Shah Rukh Khan Pathaan Movie Four Days Collections Cross Rs.400 cr Mark - Sakshi
Sakshi News home page

Pathaan Collections: బాక్సాఫీస్‌ దాహాన్ని తీరుస్తున్న షారుక్‌.. నాలుగు రోజుల్లో రూ.400 కోట్లు!

Published Sun, Jan 29 2023 5:24 PM | Last Updated on Sun, Jan 29 2023 6:54 PM

Shah Rukh Khan Pathaan Movie Four Days Collections Cross Rs.400 cr Mark - Sakshi

'షారుక్‌ను ఆపొచ్చేమో కానీ పఠాన్‌ను ఎలా ఆపగలరు?' గతేడాది మార్చిలో కండలు తిరిగిన ఫోటో షేర్‌ చేస్తూ దానికి ఈ క్యాప్షన్‌ జోడించాడు షారుక్‌ ఖాన్‌. సరిగ్గా ఇప్పుడదే జరుగుతోంది. బాక్సాఫీస్‌ దగ్గర పఠాన్‌ను ఆపడం ఎవ్వరి తరం కానట్లే కనిపిస్తోంది. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ భారీ కలెక్షన్లు లేక బోసిపోయిన బాలీవుడ్‌కు కొత్త కళను తీసుకొచ్చింది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతూ రికార్డులు తిరగరాస్తోంది.

కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.429 కోట్లు రాబట్టింది. ఇందులో ఒక్క ఇండియాలోనే రూ.265 కోట్లు రాగా ఓవర్సీస్‌లో రూ.164 కోట్లు వసూలు చేసింది. దీంతో షారుక్‌​ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. కాగా పఠాన్‌ సినిమాలో షారుక్‌ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించింది. సిద్దార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో జాన్‌ అబ్రహం విలన్‌ పాత్రలో నటించాడు.

చదవండి: ఖరీదైన కారు కొన్న బుల్లితెర నటి
సుశాంత్‌ చనిపోయేముందు మెసేజ్‌ వచ్చింది, కానీ నేనే పట్టించుకోలే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement