Mangal Prabhat Lodha
-
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై వీడిన సందిగ్ధం
సాక్షి, ముంబై: బీజేపీ మహారాష్ట్ర నూతన అధ్యక్షుడిగా విదర్భకు చెందిన ప్రముఖ ఓబీసీ నేత, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ భావన్‌కుళే నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ అధిష్టానం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్‌కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడైన ఎమ్మెల్యే సంజయ్ కుంటే పేరు కూడా అధ్యక్ష పదవికి వినిపించినప్పటికీ భావన్‌కుళే వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చంద్రకాంత్ పాటిల్ ఇటీవల లోక్‌నాథ్ షిండే కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో నూతన అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓబీసీ నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్టు కనబడుతోంది. ముంబై రీజియన్ బీజేపీ అధ్యక్షుడిగా ఆశిష్ శేలార్ ఎంపికయ్యారు. ఇటీవల షిండే మంత్రివర్గంలో చేరిన మంగళ్ ప్రభాత్ లోధా స్థానంలో ఆయన నియమితులయ్యారు. బాంద్రా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆశిష్.. గతంలో బీజేపీ-శివసేన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కాగా, లోక్‌నాథ్ షిండే కేబినెట్లో అత్యంత ధనవంతుడైన మంత్రిగా మంగళ్ ప్రభాత్ లోధా గుర్తింపు పొందారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ రూ.441 కోట్లు. (క్లిక్: షిండే వర్గం కోసం శివసేన కొత్త భవనం?) -
రియల్టీ కింగ్ ఎంపీ లోధా
ముంబై: కరోనాతో రియల్ ఎస్టేట్ మార్కెట్లో విక్రయాలు గణనీయంగా పడిపోయిన 2020లోనూ కొందరు రియల్ ఎస్టేట్ డెవలపర్లు సంపద గడించారు. హరూన్ ఇండియా టాప్ 100 సంపన్న రియల్టర్ల జాబితా 2020లోకి కొత్తగా ఎనిమిది మంది వచ్చి చేరారు. ముఖ్యంగా దేశంలో అత్యంత సంపన్న రియల్టర్‌గా లోధా డెవలపర్స్ అధినేత (మాక్రోటెక్), బీజేపీ నేత మంగళ్ ప్రభాత్ లోధా(ఎంపీ లోధా) నిలిచారు. ఈ జాబితాలో వరుసగా నాలుగో ఏడాది మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. హరూన్ ఇండియా రియల్ ఎస్టేట్ సంపన్నుల జాబితా 2020 మంగళవారం విడుదలైంది. దేశంలోని టాప్ 100 రియల్టర్ల సంపద 2019తో పోలిస్తే గతేడాది (2020) 26 శాతం పెరిగి రూ.3,48,660 కోట్లకు చేరుకుంది. సగటున చూస్తే ఒక్కొక్కరి తలసరి సంపద రూ.3,487 కోట్లు. 6,000 కంపెనీలను ఈ జాబితాలోకి హరూన్ పరిగణనలోకి తీసుకుంది. ఆదాయం, నికర విలువ ఆధారంగా టాప్-100 మంది సంపన్న రియల్టర్ల జాబితాను రూపొందించింది. దేశంలోని 15 పట్టణాల నుంచి 71 కంపెనీలకు చెందిన 100 మంది ఈ జాబితాలో ఉన్నారు. విడిగా చూస్తే.. 65 ఏళ్ల ఎంపీ లోధా, ఆయన కుటుంబ ఆస్తి ఏడాది కాలంలో 39 శాతం పెరిగి రూ.44,270 కోట్లకు విస్తరించింది. 2014 నుంచి 2020 మధ్య విక్రయాల పరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా లోధా డెవలపర్స్ నిలిచింది. స్థల విస్తీర్ణం పరంగా చూస్తే రెండో స్థానంలో ఉంది. డీఎల్ఎఫ్ (61) అధినేత రాజీవ్‌షా రూ.36,430 కోట్లతో జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. డీఎల్ఎఫ్ షేరు ర్యాలీ చేయడంతో ఆయన సంపద 45 శాతం వృద్ధి సాధించింది. చంద్రు రహేజా (80), కే రహేజా కుటుంబ సంపద 70 శాతం పెరిగి రూ.26,260 కోట్లకు చేరుకుంది. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానంలో నిలిచారు. ఎంబïసీ ఆఫీస్ పార్క్స్‌కు చెందిన జితేంద్ర వీర్వాణి రూ.23,220 కోట్ల సంపదతతో నాలుగో స్థానంలో ఉన్నారు. నిరంజన్ హిరనందాని రూ.20,600 కోట్లు (హిరనందాని కమ్యూనిటీస్), ఒబెరాయ్ రియాల్టీకి చెందిన వికాస్ ఒబెరాయ్ (రూ.15,770 కోట్లు), రాజా బగ్మానే రూ.15,590 కోట్లు, రున్వాల్ డెవలపర్స్ సుభాష్ రున్వాల్ (రూ.11,450 కోట్లు), పిరమల్ రియల్టీ అధినేత అజయ్ పిరమల్ (రూ.5,560 కోట్లు), ఫోనిక్స్ మిల్స్ అధినేత అతుల్ రుయా రూ.6,340 కోట్లతో వరుసగా 10 స్థానాల్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఐదుగురు హరూన్ సంపన్న రియల్ ఎస్టేట్ డెవలపర్ల జాబితా 2020లో హైదరాబాద్ నుంచి ఐదుగురు కూడా ఉన్నారు. అపర్ణ కన్స్ట్రక్షన్స్ అధినేతలు సీ వెంకటేశ్వర రెడ్డి రూ.5,230 కోట్లు, ఎస్ సుబ్రమణ్యం రెడ్డి రూ.5,180 కోట్ల సంపదతో అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో టాప్ డెవలపర్లుగా జాబితాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మైహోమ్ కన్స్ట్రక్షన్స్కు చెందిన జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుటుంబ సంపద రూ.4,957 కోట్లుగా ఉంది. జాబితాలో జూపల్లి రామేశ్వరరావు 11వ స్థానంలో నిలిచారు. మధ్య స్థాయి ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లను నిర్మించే సంస్థల్లో మైహోమ్ కన్స్ట్రక్షన్స్ నంబర్1గా నిలిచింది. 12, 13వ స్థానాల్లో వరుసగా వెంకటేశ్వరరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి ఉన్నారు. ఎస్ఏఎస్ ఇన్ఫ్రాకు చెందిన జీవీరావు, ఆయన కుటుంబం రూ.1,010 కోట్ల నికర విలువతో 49వ స్థానంలో ఉండగా.. తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ అధినేత జీవీకే రెడ్డి, ఆయన కుటుంబం రూ.460 కోట్లతో 72వ ర్యాంకును దక్కించుకున్నారు. చదవండి: ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవు -
రియల్టీ కుబేరులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో అత్యంత ధనికుడిగా మాక్రోటెక్ డెవలపర్స్ (గతంలో లోధా డెవలపర్స్) అధినేత మంగళ్ ప్రభాత్ లోధా నిలిచారు. ఈయన సంపద విలువ రూ.31,960 కోట్లు. దేశంలోని రియల్టీ కుబేరుల్లో లోధా వరుసగా రెండు సార్లు అగ్రస్థానంలో నిలిచినట్లు ‘హురున్– గ్రోహే’ సంస్థలు ఇండియాపై సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. లోధా ప్రస్తుతం బీజేపీ ముంబై శాఖ అధ్యక్షుడు కూడా. గతేడాదితో పోలిస్తే లోధా కుటుంబ సంపద 18 శాతం వృద్ధి చెందింది. 100 మందితో కూడిన ఈ జాబితాలో మిగతా 99 మంది రియల్టీ టైకూన్స్ సంపదలో లోధా కుటుంబ సంపద వాటా 12 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలియజేసింది. 100 మంది సంపద 2,77,080 కోట్లు.. దేశంలో అగ్రస్థానంలో ఉన్న 100 మంది రియల్టీ టైకూన్స్ సంపద విలువ రూ.2,77,080 కోట్లుగా అంచనా. గతేడాదితో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధి చెందినట్లు ‘హురున్– గ్రోహే ఇండియా ద రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్– 2019’ నివేదిక తెలియజేసింది. ఈ వంద మంది జాబితాలో 37 మంది ముంబైవాసులే. ఢిల్లీలో 19 మంది, బెంగళూరులో 19 మంది ఉన్నారు. ఈ పారిశ్రామికవేత్తల సగటు వయసు 59 ఏళ్లు. ఆరుగురు మాత్రం 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు. ముగ్గురు 80 ఏళ్లు పైబడిన వారు. 8 మంది మహిళలకు చోటు.. ఈ జాబితాలో తొలిసారి 8 మంది మహిళలకు స్థానం దక్కింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ స్మిత వీ స్రిశ్న మహిళల్లో టాప్‌లో ఉండగా.. మొత్తం జాబితాలో 14వ స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.3,560 కోట్లు. తర్వాతి స్థానాల్లో డీఎల్ఎఫ్కు(కమర్షియల్) చెందిన రేణుక తల్వార్(సంపద రూ.2,590 కోట్లు) పాయ్ సింగ్ (రూ.2,370 కోట్లు), ఎమ్మార్ ఈజీఎఫ్ ల్యాండ్ శిల్పా గుప్తా (రూ.730 కోట్లు), సూపర్‌టెక్ సంగీత అరోరా (రూ.410 కోట్లు), గోపాలన్ ఎంటర్ప్రైజెస్ ఎం వసంత కుమారీ (రూ.310 కోట్లు), వాటికా కమర్షియల్ విభాగం కాంచన భల్లా (రూ.300 కోట్లు) నిలిచారు. మై హోమ్.. యంగ్ టైకూన్స్ దేశంలోనే యువ ధనిక రియల్టీ టైకూన్స్గా హైద రాబాద్లోని మై హోమ్ గ్రూప్‌నకు చెందిన జూపల్లి రామురావు, జూపల్లి శ్యామ్‌రావు చోటు దక్కించుకున్నారు. వీళ్ల వయ స్సు 33 ఏళ్లు. వీరి సంపద విలువ రూ.740 కోట్లు. ఈస్ట్ ఇండియా హోటల్స్‌కు చెందిన పృథ్వీరాజ్ సింగ్ ఒబెరాయ్... వృద్ధ రియల్టీ టైకూన్‌గా నిలిచారు. ఈయన వయస్సు 90 ఏళ్లు. ఈయన సంపద రూ.3,670 కోట్లు. రామురావు, శ్యామ్‌రావు -
2600 కోట్ల జిన్నా ప్యాలెస్.. నేలమట్టం!
ఆ భవనం విభజనకు ప్రతీక.. దానిని కూల్చాల్సిందే: బీజేపీ నేత దక్షిణ ముంబైలో ఉన్న మహమ్మద్ అలీ జిన్నా ప్యాలెస్‌ను కూల్చాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ బిల్డర్ మంగల్ ప్రభాత్ లోధా డిమాండ్ చేశారు. ఈ విస్తారమైన భవనాన్ని కూల్చి.. ఇక్కడ సాస్కృంతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అసెంబ్లీలో కోరారు. 2.5 ఎకరాల విస్తారమైన ప్రదేశంలో సముద్రానికి అభిముఖంగా యూరోపియన్ శైలిలో నిర్మితమైన ఈ భవనం విలువ రూ. 2600 కోట్లకు (400 మిలియన్ డాలర్ల)కుపైగా ఉంటుంది. 'దక్షిణ ముంబైలోని జిన్నా నివాసంలోనే దేశ విభజన కుట్రకు బీజాలు పడ్డాయి. జిన్నా నివాసం విభజనకు ప్రతీక. కాబట్టి ఆ నిర్మాణాన్ని కూల్చాల్సిందే' అని ఆయన పేర్కొన్నారు. అత్యంత విలాసవంతంగా రూపొందిన ఈ కట్టడంలో 1982 వరకు బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ నివసించారు. ఆ తర్వాత ఈ భవనాన్ని ఎవరూ వినియోగించకపోవడంతో ఇది ప్రస్తుతం చాలావరకు శిథిల దశకు చేరుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ భవనం ప్రభుత్వ ఆస్తి అని, దీనిని కూల్చడమొక్కటే ప్రస్తుతమున్న ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు.