Prabhas Adipurush Movie Day 4 Box Office Collections, Drops On Monday - Sakshi
Sakshi News home page

Adipurush Day 4 Collections: పఠాన్ రికార్డు బద్దలు కొట్టాడు కానీ..

Published Tue, Jun 20 2023 12:38 PM | Last Updated on Tue, Jun 20 2023 1:43 PM

Adipurush Prabhas Box Office Collection Day 4 Drop Monday - Sakshi

మెగా-బడ్జెట్‌తో రాముడిగా ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌కు డివైడ్‌ టాక్‌ వచ్చినా ఫస్ట్ వీకెండ్‌లో భారీ వసూళ్లను రాబట్టింది. తొలి మూడురోజులకు గాను ఏకంగా రూ. 340 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. తాజాగా నాలుగురోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ. 375 కోట్లు కలెక్ట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.  కానీ ఆదిపురుష్‌ సినిమాకు  సోమవారం నుంచి అగ్నిపరీక్ష మొదలైంది. కలెక్షన్లు ఒక్కసారిగా 75% పడిపోయాయి. బాక్స్ ఆఫీస్ ఇండియా లెక్కల ప్రకారం  సోమవారం ఈ సినిమా ఆల్ ఇండియా (నెట్) కలెక్షన్ దాదాపు రూ. 20 కోట్లు మాత్రమే అని తేల్చేసింది. 

బాలీవుడ్‌లో సోమవారం నికరంగా రూ.8 కోట్లు మాత్రమే వసూళు చేసినట్లు తెలుస్తోంది.   ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్కడ మొదటి నాలుగు  రోజులకు రూ. 113 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

(ఇదీ చదవండి: మెగా వారసురాలు అంటూ.. వీడియోలు షేర్‌ చేస్తున్న ఫ్యాన్స్‌)

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ 

ఇప్పటివరకు ఏపీ, తెలంగాణలో రూ.72 కోట్లకు పైగా షేర్ సాధించింది. గ్రాస్‌ ప్రకారం అయితే రూ. 113 కోట్లు అవుతుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రూ.70 కోట్ల షేర్‌ వరకు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే అది జరగటం కష్టమే అనిపిస్తుంది. మరో పది రోజులపాటు సినిమాకు కలెక్షన్స్‌ ఉంటేనే ఇదే సాధ్యమవుతుంది. లేదంటే ప్రభాస్ ఖాతాలో వరుసగా మరో డిజాస్టర్ పడినట్టే అవుతుంది అనడంలో సందేహంలేదు.

(ఇదీ చదవండి: సుధాకర్‌ కొడుక్కి అండగా మెగాస్టార్‌, ఆ బాధ్యత చిరంజీవిదేనట!)

పఠాన్ రికార్డు బద్దలు కొట్టాడు కానీ..
మొదటి వీకెండ్‌లో ఆదిపురుష్ కలెక్షన్స్‌ పఠాన్‌ సినిమాను దాటాయి. అప్పటి వరకు పఠాన్‌ పేరుతో ఉన్న రూ. 313 కోట్ల రికార్డ్‌ను ఆదిపురుష్‌ అధిగిమించింది.   కానీ పఠాన్‌ ఫైనల్‌ కలెక్షన్స్‌ అయిన  రూ. 1000 కోట్ల గ్లోబల్ మార్క్‌ను ఆదిపురుష్‌ అధిగమించలేదని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.  ఆదిపురుష్‌కు ప్రారంభం నుంచే డివైడ్‌ టాక్‌ వచ్చింది. దీంతోనే చాలా వరకు నష్టపోయిందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపాడు.

అంతే కాకుండా సినిమాలోని VFX భాగలేదనే టాక్‌ రావడమే కాకుండా క్యారెక్టర్ డిజైన్ కూడా బాగాలేదని కామెంట్లు వచ్చాయి. చివరికి ఈ సినిమా జాతీయ వివాదానికి కూడా దారితీసింది అని ఆయన తెలిపాడు. అందువల్ల ఈ సినిమా భారీ నష్టాలను మిగల్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement