Amid Pathaan's success Shah Rukh Khan tweet about his comeback - Sakshi
Sakshi News home page

Pathan Movie: మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు.. రికార్డులు బద్ధలు కొడుతున్న పఠాన్‌

Jan 28 2023 8:44 AM | Updated on Jan 28 2023 11:22 AM

Shah Rukh Khan Tweet on Pathaan Success and his Comeback - Sakshi

'వెనక్కు తిరిగిరావడం కోసం ప్లాన్‌ చేసుకోవద్దు. మున్ముందుకే అడుగులు వేయాలి. వెనక్కి తగ్గొద్దు. ప్రారంభించిన పనిని ముగించేందుకు ప్రయత్నించండి' అని సోషల్‌ మీడియాలో కింగ్‌ ఖాన్‌ సూచించారు. ఈ సినిమా విజయం పట్ల షారుక్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పఠాన్‌. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. తొలిరోజు నుంచే వసూళ్ల వేట మొదటి పెట్టిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.

దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుక్‌ ఖాన్‌ వెండితెరపై సందడి చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 'వెనక్కు తిరిగిరావడం కోసం ప్లాన్‌ చేసుకోవద్దు. మున్ముందుకే అడుగులు వేయాలి. వెనక్కి తగ్గొద్దు. ప్రారంభించిన పనిని ముగించేందుకు ప్రయత్నించండి' అని సోషల్‌ మీడియాలో కింగ్‌ ఖాన్‌ సూచించారు. ఈ సినిమా విజయం పట్ల షారుక్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

చదవండి: జమున బయోపిక్‌లో స్టార్‌ హీరోయిన్‌
కూతుర్ని హీరోయిన్‌గా చూడాలనుకున్న జమున

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement