ్రెస్ ఫ్యామిలీలో చేర్చారు. మధ్యప్రదేశ్‌లోని చంద్వారాలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన శత్రుఘ్నసిన్హా ... కాంగ్రెస్ పార్టీని ప్రశంసల్లో ముంచెత్తే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ నుంచి సర్దార్ పటేల్ వరకూ, మహమ్మద్ ఆలీ జిన్నా నుంచి జవహర్లాల్ నెహ్రూ వరకూ దేశాభివృద్ధిలో కీలకభూమిక పోషించారని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. పాకిస్థాన్ వ్యవస్థాపకుడైన జిన్నాను కాంగ్రెస్ కుటుంబసభ్యునిగా పేర్కొంటూ శత్రుఘ్నసిన్హా చేసిన వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కామెంట్లపై ప్రత్యర్థులు మండిపడుతున్న నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా వివరణ ఇచ్చారు. తాను అనుకోకుండా నోరు జారానని, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్‌కు బదులు మహమ్మద్ జిన్నా పేరును తాను ఉచ్చరించానని ఆయన వివరణ ఇచ్చారు. -
జిన్నా హౌస్ ముమ్మాటికీ భారత్‌దే
న్యూఢిల్లీ: ముంబైలో 1930 దశకంలో పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా నివసించిన భవంతిని తమ కాన్సులేట్‌కు అప్పగించాలన్న పాక్ అభ్యర్థనను భారత్ తిరస్కరించింది. ఆ ఆస్తిపై భారత్‌కే పూర్తి హక్కు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ‘అది ప్రభుత్వ ఆస్తి. దాన్ని నవీకరించే పనిలో ఉన్నాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. భారత్‌లో పర్యటించే ప్రముఖ దేశాల అధ్యక్షులు, ప్రధానులతో భేటీ, విందు కోసం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌ను వినియోగిస్తున్న తరహాలో జిన్నా హౌస్‌ను ఆధునీకరించాలని కేంద్రం భావిస్తోంది. అయితే, ‘ఆ భవంతి మాదే అని భారత్ గతంలోనే అంగీకరించింది. అందుకు సంబంధించిన సాక్ష్యాలున్నాయి. భారతసర్కారు స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు’ అని ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో భారత్ గురువారం పైవిధంగా స్పందించింది. -
నా వ్యాఖ్యల్లో తప్పుంటే క్షమించండి
సాక్షి, బెంగళూరు: భారత తొలి ప్రధాని నెహ్రూ స్వార్థపరుడంటూ చేసిన వ్యాఖ్యలపై టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా క్షమాపణ చెప్పారు. మహ్మద్ అలీ జిన్నాను ప్రధాని చేయడానికి గాంధీ అనుకూలంగా ఉన్నా, నెహ్రూ స్వార్థపూరితంగా ఆలోచించారని బుధవారం దలైలామా అన్నారు. గాంధీ కోరుకున్నట్లు జిన్నా ప్రధాని అయ్యుంటే దేశ విభజన జరిగేది కాదన్నారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో క్షమాపణ చెప్పారు. ‘నేనేదైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. గాంధీ దేశ విభజనను వ్యతిరేకించారని విని నమ్మలేకపోయా. పాక్ కన్నా భారత్‌లో ముస్లింల జనాభా ఎక్కువ. గడిచిందేదో గడిచిపోయింది’ అని శుక్రవారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో అన్నారు. పాక్, భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దురదృష్టకరమని, భారత్ ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ సమస్య పరిష్కారానికి చొరవచూపాలన్నారు. తమ మాతృభూమి నుంచి వేలాదిగా వలసొచ్చిన టిబెటన్లను అక్కున చేర్చుకుని సొంత మనుషుల్లా చూస్తున్నందుకు భారత్ కృతజ్ఞతలు తెలిపారు. టిబెటన్ల సంస్కృతి పరిరక్షణకు నెహ్రూ ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం కుమారస్వామి పాల్గొన్నారు. -
‘ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటి వ్యక్తులే తప్పులు చేశారన్న తన వ్యాఖ్యల్లో ఎదైనా తప్పు ఉంటే తనని క్షమించాలని టిబెట్ బౌద్ధ గురువు దలైలామా కోరారు. ప్రతీ ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పుచేస్తారని, నెహ్రూ వంటి వ్యక్తులే తప్పులు చేశారని ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలు ఉద్దేశ పూరితంగా చేసినవి కావని, ఏమైనా తప్పుంటే తనని క్షమించాలని శుక్రవారం ట్వీట్ చేశారు. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇటీవల దలైలామా మాట్లాడుతూ.. దేశ తొలి ప్రధానిగా మహ్మద్ అలీ జిన్నాను చేయాలని మహాత్మ గాంధీ భావించారని, దానిని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారని దలైలామా పేర్కొన్నారు. దేశ ప్రధానిగా తనకు అవకాశం ఇవ్వాలని నెహ్రూ పట్టుబట్టినట్లు కూడా ఆయన తెలిపారు. మహ్మద్ అలీ జిన్నాను గనుక ప్రధాని చేసి ఉంటే అవిభాజ్య భారత్ ముక్కలైయ్యేది కాదని దలైలామా ఇటీవల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దలైలామా వ్యాఖ్యలపై బీజేపీ-కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో దలైలామా క్షమాపణలు కోరారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవమైనవని, గాంధీ మొదటి నుంచి జిన్నాను ప్రధాని చేయాలని ప్రయత్నించారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. నెహ్రూ కేవలం తన సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారన్న వ్యాఖ్యలు నిజమైనవని, ఇలాంటి చారిత్రాత్మక విషాయాలపై మరింత లోతుగా చర్చ జరగాల్సిన అవసరముందని స్వామి తెలిపారు. My statement has created controversy, if I said something wrong I apologise: Dalai Lama on his statement, "Mahatma Gandhi ji was very much willing to give Prime Ministership to Jinnah but Pandit Nehru refused." pic.twitter.com/jjIEmc280E — ANI (@ANI) August 10, 2018 -
‘ఆ ఇల్లు ముమ్మాటికి మనదే’
న్యూఢిల్లీ : ముంబై సమీపంలోని మలబార్ హిల్ ప్రాంతంలోని పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా ఇల్లు భారత ప్రభుత్వానిదేనని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ స్పష్టం చేశారు. జిన్నా ఇంటి ప్రస్తుత పరిస్థితి గురించి కర్నాల్ ఎమ్పీ అశ్విన్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఇలా స్పందించారు. లోక్‌సభలో ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘దక్షిణ ముంబైలో ఉన్న జిన్నా నివాసం భారత ప్రభుత్వానికి చెందిన ఆస్తి. ఈ నివాసం ‘ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్’ పరిధిలోకి రాదు. కేవలం శత్రు దేశాలకు చెందిన వారి ఆస్తులు మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. కానీ నిర్వాసిత ఆస్తి చట్టం 1950, ప్రకారం జిన్నా నివాసం ‘శరణార్ధి ఆస్తి’ కిందకు వస్తుందని’ తెలిపారు. ఇలాంటి ఆస్తులపైన వ్యక్తిగతంగా, ట్రస్టీగా, లబ్దిదారుగా ఉన్నా ఎలాంటి హక్కులు ఉండవన్నారు. జిన్నా ఆస్తిని వదిలిపెట్టే ప్రశ్నే తలెత్తదని ఆయన అభిప్రాయపడ్డారు. జిన్నా 1936లో లండన్ నుంచి ముంబై వచ్చారు. దేశ విభజనకు ముందే ముంబై సమీపంలోని మలబార్ హిల్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఇంటిని నిర్మించుకున్నారు జిన్నా. ఈ ఇంటికి ‘సౌత్ కోర్టు’ అని పేరు. స్వాతంత్య్ర పోరాట కాలంలో ముస్లీం లీగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ విభజన కోసం పట్టుబట్టారు. విభజన అంశంపై మహాత్మ గాంధీ, జిన్నా ఈ ఇంటిలోనే 1944, సెప్టెంబర్‌లో చర్చలు నిర్వహించారు. దేశ విభజన అనంతరం జిన్నా పాకిస్తాన్ వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా మరోవైపు పాకిస్తాన్ కూడా జిన్నా ఇంటి మీద దావా వేసింది. ఈ ఇంటి యాజమాన్య హక్కులను గౌరవిస్తూ ఈ ఆస్తిని తమకు అప్పజెప్పాలని భారత్‌ను కోరుతుంది. -
మోదీకి అలీగఢ్ యూనివర్సిటీ విద్యార్థుల లేఖ
లక్నో: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మహ్మద్ అలీ జిన్నా చిత్రపటాన్ని తొలగించాలని ఘర్షణలకు పాల్పడ్డ హిందుత్వ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్‌అలీ జిన్నా ఫొటోపై వివాదం రేగుతున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు యూనివర్సిటీలో జిన్నా చిత్రపటానికి వ్యతిరేకంగా దాడులకు పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దాడులకు పాల్పడుతూ, చారిత్రాత్మక యూనివర్సిటీ ఖ్యాతిని పోగొడుతున్న హిందుత్వ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యానాథ్, మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కి విద్యార్థులు శుక్రవారం లేఖ రాశారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ వాతావరణాన్ని చెడగొడుతున్న హిందూత్వ కార్యకర్తల మీద చర్యలు తీసుకోవాలని యూనైటేడ్ అరబ్ ఏమిరేట్స్‌లో(యూఏఈ) అల్యూమ్ని ఫోరమ్ తరఫున కూడా భారత కాన్సూలేటర్కి లేఖ రాశారు. యోగా గురువు రాందేవ్ బాబా జిన్నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని కూడా వారు లేఖలో పేర్కొన్నారు. జిన్నా పాకిస్తానీయులకు గొప్పవాడే, కానీ భారతీయులు అతన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదని రాందేవ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
జిన్నా ఫొటో అంత ముఖ్యమా!: రాందేవ్
పట్నా: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో వివాదంగా మారిన మహ్మద్ అలీ జిన్నా చిత్రపటంపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా స్పందించారు. ముస్లింలు చిత్ర పటాలకు, విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వరని, కానీ జిన్నా ఫొటోకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. బిహార్‌లోని ప్రతిష్టాత్మక నలందాలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో రాందేవ్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రాందేవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా వారి దేశానికి గొప్పవ్యక్తి కావచ్చు. భారతదేశ ఐక్యత, సమగ్రతను నమ్మేవారు జిన్నాను ఆదర్శ వ్యక్తిగా భావించకూడదు. ముస్లిం మతస్తులు విగ్రహాలకు, చిత్రపటాలకు ప్రాధాన్యత ఇవ్వరు. అందులో భాగంగానే జిన్నా చిత్రపటానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని’ పేర్కొన్నారు. కాగా మే 3న యూనివర్సిటీ విద్యార్థులకు, హిందూత్వ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో 28 మంది విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. -
అనవసర వివాదం
ఒక చిత్రపటం చుట్టూ అల్లుకున్న వివాదం ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)ని అట్టుడికిస్తోంది. సరిగ్గా ఏడు దశాబ్దాలక్రితం మరణించిన పాకిస్తాన్ జాతిపిత మహమ్మదాలీ జిన్నా చిత్రపటం ఆ యూనివర్సిటీ విద్యార్థి సంఘం కార్యాలయంలో ఉండొచ్చా లేదా అనే అంశంపై ఈ వివాదం రేకె త్తింది. ఆయన చిత్రపటంపై విద్యార్థుల్లో విభేదాలు తలెత్తితే అర్ధం చేసుకోవచ్చు. దాన్ని చక్కదిద్దడానికి యూనివర్సిటీ అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తారు. హద్దులుదాటి ప్రవర్తించిన విద్యార్థులపై చర్యలు తీసుకుంటారు. కానీ జిన్నా చిత్రపటంపై అభ్యంతరం లేవనెత్తినవారు స్థానిక బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్. దేశ విభజనకు కారకుడైన వ్యక్తి చిత్రపటం ఈ విశ్వవిద్యాలయంలో ఎలా ఉంచుతా రంటూ వైస్ చాన్సలర్‌కు ఆయనొక లేఖ రాశారు. తక్షణం తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అలా లేఖ రాసిన మూడు రోజులకు హిందూ యువవాహిని కార్యకర్తలు ప్రాంగణంలోకి చొరబడ్డారు. వారిని విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడి పోలీసులు లాఠీచార్జి, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. 1875లో ఒక కళాశాలగా ప్రారంభమై, 1920 కల్లా విశ్వవిద్యాల యంగా మారిన ఏఎంయూకి పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఇతర విశ్వవిద్యాలయాల తరహాలోనే అది కూడా మనుగడ కోసం, ఉన్నత ప్రమా ణాలను అందుకోవడం కోసం ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంది. అన్ని విశ్వవిద్యాలయాలూ ఎదుర్కొంటున్న అధ్యాపకుల కొరత ఏఎంయూకి కూడా ఉంది. ఇవి చాలవన్నట్టు మైనారిటీ విద్యా సంస్థ ప్రతిపత్తిని కోల్పోవడంతో రెండేళ్ల నుంచి దానికి ఆర్థిక ఇబ్బందులు కూడా మొదలయ్యాయి. ప్రాంగణంలో కట్టుబాట్ల పేరుతో అమలయ్యే ఆంక్షలు ఆమధ్య పెను వివాదాన్ని తెచ్చాయి. అక్కడ మంచి గ్రంథాలయం ఉన్నా విద్యార్థినులకు అందులో ప్రవేశం ఉండేది కాదు. దశాబ్దాల నుంచి అమలవుతున్న ఈ వివక్షపై 2014లో విద్యార్థినులు తిరగబడ్డారు. అమ్మా యిల్ని అనుమతిస్తే అక్కడికొచ్చే అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుం దని, దాంతో చోటు సమస్య తలెత్తుతుందని, ‘క్రమశిక్షణ’ దెబ్బతింటుందని వైస్ చాన్సలర్ చేసిన ప్రకటన అందరినీ దిగ్భ్రమపరిచింది. లింగ వివక్ష పాటించడం తగదని అలహాబాద్ హైకోర్టు చీవాట్లు పెట్టడంతో అధికారులు దారి కొచ్చారు. ఇలా విద్యా సంబంధ విషయాలపై, అధ్యాపకుల కొరతపై, సదు పాయాల లేమిపై ఆందోళనలు తలెత్తితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నడో 1938లో పెట్టిన జిన్నా చిత్రపటం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జిన్నాపై బీజేపీకి ఉన్న ఏవగింపులో దాపరికమేమీ లేదు. కానీ ఆ విషయంలో ఆ పార్టీ కీలక నేతలే గతంలో తీవ్రంగా విభేదించారు. 2005లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ కే అద్వానీ పాకిస్తాన్ సందర్శించి జిన్నా సమాధి వద్ద నివాళులర్పించ డంతోపాటు ఆయన్ను సెక్యులర్ నేతగా కొనియాడారు. చరిత్రపై చెరగని ముద్ర వేసిన అరుదైన నేతల్లో ఆయనొకరని కీర్తించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అద్వానీ పార్టీ అధ్యక్ష పదవి పోయింది. అయితే 2009లో ప్రధాని అభ్యర్థిగా ఆయన్ను నిర్ణ యించడానికి, 2014లో ఎంపీగా అవకాశమివ్వడానికి ఆ వ్యాఖ్యలు అడ్డురాలేదు. మరో సీనియర్ నేత జశ్వంత్ సింగ్ కూడా జిన్నాను కీర్తించారు. కాంగ్రెస్, నెహ్రూలు ఆయన్నొక భూతంగా చూపారని 2009లో వెలువరించిన గ్రంథంలో ఆరోపిం చారు. జశ్వంత్‌ను వెనువెంటనే పార్టీ నుంచి బయటకు పంపేసినా, మరో ఏడాదికి తిరిగి చేర్చుకున్నారు. 2012లో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. 2014 వరకూ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు వివాదం రేకెత్తడానికి కారకుడైన బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ తీరును ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లోని మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ప్రశ్నించారు. జిన్నా మహోన్నతుడని ప్రశంసిం చారు. తమ పార్టీ నేతల్లోనే ఇలా వేర్వేరు అభిప్రాయాలు పెట్టుకుని విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం కార్యాలయం మాత్రం జిన్నా చిత్రపటం పెట్టుకోరాదని ఎంపీ హుకుం జారీ చేయడం, దాన్ని అమలు చేయలేదని బయటి వ్యక్తులను దాడికి పంపడం ఆశ్చర్యకరం. జిన్నా మితవాద రాజకీయాలతో, దేశ విభజనకు కార ణమైన ఆయన సిద్ధాంతంతో ఎవరూ ఏకీభవించరు. అంతమాత్రాన స్వాతంత్య్ర సమరంలో, కాంగ్రెస్‌లో ఆయన పాత్రను విస్మరించలేం. ఆ సమరంలో పాలుపం చుకున్న నేతలు, ప్రముఖులు విశ్వవిద్యాలయాన్ని సందర్శించినప్పుడు విద్యార్థి సంఘంలో వారికి జీవితకాల సభ్యత్వాన్నిచ్చి, వారి చిత్రపటాన్ని కార్యాలయంలో ఉంచడం ఆనవాయితీ. అలా 1938లో జిన్నా చిత్రపటం అక్కడ చేరింది. సరోజినీ నాయుడు, రాజగోపాలాచారి, డాక్టర్ సీవీ రామన్, బ్రిటన్ రచయిత ఈ ఎమ్ ఫార స్టర్ తదితరుల చిత్రపటాలు కూడా అక్కడున్నాయి. పైగా 1938 నాటికి జిన్నా దేశ విభజన కోరలేదు. రెండు దేశాలుగా విడిపోయి ఉండొచ్చుగానీ మన చరిత్రతో, సంప్రదాయంతో ముడిపడ్డ అనేక ప్రదేశాలు పాకిస్తాన్లో ఉన్నాయి. అక్కడి తక్షశిలలోనే చాణక్యుడు అర్థశాస్త్రాన్ని రాశాడు. సంస్కృత వ్యాకరణకర్త పాణిని తన ప్రస్థానాన్ని ప్రారం భించింది తక్షశిలలోనే. ఆయుర్వేదానికి ఆద్యుడనదగ్గ చరకుడు అక్కడి వాడే. మహాభారతంలో ప్రస్తావనకొచ్చే ప్రదేశాలు, బౌద్ధానికి సంబంధించిన అనేక చారి త్రక విశేషాలు పాక్‌లో ఉన్నాయి. విప్లవవీరుడు భగత్‌సింగ్ భారత్, పాకిస్తాన్ల ఉమ్మడి హీరో అని పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. చరిత్ర మనం కోరుకున్నటు ఉండదు. అందులో మంచిని స్వీకరించి, విషాదకర ఘట్టాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని మున్ముందుకెళ్లడమే మనం చేయగలిగే పని. జిన్నాపై మనకెలాంటి అభిప్రాయాలున్నా ఆయనలోని అనుకూలాంశాలు, ప్రతికూ లాంశాలు చర్చించుకోగలం తప్ప వాటిని తుడిచేయడం సాధ్యపడదు. విశ్వవిద్యాల యాలకు, ప్రత్యేకించి ఏఎంయూకు ఎన్నో సమస్యలుండగా పాలకపక్షంగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయడానికి బదులు అనవసర వివాదాలను రేకెత్తించడం బీజేపీకి తగని పని. -
చరితార్థుల చిత్రపటం
తాజా పుస్తకం గుల్జార్ తీసిన ‘మేచిస్’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది- ‘మనకు స్వాతంత్య్రం తెచ్చింది ఎవరు అని అడిగితే అందరూ గాంధీజీ అని సమాధానం చెప్తారు... గాంధీజీ ఒక్కడేనా మనకు స్వాతంత్య్రం తెచ్చింది?’ అవును. గాంధీజీ ఒక్కడేనా మనకు స్వాతంత్య్రం తెచ్చింది. పోనీ నెహ్రూ, నేతాజీ, పటేల్, భగత్ సింగ్... వీళ్లు మాత్రమేనా? ఎన్ని చేతులు ఖండితమైతే ఈ స్వాతంత్య్రం వచ్చింది. ఎన్ని కాళ్లు గమ్యం వైపు నడిస్తే ఈ స్వాతంత్య్రం వచ్చింది. ఎన్ని వేల లక్షల కంఠాలు ఖంగున మోగితే ఈ స్వాతంత్య్రం వచ్చింది. ఎందరు అజ్ఞాతవీరులు తమ జీవితాలను త్యాగం చేస్తే ఈ స్వాతంత్య్రం వచ్చింది. గెలుపుకు హక్కుదారులుగా నాయకులను చూడటానికే చరిత్ర అంగీకరిస్తుంది. బంట్లను నిరాకరిస్తుంది. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు చేసిన పోరాటంపై వారి త్యాగంపై పడవలసినంత వెలుగు పడిందా? జరగవలసినంత ప్రచారం జరిగిందా? మహమ్మద్ అలీ జిన్నా, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, జాకీర్ హుసేన్... ఈ ముగ్గురు నలుగురు మాత్రమేనా ముస్లింలలో నాయకులు. ఇది సరైన ప్రాతినిధ్యమేనా? కాదు అనంటారు ‘చరితార్థులు’ రచయిత సయ్యద్ నసీర్ అహమద్. ఈ దేశంపై ముస్లింల హక్కును నిరాకరించే, ఈ దేశ నిర్మాణంలో ముస్లింల కృషిని చిన్నచూపు చూసే, వారిని న్యూనతతో మూలకు నెట్టివేసే కుత్సితాలు కొన్ని జరుగుతున్న దరిమిలా ముస్లింలు ఎందులోనూ తక్కువకారని ముఖ్యంగా స్వాతంత్య్రపోరాటంలో వారు గొప్ప త్యాగం, పోరాటం చేశారని ఇప్పటికే పలు పుస్తకాలతో నిరూపించిన నశీర్ అహమద్ ఇప్పుడు తాజాగా ‘చరితార్థులు’ పేరుతో 156 మంది ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల పరిచయాలను గుది గుచ్చి తన వాదనను మరికాస్త గట్టిగా వినిపించారు. ఈస్టిండియా కంపెనీపై తొలి ఖడ్గం ఎత్తి అమరుడైన బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, ‘క్యాష్ బ్యాగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’గా గాంధీజీ చేత ప్రశంసలు పొంది తన గొప్ప వితరణతో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన హజీ ఉస్మాన్ సేట్, గాంధీజీ చేత ‘సంపూర్ణ స్వరాజ్యం’ నినాదాన్ని ఒప్పించిన మౌలానా హస్రత్ మోహనీ, గాంధీజీ మీద విషప్రయోగం చేయమని ఆశ జూపిన బ్రిటిష్‌వారిని ఎదిరించి గాంధీజీకి ఈ సంగతి చెప్పి ఆయన ప్రాణాలు కాపాడి ఉద్యోగం పోగొట్టుకొని గర్భ దరిద్రంలో మగ్గిన బతఖ్ మియా అన్సారి, హైదరాబాద్ స్టేట్‌ను ఇండియన్ యూనియన్‌లో కలపాలని ఉద్యమాన్ని లేవదీసి నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించిన సయ్యద్ నాసిర్ హసన్, తన కవితా జ్వాలలతో ఉద్యమాన్ని రగిలించిన మగ్దూమ్ మొహియుద్దీన్, సుభాష్ చంద్రబోస్‌కు ‘నేతాజీ’ బిరుదు ఇచ్చి ఆయన వెన్నంటే ఉండి ‘జైహింద్’ నినాదాన్ని సృష్టించిన ఆబిద్ హసన్ సఫ్రాని... ఎందరని. ఎన్నో కాగడాలు మండి బ్రిటిష్ రాజ్యాధికారాన్ని దహించాయి. ఎన్నో గొప్ప మూర్తిమత్వాలు పంతం పట్టి తెల్లవాళ్లను తరిమికొట్టాయి. ఇవాళ కాకపోతే రేపు ఈనాడు కాకపోతే మరునాడు వీరందరూ వెలుగులోకి రావలసిందే. నాయకులకు ఇచ్చే గౌరవం నేతలది. కాని వెంట ఉండి బలం ఇచ్చిన సిపాయిలకు ఇవ్వాల్సిన గౌరవం సిపాయిలది. కుల, మత, వర్గ, లింగ భేదం లేకుండా లక్షలాది మంది చేసిన త్యాగఫలం మన స్వాతంత్య్రం. దేశం కోసం పని చేసిన వారందరి కృషినీ వెలికి తెచ్చే ప్రయత్నాలు మరిన్ని జరగాలి. ప్రతి పేరునూ దీపంగా చేసి వెలిగించాలి. ముస్లింలలో అలాంటి చరితార్థులను ఎన్నో వ్యయప్రయాసలతో తిరిగి పాఠకులకు అందించిన ఈ ప్రయత్నం గౌరవనీయమైనది. ప్రతి చరిత్ర అధ్యాపకుడు, ఔత్సాహిక సామాజిక పరిశీలకుడు, పరిశోధకుడు తప్పక పరిశీలించ దగ్గ గ్రంథం ఇది. ఈ పుస్తకంలో సమాచారం ఒక ఎత్తయితే చిత్రకారుడు జస్టిస్ వేసిన ముఖచిత్రాలు ఒక ఎత్తు. ఆ మహనీయులను తన పెన్సిల్ రేఖలలో సజీవంగా సమర్థంగా చూపించారు. ఇటీవలి తెలుగు పరిశోధన గ్రంథాలలో ఒక మంచి ప్రయత్నం - చరితార్థులు. చరితార్థులు- బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ముస్లిం యోధులు రచన: సయ్యద్ నసీర్ అహమద్; బొమ్మలు: జస్టిస్ వెల: రూ.1000; ప్రతులకు: 9440241727 - నెటిజన్ కిశోర్