Pathaan Telugu Movie Twitter Review - Sakshi
Sakshi News home page

Pathaan Twitter Review: ‘పఠాన్‌’ చిత్రానికి అలాంటి టాక్‌.. షారుఖ్‌ హిట్‌ కొట్టాడా?

Published Wed, Jan 25 2023 7:49 AM | Last Updated on Wed, Jan 25 2023 9:01 AM

Shah Rukh Khan Pathaan Movie Twitter Review In Telugu - Sakshi

నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ ‘పఠాన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ నేడు(జనవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్‌ చేశాయి.

ఈ సినిమాపై వచ్చిన వివాదాలు కూడా ప్రచారానికి తోడైయ్యాయి. దీంతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఈ సినిమా రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య నేడు విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌ షో డిపోయింది. దీంతో బుధవారం తెల్లవారుజామునుంచే ట్విటర్‌ ద్వారా ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘పఠాన్‌’కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ ద్వారా చర్చిస్తున్నారు. వాటిపై ఓ లుక్కేయండి.

పఠాన్ ట్రైలర్ చూసి ఈ సినిమా కథను ఊహిస్తే కూడా పొరబడినట్టే. ట్రైలర్‌లో కథను ఏ మాత్రం కూడా రివీల్ చేయలేదు.. పస్టాఫ్‌ అంతా కూడా ఎంతో గ్రిప్పింగ్‌గా, ఇంటెన్స్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంది.. షారుఖ్‌ ఎప్పుడూ ఓ అద్భుతమే అని ఓ నెటిజన్ కామెంట్‌ చేశాడు.

కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌. పఠాన్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అంటూ 4.5 రేటింగ్‌ ఇచ్చాడు ఓ నెటిజన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement