Shah Rukh Khan, Deepika Padukone 'Pathaan' Telugu Trailer Out - Sakshi
Sakshi News home page

Pathaan Movie Trailer: హైవోల్టేజ్‌ యాక్షన్స్‌తో‘ పఠాన్‌’.. ట్రైలర్‌ అదిరిపోయింది!

Published Tue, Jan 10 2023 12:36 PM | Last Updated on Tue, Jan 10 2023 1:05 PM

Shah Rukh Khan, Deepika Padukone Pathaan Telugu Trailer Out - Sakshi

బాలీవుడ్‌ ‘బాద్‌షా’ షారుక్ ఖాన్‌, బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొణె జంటగా నటించిన లేటెస్ట్‌ మూవీ పఠాన్‌. ఎన్నో వివాదాల అనంతరం ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హై వోల్టేజ్‌ యాక్షన్‌ మూవీ ఈ నెల(జనవరి) 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించాడు.

చదవండి: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న దళపతి విజయ్‌ కుమారుడు! హీరోగా కాదు!

ఇక ప్రమోషన్స్‌ ప్రారంభించిన చిత్రం బృందం తాజాగా హిందీతో పాటు తెలుగు, తమిళంలో ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఎంటర్‌టైన్‌ చేయబోతున్నట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. మొత్తం యాక్షన్‌ సీక్వెన్స్‌తో ట్రైలర్‌ను మలిచారు. ఇక ఇందులో షారుక్ అజ్ఞాతవాసంలో ఉండే గుఢాచారి అని తెలుస్తోంది.

చదవండి: కోర్టు మెట్లు ఎక్కిన శిల్పా శెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరిన హైకోర్టు

ఆయన రీఎంట్రీ ఇస్తూ ‘ఒక సైనికుడు తనకోసం దేశం ఏం చేసిందని అడగడు.. దేశం కోసం తాను ఏం చేయగలనా అని ఆలోచిస్తాడు’ అని షారుక్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. చాలా గ్యాప్‌ తర్వాత షారుక్‌ ఈ చిత్రంలో మంచి కమ్‌ బ్యాక్‌ ఇవ్వబోతున్నాడని చెప్పవచ్చు.  ఇక దీపికా సైతం యాక్షన్స్‌లో హీరోకు, విలన్‌కు పోటీ పడి నటించందని చెప్పవచ్చు. కాగా ఇందులో జాన్‌ అబ్రహం విలన్‌గా నటించగా.. డింపుల్‌ కపాడియా ప్రధాన పాత్రలో కనిపించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement