2600 కోట్ల జిన్నా ప్యాలెస్‌.. నేలమట్టం! | Demolish Jinnah House in mumbai | Sakshi
Sakshi News home page

2600 కోట్ల జిన్నా ప్యాలెస్‌.. నేలమట్టం!

Published Mon, Mar 27 2017 4:24 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

2600 కోట్ల జిన్నా ప్యాలెస్‌.. నేలమట్టం! - Sakshi

2600 కోట్ల జిన్నా ప్యాలెస్‌.. నేలమట్టం!

ఆ భవనం విభజనకు ప్రతీక.. దానిని కూల్చాల్సిందే: బీజేపీ నేత

దక్షిణ ముంబైలో ఉన్న మహమ్మద్‌ అలీ జిన్నా ప్యాలెస్‌ను కూల్చాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ బిల్డర్‌ మంగల్‌ ప్రభాత్‌ లోధా డిమాండ్‌ చేశారు. ఈ విస్తారమైన భవనాన్ని కూల్చి.. ఇక్కడ సాస్కృంతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అసెంబ్లీలో కోరారు. 2.5 ఎకరాల విస్తారమైన ప్రదేశంలో సముద్రానికి అభిముఖంగా యూరోపియన్‌ శైలిలో నిర్మితమైన ఈ భవనం విలువ రూ. 2600 కోట్లకు (400 మిలియన్‌ డాలర్ల)కుపైగా ఉంటుంది.

'దక్షిణ ముంబైలోని జిన్నా నివాసంలోనే దేశ విభజన కుట్రకు బీజాలు పడ్డాయి. జిన్నా నివాసం విభజనకు ప్రతీక. కాబట్టి ఆ నిర్మాణాన్ని కూల్చాల్సిందే' అని ఆయన పేర్కొన్నారు. అత్యంత విలాసవంతంగా రూపొందిన ఈ కట్టడంలో 1982 వరకు బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ నివసించారు. ఆ తర్వాత ఈ భవనాన్ని ఎవరూ వినియోగించకపోవడంతో ఇది ప్రస్తుతం చాలావరకు శిథిల దశకు చేరుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ భవనం ప్రభుత్వ ఆస్తి అని, దీనిని కూల్చడమొక్కటే ప్రస్తుతమున్న ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement