సింహాలు ఇంటర్వ్యూలకు వెళ్లవు, సేమ్‌ టు సేమ్‌..: షారుక్‌ | Pathaan Movie: Shah Rukh Khan Reveals Why He Did not Give Any Interviews | Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: సింహాలెక్కడైనా ఇంటర్వ్యూలిస్తాయా? నేనూ అంతే..

Published Sun, Jan 29 2023 7:09 PM | Last Updated on Sun, Jan 29 2023 7:20 PM

Pathaan Movie: Shah Rukh Khan Reveals Why He Did not Give Any Interviews - Sakshi

పఠాన్‌ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌. సుమారు నాలుగేళ్ల తర్వాత వెండితెరపై కనిపించిన బాద్‌షా తన ఎంట్రీతోనే రికార్డులు బద్ధలు కొట్టాడు. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఊగిసలాడుతున్న బాలీవుడ్‌కు ఊపిరి పోశాడు. షారుక్‌​ పఠాన్‌ మూవీ దక్షిణాదిలో పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయినప్పటికీ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం దుమ్మురేపుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం పఠాన్‌ హిట్‌ను ఎంజాయ్‌ చేస్తున్న షారుక్‌ #AskSRK ద్వారా సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు.

పఠాన్‌కు పబ్లిక్‌ నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది?
షారుక్‌ : పాటలు పాడా, డ్యాన్స్‌ చేశా.. నవ్వుకున్నాను. పఠాన్‌ సంబరాలు చేసుకునేటప్పుడు పక్కవాళ్లను సైతం దృష్టిలో ఉంచుకోండి.

డింపుల్‌ కపాడియా, అశుతోష్‌ రానాతో పనిచేయడం ఎలా ఉంది?
షారుక్‌ : డింపుల్‌, అశుతోష్‌ గొప్ప నటులు. వారితో పనిచేయడం మర్చిపోలేను. ఒక సీన్‌లో అయితే భలే ఫన్నీగా ఉంటారు.

పఠాన్‌ చూశాను. కానీ దీని కంటే జీరోనే బాగుంది
షారుక్‌ :మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు. కానీ దురదృష్టవశాత్తూ జీరోని లక్షల్లోనే వదిలేశారు.

పఠాన్‌ సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే ఏమనిపిస్తోంది?
షారుక్‌ :మళ్లీ పాత రోజులకు వెళ్లినట్లు ఉంది

అమ్మాయిలెవరూ నన్ను ఇష్టపడటం లేదు. ఏదైనా టిప్‌ ఇవ్వండి
షారుక్‌ :టిప్స్‌ ఇచ్చేంత సమయం లేదు

జిమ్‌ (జాన్‌ అబ్రహం) కొడుతున్నప్పుడు పఠాన్‌కు ఎలా అనిపించింది?
షారుక్‌ :జిమ్‌ చాలా ధృడమైన వ్యక్తి. నన్ను చాలా గట్టిగా కొట్టాడు. ఉఫ్‌.. ఆ భగవంతుడి వల్ల క్షేమంగా అతడి నుంచి తప్పించుకున్నా

పఠాన్‌ హిట్టయింది కానీ సల్మాన్‌తో బాక్సాఫీస్‌ వద్ద మీరు పోటీపడలేరు?
షారుక్‌ :సల్మాన్‌ భాయ్‌ ఎప్పటికీ గొప్పవాడే!

ప్రమోషన్స్‌కు ఎందుకు దూరంగా ఉన్నారు?
షారుక్‌ :సింహాలు ఇంటర్వ్యూల్లో పాల్గొనవు. కాబట్టి నేను కూడా ఈ సారి ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్నాను.

చదవండి: కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌ ఇల్లు చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement