latest movies news in telugu, latest film news in telugu, latest bollywood news in telugu - Sakshi
Sakshi News home page

Deepika Padukone : అసభ్యకర సంజ్ఞతో దీపికా ఫైర్‌.. ఫోటో వైరల్‌

Published Tue, Mar 22 2022 1:51 PM | Last Updated on Tue, Mar 22 2022 3:23 PM

Deepika Padukone Showing Her Middle Finger in Leaked Pics From Pathaan Set - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో దీపికా పదుకొణె ఒకరు. పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ స్పెయిన్‌లో జరుగుతోంది. అక్కడ దీపికా పదుకొణె, షారుఖ్‌లకు సంబంధించిన కీలక సన్నీవేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ సంబంధించిన ఫోటోలు లీకైన విషయం తెలిసిందే. స్పెయిన్‌లో బహిర్గత ప్రదేశంలోనే షూటింగ్‌ జరగడంతో.. అక్కడి మీడియా దీపికా ఫోటోలను క్లిక్‌ మనిపించింది. అవి కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. వైరల్‌గా మారాయి. అందులో దీపికా లోదుస్తులు ధరించి, హాట్‌గా కనిపించడంతో.. నెటిజన్స్‌ నెగెటివ్‌ కామెంట్స్‌ చేశారు.

దీంతో దీపికా మీడియాపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలు లీకైన మరుసటి రోజు షూటింగ్‌ స్పాట్‌కి వచ్చిన మీడియాపై దీపికా ఫైర్‌ అయిందట. మిడిల్‌ ఫింగర్‌ని చూపిస్తూ.. తన కోపాన్ని వెల్లగక్కింనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. దీపిక మిడిల్‌ ఫింగర్‌ చూపిస్తున్ననప్పుడు షారుఖ్‌ పక్కనే ఉండడం గమనార్హం. దీపికా చేసిన పనికి నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సెట్‌ నుంచి ఫోటోలు లీకవ్వడం సహజం.. దానికే దీపికా ఇలా రెచ్చిపోవాలా? ఎంత పొగరు? అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అయితే దీపికా నిజంగానే మీడియాకు మిడిల్‌ ఫింగర్‌ చూపించిందా? లేదా షూటింగ్‌లో భాగంగా అలా చేసిందా అనేది మాత్రం తెలియరాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement