గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. వాటిలో పఠాన్, జవాన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సాధించి, రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఇక డిసెంబర్‌లో వచ్చిన ‘డంకీ’కూడా మంచి వసూళ్లను సాధించి, షారుఖ్‌కి హ్యాట్రిక్ హిట్‌ని అందించింది. ఇలా ఒకే ఏడాదిలో మూడు సినిమాలను రిలీజ్ చేసి, వాటిలో రెండు చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఏకైక హీరోగా షారుఖ్ చరిత్ర సృష్టించాడు.
(చదవండి: చాలా ఎళ్ల నుంచి అతనితో డేటింగ్‌లో ఉన్నాను: తాప్సీ)
తాజాగా బాలీవుడ్ బాద్‌షా హాలీవుడ్ హీరోలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు. యాక్షన్, ఫైట్స్, స్టంట్స్ విషయంలో హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడడానికి పఠాన్, జవాన్ సినిమాలు సిద్ధమయ్యాయి. ఇటీవల ప్రకటించిన వల్చర్ 2023 ఆన్యువల్ స్టంట్ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్‌లో షారుఖ్ నటించిన ‘జవాన్, పఠాన్ చిత్రాలు ఉన్నాయి. కేను రీవ్స్ నటించిన ‘జాన్ విక్ 4’, టామ్ క్రూజ్ హీరోగా చేసిన ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ వన్’ లాంటి హాలీవుడ్ చిత్రాలతో ఇవి పోటీ పడనున్నాయి.
(చదవండి: రొమాంటిక్ డ్రామాతో హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ)
బెస్ట్ వెహిక్యులర్ స్టంట్, బెస్ట్ స్టంట్ ఇన్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరీల్లో జవాన్, బెస్ట్ ఏరియల్ స్టంట్, బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరిల్లో ‘పఠాన్’ నామినేట్ అయింది. ఇక బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరిలో హాలీవుడ్‌కి చెందిన ‘బెలరినా’, ‘గై రిచీస్ ది కోవనెంట్, ఎక్స్‌ట్రాక్షన్ 2, ఫిస్ట్ ఆఫ్ ది కోండర్’, ‘జాన్ విక్ - చాప్టర్ 4’, ‘మిషన్ ఇంపాజిబుల - డెడ్ రెకనింగ్ పార్ట్ 1’, ‘సైలెంట్ నైట్’, ‘షిన్ కామెన్ రైడర్ చిత్రాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment