‘కింగ్‌ ఖాన్‌’ బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. పఠాన్‌ టీజర్‌ వదిలిన మూవీ టీం | Shah Rukh Khan Birthday: Pathan Movie Teaser Out | Sakshi
Sakshi News home page

Pathan Teaser Out: ఆకట్టుకుంటున్న ‘కింగ్‌ ఖాన్‌’ పఠాన్‌ టీజర్‌

Published Wed, Nov 2 2022 1:41 PM | Last Updated on Wed, Nov 2 2022 1:49 PM

Shah Rukh Khan Birthday: Pathan Movie Teaser Out - Sakshi

నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్‌ ‘బాద్‌షా’ షారుక్‌ ఖాన్‌ నటించిన చిత్రం పఠాన్‌. 2018లో వచ్చిన జీరో మూవీ ప్లాప్‌తో ఆయన సినిమాలకు కాస్తా విరామం తీసుకున్నాడు. చాలా గ్యాప్‌ తర్వాత యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ పఠాన్‌తో మూవీతో బౌన్స్‌ బ్యాక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు షారుక్‌. ఇదిలా ఉంటే నేడు షారుక్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా కింగ్‌ ఖాన్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు పఠాన్‌ మేకర్స్‌. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ‘పఠాన్‌ గురించి నీకు ఏం తెలుసు?’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ను ఫైట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఆసక్తిగా మలిచారు.  ‘‘మూడేళ్ల నుంచి అతడి జాడ లేదు. చివరి మిషన్‌లో అతడు పట్టుబడ్డాడు.

చదవండి: మరోసారి విష్ణుప్రియ ఫేస్‌బుక్‌లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’

అతడిని వేధించారని విన్నా. పఠాన్‌ ఇంకా బతికే ఉన్నాడో లేదో తెలియదు’’ అనే డైలాగ్‌తో షారుక్‌ పాత్రని పరిచయం చేశారు. ‘బతికే ఉన్నా’ అంటూ టీజర్‌లో బాద్‌షా ఎంట్రీ ఫ్యాన్స్‌ చేత ఈళలు వేయించడం ఖాయం అనిపిస్తోంది. ఇంతకీ ఈ పఠాన్‌ ఎవరు? అతడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? ఇందులో జాన్‌ అబ్రహం పాత్ర ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న ఈసినిమా విడుదల కానుంది.

చదవండి: ‘గాడ్‌ ఫాదర్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement