నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్ జడేజా, అశ్విన్ స్పిన్ మాయాజాలం దెబ్బకు రెండున్నర రోజుల్లోనే ముగిసిపోయింది. 224 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ అశ్విన్ దెబ్బకు 91 పరుగులకే కుప్పకూలింది. ఇక బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన జడేజాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
కాగా మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలు బాలీవుడ్ బ్లాక్‌బాస్టర్ పఠాన్ సినిమాలోని 'జూమే జో పఠాన్' సూపర్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్ స్టెప్పులతో అలరించారు. మొదట కోహ్లి డ్యాన్స్ మూమెంట్స్ చేయగా.. ఆ తర్వాత జడేజా అతన్ని అనుకరిస్తూ స్టెప్పులతో సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరగనుంది.
Kohli & Jadeja doing jhoome jo pathaan step? 😂❤️ #INDvsAUS #pathaan #ShahRukhKhan𓀠 #ViratKohli𓃵 #RavindraJadeja pic.twitter.com/089U6NjOwg
— Aarush Srk (@SRKAarush) February 11, 2023
చదవండి: IND VS AUS 1st Test: డేవిడ్ వార్నర్‌పై పగపట్టిన అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment