Shah Rukh Khan Reply To Fan Who Asked about Pathaan Remuneration - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరో బయటపెట్టిన షారుక్‌

Published Thu, Jan 12 2023 9:01 PM | Last Updated on Thu, Jan 12 2023 9:25 PM

Shah Rukh Khan Reply to Fan Who Asked about Pathaan Remuneration - Sakshi

బాలీవుడ్‌ స్టార్స్‌ షారుక్‌ ఖాన్‌, దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ పఠాన్‌. ఎన్నో వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ చిత్రం జనవరి 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో వీలు చిక్కినప్పుడల్లా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేస్తున్నాడు షారుక్‌. తాజాగా ట్విటర్‌లో మరోసారి అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ రకరకాల ప్రశ్నలు సంధించగా వాటికి ఓపికగా వినూత్నంగా ఆన్సరిచ్చాడు హీరో.

పఠాన్‌ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారు అని ఓ అభిమాని డైరెక్ట్‌గా అడిగేశాడు. దీనికి షారుక్‌.. ఎందుకు బాబూ.. నీ నెక్స్ట్‌ సినిమాకు ఏమైనా సంతకం చేయాలా? అని ఫన్నీగా కౌంటరిచ్చాడు. పఠాన్‌ షూటింగ్‌లో బెస్ట్‌ పార్ట్‌ ఏంటో చెప్పండి అన్న ప్రశ్నకు.. ఈ సినిమా కోసం ఎంతోమంది యువకులు పనిచేస్తున్నారు. వారితో కలిసి పగలూరాత్రులు పనిచేయడం సంతోషంగా ఉంది అని రిప్లై ఇచ్చాడు. ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరన్న ప్రశ్నకు తన భార్య గౌరి అని సమాధానమిచ్చాడు. ఇకపోతే యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాను సిద్దార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఇందులో షారుక్‌ గూఢచారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి విశాల్‌ శేఖర్‌ సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: చెత్త సినిమాలకు జనాలు డబ్బులు పెట్టరు, అందుకే మానేశా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement