Shah Rukh Khan Stuns Fans With His Eight Pack Look Goes Viral - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: షారుక్‌ను ఆపొచ్చేమో కానీ పటాన్‌ను ఎలా ఆపగలరు?

Mar 28 2022 8:11 AM | Updated on Mar 28 2022 10:57 AM

Shah Rukh Khan Stuns Fans With His Eight Pack Look - Sakshi

‘షారుక్‌ని కావాలంటే కాస్త ఆపొచ్చేమో. కానీ పటాన్‌ను ఎలా ఆపగలరు. అతను యాప్స్, యాబ్స్‌ తయారు చేసుకుంటుంటే...’ అంటూ కొంచెం చమత్కారంతో కూడిన క్యాప్షన్‌తో తన 8 ప్యాక్‌ లుక్‌ను షేర్‌ చేశారు షారుక్‌.

ఐదు పదుల వయసులోనూ తగ్గదేలే అంటున్నారు షారుక్‌ ఖాన్‌. కుర్ర హీరోల మాదిరి తన లేటెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పటాన్‌’ కోసం షారుక్‌ ఖాన్‌ ఎయిట్‌ ప్యాక్స్‌ చేశారు. ‘షారుక్‌ని కావాలంటే కాస్త ఆపొచ్చేమో. కానీ పటాన్‌ను ఎలా ఆపగలరు. అతను యాప్స్, యాబ్స్‌ తయారు చేసుకుంటుంటే...’ అంటూ కొంచెం చమత్కారంతో కూడిన క్యాప్షన్‌తో తన 8 ప్యాక్‌ లుక్‌ను షేర్‌ చేశారు షారుక్‌.

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుక్, దీపికా పదుకోన్, జాన్‌ అబ్రహాం ప్రధాన తారాగణంగా ‘పటాన్‌’ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. పాటలతో పాటు కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘పటాన్‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

చదవండి: అప్పుడు ఈ ప్రపంచమే వద్దనిపించింది.. ప్రకాశ్‌రాజ్‌ కామెంట్స్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement